newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

ఏనుగుపై అమానుషం .. ఎందరినో కదిలించింది

04-06-202004-06-2020 18:21:52 IST
Updated On 04-06-2020 20:08:47 ISTUpdated On 04-06-20202020-06-04T12:51:52.686Z04-06-2020 2020-06-04T12:50:52.344Z - 2020-06-04T14:38:47.346Z - 04-06-2020

ఏనుగుపై అమానుషం .. ఎందరినో కదిలించింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేరళలో ఏనుగు మృతి ఘటనపై ఓ వైపు విచారం, మరోవైపు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. అదే రాష్ట్రంలో మరో ఏనుగు మృతి తాజాగా వెలుగులోకి వచ్చింది. అది కూడా ఏదో పేలుడు పదార్థం తినడం వల్లే మరణించి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. కొల్లం జిల్లా పతానపురం అటవీ ప్రాంతంలో ఏప్రిల్‌లో బలహీనంగా ఉన్న ఓ ఆడ ఏనుగును కనుగొన్నట్టు చెప్పారు. దానికి వైద్యం చేయాలని ప్రయత్నించినా అది సహకరించకుండా కొద్ది దూరం నడిచివెళ్లినట్లు తెలిపారు. మరుసటి రోజు ఓ చోట పడి మరణించిందని స్పష్టం చేశారు.  పోస్టుమార్టం నివేదికలో ఏనుగు దవడ విరిగినట్లు తేలిందన్నారు. దీంతో.. ఆ ఏనుగు కూడా ఏదో పేలుడు పదార్థం తినడం వల్లే చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

Image

Image

ఏనుగు మరణించడంపై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అటవీ అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదుచేశామని మల్లప్పురం అటవీ శాఖ అధికారి చెప్పారు. నెటిజన్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం దీనిని సీరియస్ గా తీసుకుంది. 

ఈఘటన టీమిండియా సారథి విరాట్ కోహ్లీని బాగా కదిలించింది. కేరళలో జరిగిన విషయం తెలిసి చాలా బాధపడ్డాను. జంతువులపై ప్రేమను చూపండి. ఇలాంటి హేయమయిన చర్యలకు ముగింపు పలకాలి’’ అని ఏనుగు కడుపులో వున్న బిడ్డతో వున్న బొమ్మను ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. నిందితులపై చర్యలు చేపట్టాలని మరో క్రికెటర్ సురేష్ రైనా, రోహిత్ శర్మ కోరారు. 

ఏనుగు మరణించిన ఉదంతం బాలీవుడ్ సెలబ్రిటీలను కదిలించింది.గర్భంతో ఉన్న గజరాజు పట్ల జరిగిన ఈ  కిరాతకాన్ని అనుష్క శర్మ, శ్రధ్ధా కపూర్, రణ దీప్ హుడా, దిశా పటానీ, అలియా భట్ వంటివారు ఖండిస్తూ ట్వీట్లు చేశారు. జంతు హింసకు పాల్పడినవారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అందువల్లే ఎనిమల్ క్రూయల్టీకి వ్యతిరేకంగా తీవ్రమైన శిక్షలు పడేలా చట్టాలు తేవాలని వారు  అభ్యర్థించారు. రణ దీప్  హుడా ఏకంగా తన ట్వీట్ లో.. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కు ఇదే విధమైన విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన తనను ఎంతో కలచివేసిందని శ్రధ్ధా కపూర్ పేర్కొన్నారు. ఇది మూగ జీవిపై అమానుషమైన ‘జోక్’ అని అలియా భట్ విచారం వ్యక్తం చేసింది.

ఏనుగుకి అనాసపండులో మందుగుండు పెట్టిన వ్యక్తి ఆచూకీ చెబితే రెండులక్షలు బహుమతిగా ఇస్తానని శ్రీనివాసన్ అనే హైదరాబాదీ  ట్వీట్ చేశారు. ఈ ఘటన తనను బాగా కలిచి వేసిందన్నారు. హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ కూడా యాభైవేలు నజరానా ప్రకటించింది. పలువురు నెటిజన్లు ఏనుగు స్కెచ్ లు వేసి తమ మానవత్వం చాటుకుంటున్నారు.

https://www.photojoiner.net/image/7m6J7TYb

ఏనుగు మృతిపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు.. ‘ఈ సృష్టిలో గొప్ప జీవి మనిషేనని గర్వంగా చెబుతారు. కానీ, దేవుడికి తన సృష్టిపై తనకే అసహ్యం వేసేలా ప్రవర్తిస్తున్నారు మనుషులు. ఈ ప్రకృతిపై మనిషికి మాత్రమే ఆధిపత్యం ఉన్నట్టు, మిగిలిన జీవాల మనుగడ మనిషి దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉన్నట్టు కొందరు ప్రవర్తిస్తున్న తీరుతో కడుపు రగులుతోంది.మనిషి చేసే తప్పులకు ఆ ప్రకృతి విధిస్తున్న శిక్షలే ఇవని అనిపిస్తోంది. తప్పు చేసినవారే కాదు... చూస్తూ స్పందించనివారు... అడ్డుకునే శక్తి ఉన్నప్పటికీ ఆ పని చెయ్యనివారు కూడా శిక్షార్హులే. అందుకే ఇకనైనా మారదాం... నిండైన మానవత్వమున్న మనుషులుగా బతుకుదాం. ఆ పరమేశ్వరుని దృష్టిలో మనం కృతఘ్నులం కావద్దు. మీ విజయశాంతి' అని పేర్కొన్నారు. 

ఏనుగుకు పేలుడు పదార్ధాలున్న అనాసపండు ఇచ్చి దాని మరణానికి కారణమయినవారిని శిక్షించాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి.ఈ ఘటనపై ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మలప్పురంలో జరిగిన ఈ ఘోరంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో రతన్ టాటా ఇవాళ ట్విటర్ వేదికగా స్పందించారు. జంతువులపై జరుగుతున్న ఇటువంటి దారుణాలను మానవ హత్యలుగానే పరిగణించాలని ఆయన వ్యాఖ్యానించారు.  ‘‘కొందరు వ్యక్తులు పటాసులు నింపిన పైనాపిల్‌ ఆశపెట్టి అమాయకమైన ఓ ఏనుగును చంపిన ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, కలవరపాటుకు గురిచేసింది. అమాయక జంతువులపై ఇటువంటి నేరపూరిత చర్యలకు, సాటి మనుషుల హత్యలకు తేడా ఏమీ లేదు. చనిపోయిన ఏనుగుకు న్యాయం జరగాలి...’’ అని టాటా తన పోస్టులో డిమాండ్ చేశారు.

మానవత్వానికి మచ్చ.. ఏనుగు పట్ల అమానుషం

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle