facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
* తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ .. నామినేషన్లకు శ్రీకారం ..నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 25వ తేదీ* రక్షణమంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి సహా పలువురి నివాళి * ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ *మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి *సెన్సార్ బోర్డు పై వర్మ సీరియస్... కోర్టుకెళతానన్న ఆర్జీవీ*కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్

ఎలక్షన్ టెన్షన్... పార్టీల అటెన్షన్

14-03-201914-03-2019 16:55:43 IST
Updated On 14-03-2019 19:58:10 ISTUpdated On 14-03-20192019-03-14T11:25:43.502Z14-03-2019 2019-03-14T11:25:39.861Z - 2019-03-14T14:28:10.672Z - 14-03-2019

ఎలక్షన్ టెన్షన్... పార్టీల అటెన్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లోక్ సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. మార్చి 7న లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్ వారం తిరగకుండానే రెండో జాబితాను ప్రకటించింది. ఈసారి 21 మంది అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. యూపీ, మహారాష్ట్ర నుంచి ఈ జాబితాను రూపొందించినట్టు ఏఐసీసీ పేర్కొంది. లోక్ సభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ దూకుడు కనబరుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనకు ముందే తొలి జాబితాను ప్రకటిస్తామన్న కాంగ్రెస్ వారం క్రితమే తొలి జాబితా విడుదలచేసిన సంగతి తెలిసిందే.  తాజాగా రెండో జాబితాను ప్రకటించింది. తొలి విడతలో 15 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించిన కాంగ్రెస్.. 21 మందితో మలి విడత జాబితాను విడుదల చేసింది. 

మొదటి విడతలో గుజరాత్ నుంచి నాలుగు స్థానాలు, యూపీ నుంచి 11 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. బుధవారం ప్రకటించిన జాబితాలో మహారాష్ట్రలో ఐదు స్థానాలకు, ఉత్తర ప్రదేశ్‌లో 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజ్ బబ్బర్ మోరాదాబాద్ నుంచి పోటీ చేయనుండగా.. సంజయ్ దత్ సోదరి ప్రియాదత్ ముంబై నార్త్ సెంట్రల్ నుంచి బరిలో దిగనున్నారు. ప్రియాంక గాంధీకి సన్నిహితుడిగా పేర్కొంటున్న లలితేశ్ పాటి త్రిపాఠి మీర్జాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు.

ప్రియాదత్ 2005లో ముంబై నార్త్ వెస్ట్ నుంచి తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందారు. 2009లో ముంబై సెంట్రల్ నుంచి గెలిచిన ఆమె.. తర్వాతి ఎన్నికల్లో పూనమ్ మహాజన్ చేతిలో ఓడారు. ఈసారి ఎన్నికల బరిలో దిగడం లేదని రెండు నెలల క్రితం ఆమె ప్రకటించారు. అభ్యర్థుల జాబితా ప్రకటనకు కొద్ది గంటల ముందు ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీంతో ఆమెకు టికెట్ ఇచ్చారు. 

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో వేగం పెంచింది. అక్కడ కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పొత్తు చర్చలు కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్ 20 స్థానాల్లో, జేడీఎస్ 8 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.  12 సీట్లు కావాలన్న కుమారస్వామి చివరకు వెనక్కి తగ్గి, .చివరకు 8 స్థానాలతో సరిపెట్టుకున్నారు. 

ఇటు పశ్చిమబెంగాల్‌లోనూ ఎన్నికల వేడి రాజుకుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అభ్యర్థులను ప్రకటించారు. 42 మంది అభ్యర్థుల్లో 17 మంది మహిళలకు చోటు కల్పించారు. ప్రస్తుతం టీఎంసీకి 34 మంది ఎంపీలున్నారు. వీరిలో 8 మందికి టికెట్ నిరాకరించారు. మొత్తం మీద కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలు తమ అభ్యర్ధులను తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ప్రకటించడం విశేషం. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle