newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?

30-05-202030-05-2020 07:00:45 IST
2020-05-30T01:30:45.617Z30-05-2020 2020-05-30T01:30:42.421Z - - 05-08-2020

ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌పై కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,466 కరోనా కేసులు నమోదు కాగా, మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,65,799కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, దేశంలో ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 71,105 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 4,706 మంది మృతిచెందారు. ప్రస్తుతం 89,987 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో, గుజరాత్‌లలో కరోనా తీవ్రత అధికంగా ఉంది.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి ఇవాల్టికి 66 రోజులు గడిచాయి. మే 31 సమీపిస్తుండగా భారత్‌లో పరిస్థితులు అదుపు తప్పుతున్న సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. కరోనా మరణాల్లో చైనాను అధిగమించిన భారత్ రోజుకు పది వేల కరోనా రోగుల నమోదు చేరువవుతోంది. శుక్రవారం ఉదయానికి భారత్‌లో 1,65,799 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 4,706 మంది మరణించారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో దేశంలోనే అత్యధిక సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. 

దేశ వాణిజ్య రాజధాని ముంబైని కరోనా కమ్మేస్తోంది. అక్కడ గురువారం ఒక్క రోజే 1,438 కొత్త కొవిడ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 35,273కు చేరింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా గురువారం ఒక్క రోజే 194మంది మరణించారు. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,566 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాకు 4,531మంది బలయ్యారు. వారం రోజుల నుంచి ప్రతి రోజూ ఆరు వేలకుపైగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కరోనాతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 2,598 కొత్త కేసులు నమోదయ్యాయి.  తాజా 134మంది పోలీసులకు కరోనా సోకింది. దీంతో ఇప్పటివరకు కరోనా బారినపడిన మహారాష్ట్ర పోలీసుల సంఖ్య 2,095కు చేరింది. 

మహారాష్ట్రలో కరోనా అంతకంతకూ తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే.. కొత్తగా మహారాష్ట్రను మరో భయం వెంటాడుతోంది. కరోనా మరణాల సంఖ్య కూడా ఉన్నట్టుండి పెరిగింది. గురువారం కూడా మహారాష్ట్రలో కొత్తగా 2598 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు మహారాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. అంతేకాదు, మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 1,024 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16వేలు దాటింది. బెంగాల్‌లో గురువారం ఒక్కరోజే 344 కేసులు నమోదయ్యాయి. బెంగాల్‌లో ఒక్కరోజులో ఇన్నికేసులు మొదటిసారి నమోదయ్యాయి. కేరళలో కూడా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. గురువారం 84 కేసులు బయటపడ్డాయి. అసోంలో 24మందికి పాజిటివ్‌ వచ్చింది. 

గడచిన రెండునెలల్లో ఒక్క అహ్మదాబాద్‌లోనే 100కు పైగా వైద్యులు కొవిడ్‌ బారిన పడినట్లు భారతీయ వైద్యమండలి వెల్లడించింది. అందులో చాలామంది డిశ్చార్జ్‌ కూడా అయ్యారని పేర్కొంది. కాగా హిమాచల్‌ప్రదేశ్‌లోని హమిపూర్‌లో క్వారంటైన్‌లో ఉన్న 15మందిని పరీక్షల ఫలితాలు రాకుండానే ఇళ్లకు పంపేయడం కలకలం సృష్టంచింది. వారికి కరోనా ఉన్నట్లు పరీక్షల్లో బయటపడడంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

క్వారంటైన్ కేంద్రాల్లో 23 లక్షలమంది

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో సుమారు 23 లక్షల మంది ఉన్నారని కేంద్రం ప్రకటించింది. దేశంలోపల ప్రయాణాలు చేసినవారు, విదేశాల నుంచి వచ్చినవారు, ఇతరులు అందులో ఉన్నారని పేర్కొంది. మహారాష్ట్రలో అత్యధికంగా 6.02 లక్షల మంది,గుజరాత్‌లో 4.42 లక్షల మంది నిర్బంధంలో ఉన్నారన్నారు. బుధవారం వరకు 91 లక్షల మంది వలస కూలీలను రైళ్లు, బస్సుల్లో స్వస్థలాలకు పంపించినట్లు కేంద్రం తెలిపింది. అత్యధికంగా వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లిన రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌. అక్కడ సుమారు 3.6 లక్షల మంది క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే, వారిలో అత్యధికులు హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు.

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   5 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   9 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle