newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఎన్నాళ్ళీ కరోనా కష్టాలు... ప్రపంచ దేశాల కన్నీళ్ళు

09-04-202009-04-2020 10:01:32 IST
Updated On 09-04-2020 10:18:50 ISTUpdated On 09-04-20202020-04-09T04:31:32.110Z09-04-2020 2020-04-09T04:31:21.734Z - 2020-04-09T04:48:50.822Z - 09-04-2020

ఎన్నాళ్ళీ కరోనా కష్టాలు... ప్రపంచ దేశాల కన్నీళ్ళు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా ధాటికి విలవిల్లాడుతున్నాయి ప్రపంచ దేశాలు. ప్రపంచయుద్ధాలకంటే కరోనా పై యుద్ధం ఎక్కువయింది.  ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 15 లక్షలకు చేరువైంది. కరోనా వైరస్ మరణాల సంఖ్య 87,458కు చేరింది. ఇటు అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 4,18,410గా నమోదైంది. ఇప్పటివరకు అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 14,240కు చేరింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్ రోజు రోజుకు తీవ్రంగా తయారవుతోంది. చూస్తుండగానే శరీరాన్ని ఆవహించి, చిన్నాభిన్నం చేసేస్తోంది.

ఈ వైరస్ బారిన పడి ప్రపంచ దేశాలు మంచమెక్కాయి. ఆస్పత్రులు స్మశానాలుగా మారుతున్నాయి. ఆర్థిక రంగం కోలుకోలేని స్థితికి చేరింది.  అమెరికాలో ఒక్క రోజే 1895 మందిని బలి తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దారుణంగా పెరిగిపోతోంది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 15,13,243. ఇంకా ఈ సంఖ్య ప్రతి గంటకూ పెరుగుతూనే వుంది. 

అమెరికాలో 4,30,210 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. నిన్న ఒక్క రోజే 1895 మంది మరణించారు. ఆ తర్వాత స్థానంలో స్పెయిన్(1,48,220), ఇటలీ (1,39,422), జర్మనీ (1,13,296), ఫ్రాన్స్ (1,12,950), చైనా (81,802) ఉన్నాయి. మరణాల వారీగా చూస్తే.. అమెరికా తర్వాత యూకేలో 938, స్పెయిన్ 747, ఇటలీ 542, ఫ్రాన్స్ 541, జర్మనీ 333, బెల్జియం 205, నెదర్లాండ్స్ 147, బ్రెజిల్ 134, ఇరాన్ 121 మరణాలు చోటుచేసుకున్నాయి. అటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,29,731 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 48,078 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఎంతమందిని కాపాడగలరో వైద్యులకు అర్థం కావడం లేదు. కరోనా వైరస్ చికిత్స చేస్తూ ఎంతోమంది వైద్యులు బలవుతున్నారు. 

మరోవైపు బ్రెజిల్ కూడా అమెరికా బాటలోనే నడుస్తోంది. కరోనా వ్యాధికి ఉపయోగిస్తున్న మలేరియా మందులు తమకు కూడా కావాలని బ్రెజిల్ భారత్ ను కోరుతోంది. బ్రెజిల్‌ అధ్యక్షుడి నోట రామాయణం మాట వినిపిస్తోంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కోరుతూ లేఖ రాశారు బొల్సొనారో. హనుమంతుడు సంజీవని తెచ్చిన ఘట్టం ప్రస్తావించారు. మరోవైపు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేసింది భారత్. తాజా నిర్ణయంపై  అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. భారత్‌ నుంచి 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ డోస్‌లను కొనుగోలు చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు.

‘భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను పంపగలరా? అని అడిగాను. ఆయన చాలా గొప్పవాడు. చాలా మంచివాడంటు ప్రశంసలు కురిపించారు. ఇటు న్యూయార్క్ నగరంలో ప్రమాద ఘంటికలు మోగుతూనే వున్నాయి. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. బోరిస్‌ జాన్సన్‌ అధికారిక కార్యకలాపాలు చేపట్టకపోయినప్పటికీ అధికారులతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు గురించి ఆయన ఆరాతీస్తున్నారు. 

కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   8 hours ago


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   11 hours ago


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   15 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   17 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   19 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   19 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   20 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle