newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

ఏప్రిల్ 14 వరకూ రైల్వే సర్వీసుల నిలిపివేత... నో రిజర్వేషన్స్

26-03-202026-03-2020 08:09:57 IST
2020-03-26T02:39:57.473Z26-03-2020 2020-03-26T02:39:00.986Z - - 11-08-2020

ఏప్రిల్ 14 వరకూ రైల్వే సర్వీసుల నిలిపివేత... నో రిజర్వేషన్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అన్ని రైల్వే సర్వీసులను సస్పెండ్ చేసింది. దేశవ్యాప్తంగా రైలు సర్వీసులన్నిటిని ఏప్రిల్‌ 14 వరకు నిలిపివేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మంగళవారం 21 రోజుల వరకు  లాక్‌డౌన్‌ ప్రకటించిన  నేపథ్యంలో  బుధవారం కేంద్ర మంత్రి మండలి భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలుత మార్చి 31 వరకు గూడ్సు రైళ్లు మినహా ప్రయాణికుల రైళ్లన్నీ రద్దు చేశారు. 

తర్వాత ఈ నిషేధం ఏప్రిల్ 14 వరకూ పొడిగించారు.  నిత్యావసర వస్తువులకు కొరత రాకుండా గూడ్సు రైళ్లను యథాతథంగా నడుపుతారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం స్తంభింపజేసినప్పటికీ పెరుగుతున్న కేసుల దృష్ట్యా మరికొంత కాలం వేచిచూడాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రైల్వే మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 14 అర్ధరాత్రి వరకూ ప్రయాణీకుల రైలు సేవలను రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. అవసరమైన వస్తువుల సరఫరాను నిర్ధారించడానికి సరుకు రవాణా రైళ్లు ఆపరేషన్ మాత్రం కొనసాగించాలని నిర్ణయించింది. 

ఏప్రిల్ 14 వరకూ రిజర్వేషన్లు చేయించుకుంటే వాటిని పూర్తిగా రిఫండ్ చేయనుంది. దీనికోసం రైల్వే రిజర్వేషన్ కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు. ఏప్రిల్ 14 వరకూ అవికూడా పనిచేయవు. పీఆర్ఎస్ రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్లాల్సిందే. కానీ అవి మూతపడడంతో ప్రయాణికులు హైరానా పడాల్సిన పనిలేదు. మూడునెలల వరకూ వాటిని రద్దుచేసుకుని రిఫండ్ పొందవచ్చు. అలాగే, వివిధ రకాల రిజర్వేషన్లు ఇంటర్నెట్, ఐఆర్ సి టీసీ ద్వారా చేయించుకున్నవారికి వెంటనే రిఫండ్ లభిస్తుంది. వాటిని వినియోగదారులు రద్దుచేసుకోవాల్సిన అవసరం లేదు.

మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 15 మధ్య రద్దు చేసిన రైళ్లలో ప్రయాణికులు బుక్‌ చేసుకున్న రైలు టికెట్ల డబ్బును 100 శాతం ప్రయాణికులకు రీఫండ్‌ చేయనున్నట్లు ఇండియన్‌ రైల్వే ప్రకటించింది. ఏప్రిల్ 14 తర్వాత రిజర్వేషన్లు చేసుకునే అవకాశం గురించి త్వరలో ప్రకటించనుంది. ప్రస్తుతం రైల్వే రిజర్వేషన్లు, ఐఆర్సీటీసీ సేవలు అందుబాటులో లేవు.  దీంతో రైల్వే శాఖకు గూడ్స్ రైళ్ళ ద్వారానే ఆదాయం రానుంది. పాసింజర్ సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయం కోల్పోనుంది. 

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   an hour ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   18 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   19 hours ago


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

   09-08-2020


భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

   09-08-2020


10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   08-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle