newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

ఒక్కరోజులో 2,028 మంది మృతి.. కేసుల్లోనూ మరణాల్లోనూ అమెరికాదే ప్రపంచ రికార్డు

12-04-202012-04-2020 12:38:53 IST
Updated On 12-04-2020 13:19:34 ISTUpdated On 12-04-20202020-04-12T07:08:53.736Z12-04-2020 2020-04-12T07:08:47.569Z - 2020-04-12T07:49:34.206Z - 12-04-2020

ఒక్కరోజులో 2,028 మంది మృతి.. కేసుల్లోనూ మరణాల్లోనూ అమెరికాదే ప్రపంచ రికార్డు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మృత్యువు అడ్డూ అదుపూ లేకుండా ప్రళయతాండవం చేస్తే ఎలా ఉంటుందో అమెరికా ప్రత్యక్షంగా చూస్తోంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా అమెరికాలో కోవిడ్‌–19 విధ్వంసం సృష్టిస్తోంది. శనివారం రాత్రి వరకు అమెరికాలో 20,042 మంది మృతి చెందారు. అంతకుముందు ఒక్కరోజులోనే 2,108 మంది కరోనా మృతులు నమోదు కావడంతో అమెరికా ప్రతికూల ఫలితాల్లోనూ ప్రపంచ రికార్డును సృష్టించేసింది. ఒకే రోజు 2,104 మరణాలు నమోదైన తొలి దేశంగా నిలిచింది. 

కాగా వైరస్ సోకిన వారి సంఖ్య కూడా అమెరికాలో 5 లక్షలు దాటింది. ఇది ప్రపంచంలోనే అత్యధికమని జాన్స్ హోప్కిన్స్ యూనివర్శిటీ డేటా చెబుతోంది. కరోనా వైరస్ ప్రారంభ కేంద్రమైన చైనాలో గత మూడునెలలుగా 81,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 3,339 మరణాలు నమోదయ్యాయి. అదే వైరస్ యూరప్ అమెరికాలకు వ్యాపించి ఇంతవరకు లక్షమందికిపై గా బలిగొంది. 

ఇక, పాజిటివ్‌ కేసుల విషయంలో అమెరికా ప్రపంచ రికార్డును అధిగమించింది. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,21,042 దాటినట్టు జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 35 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కొవిడ్‌-19 వ్యాప్తికి న్యూయార్క్‌ కేంద్రంగా ఉన్నట్టు తెలిపింది. దీని తర్వాత స్థానంలో న్యూజెర్సీ ఉంది. ఈ రెండు ప్రాంతాల్లోనే ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసిస్తుండడం గమనార్హం. 

ఇకపోతే మరణాల విషయంలో కూడా అమెరికా ఇటలీని దాటేసింది. ప్రపంచంలో అత్యధికంగా 18,848 మంది కరోనా మరణాలు సంభవించిన ఇటలీని అతి త్వరలో అమెరికా శనివారం నాటికి దాటేసింది. అమెరికా, ఇటలీ తర్వాత స్పెయిన్‌లో 16,000 మంది, జర్మనీలో 13,000 మంది కరోనా వైరస్ బారిన పడి మరణించారని  జాన్స్ హోప్కిన్స్ యూనివర్శిటీ డేటా తెలిపింది. 

అమెరికాలో కరోనా వైరస్ ఎపి సెంటర్‌గా ఆవిర్భవించిన న్యూయార్క్ నగరంలో 1.7 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏ దేశంలో ఏ నగరంలో చూసుకున్నా ఇది రికార్డు. ఇంతవరకు న్యూయార్క్‌లో కరోనా బారిన పడి 7,800 మంది మరణింగా, న్యూజెర్సీలో 2 వేలమంది చనిపోయారు. ఈ నగరంలో 54 వేలమందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

శనివారం రాత్రికి అందిన లెక్కల ప్రకారం అమెరికాలో 20,042 మంది కరోనాతో మృతి చెందారు. అయితే, తమ దేశంలో కరోనామృతుల సంఖ్య మొదట్లో అనుకున్న దానికన్నా తగ్గుతుందని, ఇది 60 వేలలోపు ఉండొచ్చని అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు. పౌరులను కాపాడేందుకు ప్రభుత్వం రేయింబవళ్లు శ్రమిస్తోందని, ఇక కరోనా పరిష్కారం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించిన ట్రంప్‌, 50 రాష్ట్రాలను అతి పెద్ద పెనుముప్పు ఉన్నవిగా ప్రకటించారు.ఆయా రాష్ట్రాల్లో ప్రజలు ఇంటికేపరిమితం కావాలన్నారు. 

కరోనా మహమ్మారి దెబ్బకు అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ పరిస్థితి దారుణంగా మారింది. మృతదేహాలను పూడ్చడానికి చోటు లేకపోవడంతో న్యూయార్క్‌లో బ్రాంక్స్‌ సమీపంలోని ఓ ద్వీపం(హార్ట్‌ ఐలాండ్‌)లో సామూహిక ఖననం చేశారు. భారీగా కరోనా మృతదేహాలను తెలుపు రంగు బాక్సుల్లో ఉంచి, ఒకేసారి ఒకదానిపైన ఒకటి కుప్పలు కుప్పలుగా పేరుస్తూ పూడ్చిపెట్టారు. కుటుంబ సభ్యులుగానీ, తెలిసిన వారుగానీ ఎవరూలేకుండానే అంత్యక్రియలను నిర్వహించారు.

కాగా ఈ వారం ప్రత్యేకింజి అమెరికాకు భయానకమైన, భీకరమైన వారంగా మిగలనుందని మరణాల సంఖ్యను కూడా ఈవారంలో ఊహించలేమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ వారం అమెరికా పాలిట అల్ ఖైదా ఉగ్రదాడిగా, పెరల్ హార్బర్ ఘటనగా పరిణమించనుందని  అమెరికా సర్జన్ జనరల్ జెరోమ్ ఆడమ్స్ చెప్పారు. కొత్త అంచనాల ప్రకారం అమెరికాలో కరోనా వైరస్ బారిన పడి 60 వేలమంది చనిపోయే అవకాశం ఉందని సమాచారం.

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించే పరిణామాలు కనబడకపోవడంతో దేశంలోని 50 రాష్ట్రాల్లోనూ జాతీయ అత్యవసరపరిస్థితిని ప్రకటిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో 33 కోట్ల మంది జనాభాలో 95 శాతంపైగా స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. 

అయితే అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా దాని చరమదశకు చేరుకోలేదని వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ సభ్యురాలు డాక్టర్ డెబోరా బ్రిక్స్ హెచ్చరించారు. అందుకే నిన్నటి రోజు, వారం క్రితం, అంతకు ముందువారం ఏ జాగ్రత్తలు తీసుకున్నామో అవన్నీ ఈరోజు, రేపు, వచ్చే వారం కూడా తీసుకోవాల్సిందేనని అమె తెలిపారు.

ఈ ప్రాణాంతక  వైరస్‌ సోకి 40 మందికి పైగా భారతీయ సంతతికి చెందిన వారు మరణించారు. వీరిలో12 మంది వరకు భారతీయ పౌరులు ఉన్నట్టు తెలుస్తోంది. కోవిడ్‌తో కన్నుమూసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఇద్దరు, కేరళకు చెందిన వారు 17 మంది, గుజరాతీయులు 10 మంది, నలుగురు పంజాబీయులు, ఒడిశాకు చెందిన వారు ఒకరు ఉన్నారు. న్యూయార్క్‌లో వెయ్యి మందికిపైగా, న్యూజెర్సీలో 400 మందికి పైగా ఇండియన్‌ అమెరికన్లకు వైరస్‌ సోకింది. కోవిడ్‌ బాధితులకు సాయం చేయడానికి ఇప్పటికే పలు ప్రవాస భారతీయ సంస్థలు రంగంలోకి దిగాయి. స్థానిక యంత్రాంగంతో కలిసి తమ వంతు సాయం అందిస్తున్నాయి. 

న్యూయార్క్, న్యూజెర్సీలోని మినీ ఇండియాగా పిలిచే ఓక్‌ ట్రీ రోడ్డులో మృతుల సంఖ్య అత్యధికంగా ఉంది. న్యూయార్క్‌లో 15 మంది, న్యూజెర్సీలో 12 మందికి పైగా, ఫ్లోరిడా, పెన్సిల్వేనియాలో నలుగురు చొప్పున, టెక్సాస్, కాలిఫోర్నియాలో ఒక్కొక్కరు మరణించినట్టు అమెరికాలో స్థానిక అధికారులు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్ని గతంలో ఎప్పుడూ చూడలేదని ఓక్‌ ట్రీ రోడ్డులో వ్యాపారం చేస్తున్న ప్రవాస భారతీయుడు భవేష్‌ దవే అన్నారు. ప్రాణాలు కోల్పోయిన భారతీయుల్లో సున్నోవా అనలిటికల్‌ సీఈవో మారేపల్లి హనుమంతరావు, న్యూజెర్సీ పారిశ్రామికవేత్త చంద్రకాంత్‌ అమిన్‌(75), మహేంద్ర పటేల్‌ (60) ఉన్నారు.

మరికొందరు భారతీయుల పరిస్థితి విషమంగా ఉండడంతో ప్లాస్మా డోనర్ల కోసం పలు ప్రవాస భారతీయ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు న్యూజెర్సీలో ఉంటున్న నీల పాండ్య అనే గుజరాతీ మహిళ తన కుటుంబానికి చెందిన అయిదుగురు కోవిడ్‌తో పోరాడుతున్నారని, బెడ్స్‌ కొరత కారణంగా వారిలో ఇద్దరినే ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకున్నారంటూ ఆమె ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. కోవిడ్‌ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని, నిర్లక్ష్యం వద్దంటూ ఆమె పెట్టిన వీడియో భారతీయ సంతతి వారిలో గుబులు రేపుతోంది.

వైరస్ వ్యాప్తి వివరాలు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు 17,81,383

మరణాలు                             1,08,865

కోలుకున్న వారు                      4,04,569

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle