newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

ఎయిర్ ఇండియాను అమ్మేస్తాం.. టెలికాంని ఉద్ధరిస్తాం : నిర్మలా సీతారామన్

18-11-201918-11-2019 10:43:38 IST
2019-11-18T05:13:38.325Z18-11-2019 2019-11-18T04:59:35.771Z - - 12-08-2020

ఎయిర్ ఇండియాను అమ్మేస్తాం.. టెలికాంని ఉద్ధరిస్తాం : నిర్మలా సీతారామన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్థిక ఇబ్బందులు తలకు మించిన భారంగా మారడంతో ప్రభుత్వ రంగ సంస్థలైన ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్లను వచ్చే సంవత్సరం మార్చి నెలనాటికి విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది.  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రెండు ప్రభుత్వ రంగ దిగ్గజాల విక్రయ ప్రక్రియను మార్చి నాటికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఎయిర్‌ ఇండియాను కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారులు చాలా ఆసక్తిగా ఉన్నారని ఆమె చెప్పారు. కంపెనీల విక్రయాలు ముగిసిన తర్వాత పూర్తి వివరాలు తెలుపుతామన్నారు. 

ఎయిర్‌ ఇండియా పలు ఆర్థిక సమస్యలను ఇదుర్కొంటొంది. విమానాలకు ఉపయోగించే ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ను సమకూర్చే చమురు కంపెనీలకు రూ. 4,500 కోట్ల మేర చెల్లింపులు బకాయి ఉండటంతో ఆయా సంస్థలు ఇంధన సరఫరాను నిలిపివేశాయి. బకాయిల చెల్లింపులలో ఎయిర్‌ ఇండియా విఫలమవడంతో ఇంధన సరఫరాలను చమురు సంస్థలు నిలిపివేశాయి. 

నిధుల సమీకరణ సంక్లిష్టంగా మారడంతో చెల్లింపులు, రుణాల క్లియరెన్స్‌లో ఎయిర్‌ ఇండియా ఇబ్బందులను ఎదుర్కొంటొందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు భారత పెట్రోలియం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 1.02 లక్షల కోట్లు ఉండగా, ప్రభుత్వం 65,000 కోట్లు విక్రయానికి పెట్టనున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాని ముఖ విలువ కంటే సగానికి పైగా తక్కువ ధరకే కేంద్రం బీపీసీఎల్‌ని బేరానికి పెడుతుండటం గమనార్హం.

ప్రభుత్వరంగ దిగ్గజాలను విక్రయించడానికే మొగ్గు చూపిన కేంద్రప్రభుత్వం మరోవైపున టెలికాం రంగానికి వీలైనన్ని ప్రోత్సాహకాలు కల్పించి ఆదుకోవడానికి సిద్ధమవుతోంది. టెలికం నష్టాలకు  సంబంధించిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిర్మలా  సీతారామన్ బదులిస్తూ ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు కార్యదర్శుల కమిటీని నియమించనున్నట్లు  తెలిపారు. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

ఏజీఆర్‌పై (సవరించిన స్థూల ఆదాయం) సుప్రీంకోర్టు తీర్పు టెలికం కంపెనీలకు పెనుభారంగా మారింది. ఈ తీర్పు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో వొడాఫోన్‌ ఐడియా రూ.50,921 కోట్లు, ఎయిర్‌టెల్‌ కంపెనీ రూ.23,045 కోట్ల నికర నష్టాల్ని ప్రకటించాయి. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట మొత్తాన్ని లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల కింద ప్రభుత్వానికి టెల్కోలు చెల్లించాల్సి ఉంటుంది.  

ఈ రెండు కంపెనీల నష్టాల మొత్తం సుమారుగా రూ.74,000 కోట్లకు చేరింది. టెలికం వ్యాపారేతర ఆదాయాలూ టెల్కోల స్థూల ఆదాయం (ఏజీఆర్‌) కిందే పరిగణించాలన్న ప్రభుత్వ వాదనలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆర్థిక స్థిరత్వ లేమి కారణంగా ఏ కంపెనీ తమ సేవలను నిలిపివేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందడమే తమ అభిమతమని అన్నారు.   

దేశంలోని అన్ని కంపెనీలు తమ సేవలను కొనసాగించాలని ప్రభుత్వం కోరుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పడం బాగానే ఉంది కానీ.. కేంద్రప్రభుత్వం ఇదే ధర్మసూత్రాన్ని ఎయిర్ ఇండియా, బీపీసీఎల్ విషయంలో ఎందుకు పాటించడం లేదన్నదే అసలు ప్రశ్న.

 

 

 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   13 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   14 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle