newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

ఒకే దేశం.. ఒకే మార్కెట్‌.. రైతులపై దశాబ్దాల ఆంక్షలు ఎత్తివేత

04-06-202004-06-2020 08:57:40 IST
Updated On 04-06-2020 10:09:27 ISTUpdated On 04-06-20202020-06-04T03:27:40.893Z04-06-2020 2020-06-04T03:27:38.139Z - 2020-06-04T04:39:27.905Z - 04-06-2020

ఒకే దేశం.. ఒకే మార్కెట్‌.. రైతులపై దశాబ్దాల ఆంక్షలు ఎత్తివేత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అన్నదాత దశ మారుస్తున్న కీలక అమెండ్‌మెంట్

రైతుల దశాబ్దాల డిమాండ్‌ని నెరవేర్చాం.. మోదీ

రైతు మేలుకోసం చారిత్రాత్మక నిర్ణయం

రైతులు పంటను ఎవరికైనా అమ్మవచ్చు 

ఒకే దేశం.. ఒకే వ్యవసాయ మార్కెట్‌

నిత్యావసర వస్తువుల చట్టానికి సవరణ

ఇకపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు

స్వేచ్ఛాయుత రవాణాకు ఆర్డినెన్స్‌ 

అంతర్జాతీయ మార్కెట్లకూ ఎగుమతి 

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

భారతీయ రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అధీకృత వ్యవసాయ మార్కెట్లలోనే కాకుండా.. దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు కల్పించే ‘ద ఫార్మింగ్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ ఆర్డినెన్స్, 2020’కి బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ‘ఒకే దేశం.. ఒకే వ్యవసాయ మార్కెట్‌(వన్‌ నేషన్‌..వన్‌ అగ్రి మార్కెట్‌)’ దిశగా వేసిన ముందడుగుగా ఈ నిర్ణయాన్ని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం.. మార్కెట్లకు వెలుపల తమ దిగుబడులను అమ్మితే రైతులపై రాష్ట్రాలు ఎలాంటి పన్ను విధించవద్దు. రైతులు తాము కోరుకున్న ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఈ విషయంలో తలెత్తిన వివాదాలను సబ్‌ డివిజన్‌ మేజిస్ట్రేట్, కలెక్టర్‌ నెల రోజుల్లోగా పరిష్కరించాలి. ఈ వివాదాలు సివిల్‌ కోర్టుల పరిధిలోకి రావు. ప్రస్తుతం రైతులు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ మార్కెటింగ్‌ కమిటీ– ఏపీఎంసీ)ల్లోనే తమ ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఈ మార్కెట్లకు వెలుపల అమ్మాలనుకుంటే వారిపై పలు ఆంక్షలు ఉంటాయి.

మోదీ సర్కారు అన్నదాతకు తీపి కబురు చెప్పింది. పంట ఉత్పత్తుల విక్రయాలపై దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేసింది. రైతులు సాధికారత సాధించేందుకు, గ్రామీణ భారతానికి ఊపునిచ్చేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులు కష్టపడి పండించిన పంటలను ఇకపై స్వేచ్ఛగా.. తమకు ఇష్టం వచ్చిన వారికి విక్రయించుకోవచ్చు. చిన్న దుకాణాల నుంచి బడా వ్యాపారుల వరకు.. ఎవరితోనైనా ఒప్పందాలు చేసుకొని ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఇలా రైతులకు, వినియోగదారులకు లభ్ధి చేకూర్చే చరిత్రాత్మక నిర్ణయాలకు ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారమిక్కడ సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

65 ఏళ్ల నాటి నిత్యావసర వస్తువుల(ఎసెన్షియల్‌ కమాడిటీస్‌– ఈసీ) చట్టాన్ని సవరించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆ చట్ట నియంత్రణ పరిధిలో నుంచి నిత్యావసరాలైన పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, వంట నూనెలు, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలను తప్పించేందుకు ఆ సవరణను ప్రతిపాదించారు. ప్రతిపాదిత చట్ట సవరణ ప్రకారం.. యుద్ధం, జాతీయ విపత్తు, కరువు, ధరల్లో అనూహ్య పెరుగుదల వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆయా ఆహార పదార్థాలు ఈసీ చట్ట నియంత్రణలో ఉంటాయి. 

ఆరున్నర దశాబ్దాల కిందటి నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఫలితంగా తృణధాన్యాలు, కాయధాన్యాలు, ఉల్లి గడ్డలు వంటి వాటిని నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగిస్తారు. అలాగే రాష్ట్రం లోపల, రాష్ట్రాల మధ్య ఎలాంటి ఆంక్షలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం చేసుకునేందుకు; రైతులు ఎవరితోనైనా స్వేచ్ఛగా చర్చలు జరిపి తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు వీలుగా ఆర్డినెన్స్‌లు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయాల వల్ల వ్యవసాయ రంగం రూపురేఖలు మారిపోవడమేగాక రైతుల ఆదాయం పెరుగుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. 

నిత్యావసర వస్తువుల చట్ట సవరణ నిర్ణయం ప్రైవేట్‌ పెట్టుబడిదారుల వ్యాపార కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం లేకుండా చేసేందుకు దోహద పడుతుందన్నారు. పంటల ఉత్పత్తి, నిల్వ, రవాణా, పంపిణీ, సరఫరాల్లో రైతులకు స్వేచ్ఛ కల్పించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో ప్రై వేట్‌, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. శీతలీకరణ కేంద్రాలు, ఆహార సరఫరా ఆధునికీకరణలో పెట్టుబడులు పెరిగేందుకు కూడా వీలు కలుగుతుందని చెప్పారు.  ధరల స్థిరీకరణ జరుగుతుందని, మార్కెట్‌లో పోటీ వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. 

కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడిస్తూ.. ఏపీఎంసీలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రాల ఏపీఎంసీ చట్టాలు కూడా కొనసాగుతాయన్నారు. మండీలకు వెలుపల కూడా రైతులు తమ ఉత్పత్తులను అమ్మే అవకాశం కల్పించి, వారికి అదనపు ఆదాయం అందించాలన్నదే ఈ ఆర్డినెన్స్‌ ఉద్దేశమన్నారు. ‘ఈ ఆర్డినెన్స్‌ ద్వారా  రైతులు నేరుగా తమ ఇళ్ల నుంచే ఆహార సంస్థలకు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు, రైతు సహకార సంస్థలకు తాము కోరుకున్న ధరకు తమ పంటలను అమ్మవచ్చు’ అని వివరించారు. దీనిపై ఎలాంటి నియంత్రణలు ఉండబోవన్నారు. ‘ఈ – ట్రేడింగ్‌’కు కూడా అవకాశం ఉందన్నారు.  

మిగతా సమయాల్లో వాటి ఉత్పత్తి, నిల్వ, సరఫరాలపై ఎలాంటి నియంత్రణ ఉండదు. అలాగే, ప్రాసెసింగ్‌ చేసేవారు, సరఫరా వ్యవస్థలో ఉన్నవారిపై ఆయా ఆహార ఉత్పత్తులకు సంబంధించి ఎలాంటి నిల్వ పరిమితి ఉండదు. రైతుల ఆదాయ పెంపు నిర్ణయాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆహార ఉత్పత్తులను దిగుబడి చేసుకునే, నిలువ చేసుకునే, పంపిణీ చేసుకునే హక్కు లభించడంతో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రైవేట్‌ సంస్థలకు ఆసక్తి పెరిగే అవకాశముందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా వస్తాయని పేర్కొంది.

వ్యవసాయ సంస్కరణలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు గ్రామీణ భారతం, ముఖ్యంగా రైతులపై గణనీయ సానుకూల ప్రభావం చూపుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై ఆంక్షలను తొలగించాలని రైతులు దశాబ్దాలుగా డిమాండ్‌ చేస్తున్నారని, ఆ డిమాండ్‌ను తాము నెరవేర్చామని తెలిపారు.  

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   10 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle