newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

ఎటు చూసినా శిథిలాలే.. మెట్టుపాళ్యంలో అడుగడుగునా కన్నీళ్ళే

03-12-201903-12-2019 09:49:16 IST
Updated On 03-12-2019 09:49:08 ISTUpdated On 03-12-20192019-12-03T04:19:16.124Z03-12-2019 2019-12-03T04:18:05.807Z - 2019-12-03T04:19:08.017Z - 03-12-2019

ఎటు చూసినా శిథిలాలే.. మెట్టుపాళ్యంలో అడుగడుగునా కన్నీళ్ళే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారీ వర్షాలు ఎన్నోకుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. 17 మందిని బలితీసుకుంది ప్రహరీ గోడ. శిథిలాల కింద పేదలబతుకులు సమాధి అయిపోయాయి. రెండుకుటుంబాలు గోడకు బలయిపోయాయి. ఆగ్రహానికి గురైన స్థానికులు నిరసనలకు దిగడంతో పోలీసుల లాఠీచార్జ్‌ చేయాల్సి వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమిళనాడుని వర్షాలు వణికిస్తున్న సంగతి తెలిసిందే.

Image

కోయంబత్తూరు జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తం అయింది. మెట్టుపాళ్యం, కట్రుపుర ప్రాంతాల్లో క్షణం కూడా తీరిక లేకుండా వాన కురవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నడూరు కన్నప్పన్‌ లే–అవుట్‌లో ప్రముఖ వ్యాపారి బట్టల షాపు వుంది. దీనికి సమీపంలో 50 మందికిపైగా పేద రైతులు, కార్మికులు గుడిసెలు, పెంకుటిళ్లు వేసుకుని నివసిస్తున్నారు. శివగామీ, అరుక్కానీ అనే మహిళలు మట్టితో పెంకుటిళ్లు నిర్మించుకుని కుటుంబసభ్యులతో వుంటున్నారు. 

వస్త్రవ్యాపారి తన ఇంటికి 30 అడుగుల పొడవు, 25 అడుగుల ఎత్తులో బండ రాళ్లతో నిర్మించిన ప్రహరీ గోడ ఈ ఇళ్లకు అనుకునే ఉంది. ఈ గోడే విషాదానికి అడ్రస్ అయింది. వర్షాలకు ఈ గోడ తడిసి కూలిపోయే స్థితికి చేరింది. రాత్రి ఇళ్ళలో జనం యథావిధిగా నిద్రిస్తున్న టైంలో వర్షానికి గోడ కూలిపోయింది.

Image

ఈ గోడ శిథిలాలు ఈ ఇళ్ళపై పడడం, జనమంతా ఇళ్ళలో ఉండడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు.  రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు శిథిలాల్లో చిక్కుకున్నారు. మేట్టుపాళయం పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. భారీ ప్రొక్లయిన్లను రప్పించి శిథిలాలను తొలగించగా మొత్తం 17 మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు.

శిథిలాల తొలగింపునకు కోయంబత్తూరు నుంచి ప్రకృతి వైపరీత్యాల రక్షణ దళాలను రప్పించారు. కోయంబత్తూరు కలెక్టర్‌ రాజామణి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు  రూ.4 లక్షల ఆర్థికసహాయాన్ని ప్రకటించారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక శిక్షణ పొందిన వంద మందితో కూడిన టీం రంగంలోకి దిగింది.

ఈప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించిన మేట్టుపాళయం ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వచ్చి బైఠాయించారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా కదలక పోవడంతో లాఠీఛార్జి చేశారు. కాగా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఈ ప్రాంతాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించనున్నారు. 

సూడాన్‌‌లో భారీ పేలుడు.. 18మంది భారతీయుల సజీవదహనం

సూడాన్‌‌లో భారీ పేలుడు.. 18మంది భారతీయుల సజీవదహనం

   a day ago


లారీడు ఉల్లి మాయం... పొలంలో ఉల్లిపంట మాయం... ఉల్లి నేరాలు షురూ

లారీడు ఉల్లి మాయం... పొలంలో ఉల్లిపంట మాయం... ఉల్లి నేరాలు షురూ

   05-12-2019


రాత్రిపూట స్త్రీలకు ఉచిత ప్రయాణం.. పంజాబ్ ప్రభుత్వ కీలక నిర్ణయం

రాత్రిపూట స్త్రీలకు ఉచిత ప్రయాణం.. పంజాబ్ ప్రభుత్వ కీలక నిర్ణయం

   05-12-2019


డబ్బులేదు-అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేయను: కమలా హ్యారిస్

డబ్బులేదు-అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేయను: కమలా హ్యారిస్

   04-12-2019


ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమానాల దారి మళ్ళింపు

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమానాల దారి మళ్ళింపు

   04-12-2019


రాజ్ భవన్‌కు బెదిరింపులేఖ.. యూపీలో కలకలం

రాజ్ భవన్‌కు బెదిరింపులేఖ.. యూపీలో కలకలం

   04-12-2019


బెంగళూరు మెట్రో కీలక నిర్ణయం.. పెప్పర్ స్ప్రేలకు అనుమతి

బెంగళూరు మెట్రో కీలక నిర్ణయం.. పెప్పర్ స్ప్రేలకు అనుమతి

   04-12-2019


స్వామి నిత్యానంద ఎక్కడున్నాడో తెలుసా?

స్వామి నిత్యానంద ఎక్కడున్నాడో తెలుసా?

   03-12-2019


నేరాలు చేసే వారి వయసును పరిగణించాలా: వెంకయ్యనాయుడు ప్రశ్న

నేరాలు చేసే వారి వయసును పరిగణించాలా: వెంకయ్యనాయుడు ప్రశ్న

   03-12-2019


పార్లమెంటును కుదిపేసిన దిశా ఘటన

పార్లమెంటును కుదిపేసిన దిశా ఘటన

   02-12-2019


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle