newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఎట్టకేలకు నలుగురికి ఉరి.. దేశమంతా సంబరాలు

20-03-202020-03-2020 08:19:52 IST
2020-03-20T02:49:52.912Z20-03-2020 2020-03-20T02:49:34.304Z - - 07-08-2020

ఎట్టకేలకు నలుగురికి ఉరి.. దేశమంతా సంబరాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మార్చి 20న ఏం జరుగుతుందోనని అంతా కళ్లప్పగించి చూశారు. చెవులు రిక్కించి విన్నారు. ఎట్టకేలకు యావత్ దేశ ప్రజలు ఆశించింది జరిగింది. వరుస వాయిదాలతో అసలు న్యాయం జరుగుతుందా? మళ్ళీ వాయిదా పడుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూసిన జనం సంబరాలకు సిద్ధమయ్యారు. దేశాన్ని సంచలనానికి గురిచేసిన నిర్భయ కేసులో దోషులకు మరణదండన అమలైంది.

సుప్రీం కోర్టులో నిర్భయ దోషుల చివరి ప్రయత్నాలు బెడిసికొట్టడంతో, పటియాలా హౌజ్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం ఈ రోజు తెల్లవారుజామున 5.30 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలైంది. తీహార్ జైలులో నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు దోషులు ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మలను తీహారు జైలులో మెజిస్ట్రేట్ సమక్షంలో ఉరిశిక్ష అమలు చేశారు. జైలు నంబరు 3లో ఒకేసారి నలుగురు దోషులను ఒకేసారి ఉరితీశారు. నలుగురిని ఒకేసారి ఉరితీయడం తిహార్‌ జైలులో ఇదే తొలిసారి కావడం విశేషం. 

దోషులు నలుగురు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31) లకు విధించిన ఉరిశిక్ష అమలు ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. కోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 20న ఉదయం 5.30 గంటలకు  నలుగురు దోషులకు  శిక్ష అమలైంది.

ఉరి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వుంది. జనవరి 22న, ఫిబ్రవరి 1న,  మార్చి 3, మార్చి 20న ఉరి తీయాలని కోర్టు మార్చి 5వ తేదీన డెత్ వారెంట్ జారిచేసింది. దక్షిణాసియాలోనే అతి పెద్ద కారాగార సముదాయమైన తిహార్ అరుదైన ఘటనకు కేంద్రం అయింది. 

నిర్భయ కేసులో ఉరి శిక్ష అమలు చేయడంపై దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఒక పండుగ వాతావరణంలా తోచింది. ఢిల్లీలో జనమయితే కరోనాను సైతం లెక్కచేయకుండా రోడ్లమీదకు వచ్చారు. నిర్భయ నిందితులను ఉరితీశామని జైలు అధికారులు ప్రకటించడంతో తీహార్ జైలు బయట ప్రజలు గుమిగూడారు. ఉరి ప్రక్రియ పూర్తికావడంతో మిఠాయిలు పంచుకున్నారు. 

నిర్భయకు ఏడేళ్ళ తర్వాత న్యాయం జరిగింది. ఇది మహిళల విజయం. ఇలాంటి నేరాలకు ఉరి తప్పదని ఈ కేసుతో రుజువైందని, రేపిస్టులకు గట్టి సందేశం ఇచ్చిందని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ అన్నారు. నేరం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని, నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలే దీనికి ఉదాహరణ అన్నారు జాతీయమహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ అన్నారు. 

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   an hour ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   4 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   4 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   5 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   05-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle