newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ఒక్కడు... అందరికీ అంటించాడు..

31-03-202031-03-2020 11:18:17 IST
Updated On 31-03-2020 11:21:53 ISTUpdated On 31-03-20202020-03-31T05:48:17.496Z31-03-2020 2020-03-31T05:48:15.219Z - 2020-03-31T05:51:53.095Z - 31-03-2020

ఒక్కడు... అందరికీ అంటించాడు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విమానాల్లో ప్రయాణిస్తూ దేశదేశాలు తిరిగొస్తున్న వారు కరోనా వైరస్‌ వ్యాప్తి పట్ల ఏమాత్రం బాధ్యతలు లేకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తుండటం దేశాన్నే ప్రమాదకర స్థితుల్లోకి నెడుతోంది. సామాజిక నిచ్చెనలో పైవరుసలో ఉన్నవారు కింది వరుసల్లో ఉన్నవారికి కరోనాను అంటిస్తూ అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాలను కల్లోల పరిస్థితుల్లోకి నెడుతున్నారు. ప్రధాని జనతా కర్ప్యూకు పిలుపిచ్చిన రోజే గోవాకు విమాన ప్రయాణం పెట్టుకున్న ఒక ప్రబుద్ధుడు ఇప్పుడు ముంబై, గోవా నగరాలను వణికిస్తున్నాడు. ఒక్కడ నిర్లక్ష్యం వల్ల ఈ రెండు నగరాల్లో వందలాదిమంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయ.

ఓ ప్ర‌యాణికుడి అజాగ్ర‌త్త‌, నిర్ల‌క్ష్యం తోటి ప్ర‌యాణికుల ప్రాణాల‌ను ప్ర‌మాదంలోకి నెట్టింది. ముంబై నుంచి గోవా వెళ్లిన విమానంలో ప్ర‌యాణించిన వ్య‌క్తికి ఆదివారం క‌రోనా వైరస్‌ సోకిన‌ట్లు తేలింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన గోవా ఆరోగ్య శాఖ మార్చి 22న యూకే861 విస్తారా విమానంలో ఉన్న మిగ‌తా ప్ర‌యాణికుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. దీంతో వెంటనే కరోనా రోగి ప్రయాణించిన విమానం నడిపిన పైలెట్‌, కో పైలెట్లతో పాటు విమాన సిబ్బంది అందరూ సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని విస్తారా ఎయిర్ లైన్స్ ఆదేశించింది.

ఆ విమానంలో ప్ర‌యాణించిన వ్య‌క్తికి కోవిడ్‌-19 సోకింద‌ని, దీంతో అందులోని ప్ర‌యాణికులంద‌రూ వెంట‌నే ద‌గ్గ‌ర్లోని ఆరోగ్య కేంద్రాల‌కు వెళ్లి ప‌రీక్ష‌లు చేసుకోవాల‌ని, లేని ప‌క్షంలో 0832-24218102225538 హెల్ప్‌లైన్‌ను సంప్ర‌దించాల‌ని గోవా ఆరోగ్య శాఖ కోరింది. విమాన సిబ్బందిని సైతం స్వీయ నిర్బంధంలో ఉండాల‌ని కోరింది. 

అసలు విషయానికి వస్తే క‌రోనా సోకిన వ్య‌క్తి బ‌హ‌మాస్ నుంచి న్యూయార్క్ మీదుగా ముంబైకు చేరుకున్నాడు. అనంత‌రం మార్చి 22వతేదీన అక్కడి నుంచి గోవాకు విస్తారా విమానయాన సంస్థకు చెందిన యూకే 861 నంబరు ముంబై-గోవా విమానంలో ప్రయాణించారు. గోవాకు ప‌య‌న‌మ‌య్యాడు. అక్క‌డ‌ క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఆసుప‌త్రిలో చేరిన అత‌నికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఆదివారం పాజిటివ్ అని తేలింది. 

పైగా ఎవ‌రూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చిన జ‌న‌తా క‌ర్ఫ్యూ నాడే అత‌ను ప్ర‌యాణానికి పూనుకోవ‌డం గ‌మ‌నార్హం. కాగా అత‌ని కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితంగా మెలిగిన‌వారు ప్ర‌స్తుతం గోవాలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కాగా గోవాలో ఇప్ప‌టివ‌ర‌కు ఐదు క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. 

దీంతోపాటు ఈ విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు సైతం వెంటనే సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలని వైద్యఆరోగ్యశాఖ ఆదేశించింది. మార్చి 22వతేదీన ముంబై-గోవా విస్తారా విమానంలో ప్రయాణించిన వారు వెంటనే గోవా లేదా సమీపంలోని వైద్యఆరోగ్యశాఖ హెల్ప్ లైన్ కేంద్రాలను సంప్రదించాలని గోవా వైద్యాధికారులు కోరారు. 

కాగా, మహరాష్ట్రలోని సాంగ్లీలో ఓ పెద్ద కుటుంబానికి చెందిన 25 మందికి కరోనా సోకింది. వారంతా ఇరుకు ఇంట్లో నివసిస్తుండడంతో వైరస్‌ వేగంగా వ్యాపించింది. సౌదీ అరేబియా నుంచి తిరిగొచ్చిన ఆ కుటుంబంలోని నలుగురు ముందుగా మహమ్మారి బారినపడినట్లు ఈ నెల 23న నిర్ధారణ అయింది. వారంలోపే మరో 21 మంది కుటుంబ సభ్యులకు కూడా వైరస్‌ సోకింది. వారిలో రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇరుకు ఇంట్లో అంతా కలిసుండడం వల్ల వారం వ్యవధిలోనే పాతిక మందికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. 

దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం 1,071కు పెరిగాయి. 24 గంటల్లో 106 కొత్త కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి.

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   14 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   17 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle