newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో ఇండియాకు చోటు

18-06-202018-06-2020 19:36:29 IST
2020-06-18T14:06:29.784Z18-06-2020 2020-06-18T14:06:22.641Z - - 12-08-2020

ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో ఇండియాకు చోటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు. గాల్వాన్ లోయలో 20మందికి పైగా భారతీయ జవాన్లపై చైనా సైనికులు దాడులు చేయడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. చైనాపై అంతర్జాతీయంగా వత్తిడి తెచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.  ఈనేపథ్యంలో భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో చోటు దక్కించుకుంది.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఐదు శాశ్వత  సభ్యదేశాలు, 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి.  ప్రతి ఏడాది ఓటింగ్ ద్వారా తాత్కాలిక సభ్యదేశాలను ఎన్నుకుంటారు.  ఆసియా పసిఫిక్ వర్గానికి చెందిన సభ్యదేశంగా ఇండియా ఎన్నికైంది.  

2021-22 సంవత్సరానికి నిర్వహించిన ఎన్నికల్లో భారత్ కు అనుకూలంగా 184 ఓట్లు లభించాయి.  మొత్తం 193 సభ్యదేశాలున్న ఐరాస జనరల్ అసెంబ్లీలో ఇండియాకు అనుకూలంగా 184 దేశాలు ఓటు వేయడం విశేషం.  2021-22 కాలానికి అధిక మద్దతుతో ఐరాస దేశాలు ఇండియాను ఎన్నుకున్నాయని ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత  ప్రతినిధి టిఎన్ గురుమూర్తి తెలిపారు. 

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యదేశంగా భారత్ ఎంపిక కావడం ఇది ఎనిమిదోసారి.  భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా ఎంపిక అయ్యేందుకు ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తూనే వుంది. భద్రతా మండలిలోని నాలుగు శాశ్వత సభ్యదేశాలు ఇండియాకు అనుకూలంగా ఉన్నాయి. కానీ భారత్ కు చైనా వ్యతిరేకంగా పావులు కదుపుతుండడంతో తాత్కాలిక సభ్యదేశంగానే వ్యవహరించాల్సి వస్తోంది. అమెరికా, ఫ్రాన్స్, రష్యా, ఇంగ్లాండ్, చైనా శాశ్వత సభ్యదేశాలుగా వున్నాయి. చైనా తప్ప మిగతా దేశాలు భారత్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle