newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ఒకే రోజు 49 వేల కేసులు.. 13 లక్షలు దాటిన మొత్తం కేసులు..

25-07-202025-07-2020 08:17:18 IST
2020-07-25T02:47:18.836Z25-07-2020 2020-07-25T02:47:12.444Z - - 09-08-2020

ఒకే రోజు 49 వేల కేసులు.. 13 లక్షలు దాటిన మొత్తం కేసులు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కేసులు నమోదు విషయంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం ఒకేరోజు అత్యధికంగా 49,310 కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 13,06,002కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో 740 మంది మరణించారని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే మూడురోజుల్లోపే భారత్‌లో లక్ష కేసుల పైబడి నమోదు చేయడం ప్రమాద సంకేతాలను ధ్వనిస్తోంది.

దేశవ్యాప్తంగా  కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శుక్రవారానికి 8,17,208కి చేరుకుంది. దీంతో మొత్తం కోలుకున్న వారి వాతం 63.45కు చేరుకుంది. మరణాల రేటు 2.38కి పడిపోయింది. పరీక్షల సంఖ్య జూలై 20 నాటికి ప్రతి 10 లక్షల మందిలో 10,180 మందికి చేరింది. లేబొరేటరీల సంఖ్య 1290కి పెంచడంతో భారీగా పరీక్షలు పెరిగినట్లు చెప్పింది. ప్రస్తుతం దేశంలో 4,40,135 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. 

గత 24 గంటల్లో మరణించిన వారిలో 298 మంది మహారాష్ట్రకు, 97 మంది కర్ణాటకకు, 88 మంది తమిళనాడుకు, 34 పశ్చిమ బెంగాల్‌ కు, 28 మంది గుజరాత్‌ కు, 26 మంది ఉత్తరప్రదేశ్‌ కు, మరో 26 మంది ఢిల్లీకి, 11 మంది రాజస్తాన్‌ కు, 10 మంది మధ్యప్రదేశ్‌ కు, 9 మంది జమ్మూ కశ్మీర్‌కు చెందిన వారని తెలిపింది. 

జూలై 23 వరకూ మొత్తం 1,54,28,170 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. అత్యధిక కేసుల్లోనూ, అత్యధిక కరోనా మరణాల్లోనూ మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.

లాక్‌డౌన్‌ అమలవుతుండటంతో కోల్‌కతా విమానాశ్రయంలో జూలై 25 నుంచి 29 వరకూ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  దీనిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం వారానికి రెండు సార్లు పూర్తి స్థాయి లాక్‌ డౌన్‌ విధిస్తోంది.  

తమిళనాడులో కరోనా కల్లోలం: ఒక్కరోజులో 88 మంది మృతి దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6,785 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,99,749కి చేరింది. 

కరోనా మహమ్మారితో ఇవాళ 88 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 3,320 గా ఉంది. కాగా.. రాష్ట్రంలో 53,132 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇవాళ కరోనా నుంచి కోలుకుని 6,504 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,43,297కి చేరింది.  

మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ తప్పదన్న మమత 

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అంచనీ వేసేందుకప నేటి నుంచి విమనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంలో‌ వారంలో రెండు రోజుల పాటు అగష్టు 31 వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌కు దీదీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. అంతేగాక రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల మధ్య వ్యక్తులు రోడ్లపైకి రావడాన్ని కూడా నిషేధించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లో గడిచిన 24 గంటల్లో 2 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 51, 757కు చేరుకోగా 1,255 మంది మరణించారు. 

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   14 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   17 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle