newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ఒక్కరోజులో 50 వేల కేసులు.. మొత్తం 14 లక్షలు దాటినా కేసులు

28-07-202028-07-2020 08:49:20 IST
Updated On 28-07-2020 09:17:51 ISTUpdated On 28-07-20202020-07-28T03:19:20.905Z28-07-2020 2020-07-28T03:05:48.503Z - 2020-07-28T03:47:51.698Z - 28-07-2020

ఒక్కరోజులో 50 వేల కేసులు.. మొత్తం 14 లక్షలు దాటినా కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 49,931 తాజా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో కరోనా పాజిటివ్‌ కేసులు ఈ స్ధాయిలో పెరగడం ఇదే తొలిసారి. తాజా కేసులతో భారత్‌లో కోవిడ్‌-19 కేసులు 14,35,453కు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 708 మరణాలు చోటుచేసుకోవడంతో కరోనా మరణాల సంఖ్య 32,771కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. వైరస్‌ వేగంగా ప్రబలుతున్న తీరును చూస్తే మరో 48 గంటల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు 15 లక్షలకు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,85,114 యాక్టివ్‌ కేసులుండగా, వ్యాధి నుంచి 9,17,568 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. 

దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 3,75,799 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా ఆదివారం 5,15,472 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,68,06,803 కరోనా పరీక్షలు నిర్వహించారని వెల్లడించింది. 

భారత్‌లో వరుసగా ఐదో రోజు 45 వేలకుపైగా కేసులు బయటపడ్డాయి. 24 గంటల్లో 49,931 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. అలాగే 708 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దేశంలో మొత్తం కేసులు 14,35,453కు, మరణాలు 32,771కు చేరాయని కేంద్రం సోమవారం ప్రకటించింది. 9,17,567 మంది బాధితులు చికిత్స అనంతరం కోలుకున్నారు. 

మరోవైపు కరోనా మహమ్మారిని నిరోధించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో జరుగుతున్న వ్యాక్సిన్‌ పరీక్షలు కీలక దశకు చేరాయి. మోడెర్నా వ్యాక్సిన్‌ అభివృద్ధికి అమెరికా రూ 7500 కోట్ల నిధులను సమకూర్చాలని నిర్ణయించింది. కాగా, కరోనా వైరస్‌ నివారణకు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, అస్ట్రాజెనెకా సంస్థ కలిసి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ను భారత్‌లో త్వరలో 5 చోట్ల వేలాది మందిపై ప్రయోగించనుంది.

ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, ఏపీ, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, తెలంగాణ, బిహార్‌ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. సోమవారం ఉదయం నాటికి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు లక్ష దాటగా 1,090 మంది మరణించారు. ఇప్పటివరకు 49,558 మంది కోలుకోగా, 51,701 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో ఏపీలో 49 మంది మృతిచెందారు. 

గత నాలుగు రోజులుగా ప్రతిదినం 30వేల మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది. కరోనా కాలంలో రిటైరయ్యే కేంద్ర ఉద్యోగులకు తాత్కాలిక పెన్షన్‌  అందుతుందని తెలిపింది. గత 6 వారాల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రెట్టింపైందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. 

కరోనాపై భారత్- ఇజ్రాయెల్ సంయుక్త పోరాటం

కేవలం 30 సెకండ్లలో ఫలితాన్ని వెల్లడించే ర్యాపిడ్‌ కరోనా టెస్టింగ్‌ కిట్‌ అభివృద్ధికి ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇందుకోసం ఇజ్రాయెల్‌ రక్షణ శాఖకు చెందిన ఆర్‌అండ్‌డీ శాస్త్రవేత్తల బృందం ప్రత్యేక విమానంలో సోమవారం భారత్‌కు చేరుకుంది. అత్యాధునిక వైద్య పరికరాలను  వెంట తీసుకొచ్చింది. నిజానికి ఈ పరికరాలను ఇజ్రాయెల్‌ నుంచి ఎగుమతి చేయడంపై నిషేధం ఉంది. అయినప్పటికీ ప్రత్యేక అనుమతితో భారత్‌కు తరలిం చారు.

టెస్టింగ్‌ కిట్‌ అభివృద్ధి విషయంలో ఈ బృందం భారత్‌ చీఫ్‌ సైంటిస్టు కె.విజయ్‌ రాఘవన్, డీఆర్‌డీవోతో కలిసి పనిచేయనుంది. ఈ టెస్టింగ్‌ కిట్‌ అందుబాటులో వస్తే అది కరోనాపై పోరులో కీలక మలుపు అవుతుందని ఇజ్రాయెల్‌ రాయబారి రోన్‌ మాల్కా పేర్కొన్నారు. కరోనాపై కలిసి పోరాడుదామని భారత్, ఇజ్రాయెల్‌  నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   9 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle