newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నివేదిక

20-02-202020-02-2020 11:23:39 IST
2020-02-20T05:53:39.951Z20-02-2020 2020-02-20T05:53:17.558Z - - 05-08-2020

ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నివేదిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పెద్దనోట్ల రద్దు మొదలుకుని నేటి దాకా ఆర్ధిక మాంద్యంతో కునారిల్లిపోతున్న భారతదేశానికి అతిపెద్ద భరోసానిచ్చే ప్రకటన వెలువడింది. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు తెచ్చే నివేదిక తాజాగా విడుదలయింది. భారత్‌ ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని అమెరికాకు చెందిన వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ అనే సంస్థ తెలిపింది. బలమైన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలను అధిగమించి భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని సంస్థ పేర్కొంది. 

ఈ నివేదిక ప్రకారం డిసెంబరు నాటికి భారత జీడీపీ 2.94 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రస్తుత డాలర్‌ను రూపాయితో పోల్చి చూసినప్పుడు ఇది రూ. 209.62 లక్షల కోట్లకు సమానం. తలసరి కొనుగోలు శక్తి (పీపీపీ) పరంగా చూస్తే దేశీయ ఆర్థిక వ్యవస్థ 10.51 లక్షల కోట్ల డాలర్లతో అమెరికా, చైనా తర్వాతి స్థానంలో ఉండడం విశేషం. 

1990లో భారత్‌ అమలు చేసిన పారిశ్రామిక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఉపపయోగపడిందని తెలిపింది. ప్రపంచంలోనే భారత దేశీయ సేవా రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, తయారీ రంగం, వ్యవసాయ రంగం దేశయ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి ముఖ్య రంగాలని నివేదిక స్పష్టం చేసింది. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ అనే సంస్థ పారదర్శకంగా నివేదికను రూపోందిస్తుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2019లోనే ప్రపంచ ఆర్థిక దిగ్గజాలుగా పరిగణిస్తున్న యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్ దేశాలను అధిగమించి భారత్ ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్ధగా ఆవిర్భవించిందని వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ స్పష్టం చేసింది. తన మునుపటి రక్షణాత్మక విధానాలనుంచి పక్కకు తప్పుకున్న భారతదేశం ఇప్పుడు బహిరంగ మార్కెట్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందిందన్నది ఈ నివేదిక సారాంశం.  

బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 2.83 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల వద్ద నిలకడగా ఉండగా ఫ్రాన్స్ 2.71 ట్రిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. భారత్ 2.94 ట్రిలియన్ డాలర్లతో ఈ రెండు దేశాలను అధిగమించి అయిదోస్థానంలో నిలబడటం విశేషం.

కొనుగోలు శక్తి ప్రమాణాలతో పోలిస్తే భారత జీడీపీ 10.51 ట్రిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. ఈ అంశంలోనూ మన దేశం జపాన్, జర్మనీ దేశాలనే తోసిపుచ్చింది. అయితే భారత్ లోని అత్యధిక జనాభా కారణంగా మన దేశ తలసరి జీడీపీ 2,170 డాలర్ల వద్దే ఉండగా తక్కువ జనాభా ఉన్న అమెరికా 62,794 డాలర్ల సగటు జీడీపీతో నిలిచింది.

భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణ 1990ల ప్రారంభంలో ప్రారంభమైంది, పారిశ్రామిక క్రమబద్ధీకరణను ఎత్తివేయడం, విదేశీ వాణిజ్యంపై, విదేశీ మదుపులపై నియంత్రణను ఎత్తివేయడం, ప్రభుత్వ యాజమాన్యంలోని వాణిజ్య సంస్థల ప్రయివేటీకరణ వంటి కారణాలతో భారత ఆర్థిక ప్రగతి వేగం పుంజుకుందని నివేదిక తెలిపింది.

ఇక సర్వీసు రంగం చూస్తే భారత సర్వీస్ రంగం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ది చెందుతున్న రంగంగా ఆర్థిక వ్యవస్థలో 60 శాతాన్ని ఆక్రమించింది. ఈ రంగంలోనే 28 శాతం ఉపాధి లభిస్తోంది. 

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   2 hours ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   8 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   9 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   9 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   04-08-2020


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle