newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఎందుకీ దోపిడీ... చమురు ధరల మంటపై విపక్షాల ఆగ్రహం

01-07-202001-07-2020 10:27:22 IST
Updated On 01-07-2020 10:59:30 ISTUpdated On 01-07-20202020-07-01T04:57:22.356Z01-07-2020 2020-07-01T04:56:51.647Z - 2020-07-01T05:29:30.669Z - 01-07-2020

ఎందుకీ దోపిడీ... చమురు ధరల మంటపై విపక్షాల ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోంది. కేసులు ఆరులక్షలకు చేరువ అవుతున్నాయి. గత మూడు వారాలుగా అదే పనిగా పైపైకి పోతున్న పెట్రో ధరలు దేశ పౌరుల్ని హడలెత్తిస్తున్నాయి. 24 గంటలు గడవ కుండానే సోమవారం మరోసారి పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగాయి. ఈ పెరుగుదల ఎంత వింతగా వుందంటే లీటర్‌ పెట్రోల్‌కన్నా లీటర్‌ డీజిల్‌ ధరే ఇప్పుడు అధికంగావుంది! లాక్‌డౌన్‌ కాలంలో తమకొచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి మొదటి పదిరోజులూ చమురు సంస్థలు ధరల్ని పెంచాయి. అటు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం పెంచింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. 

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా వరస లాక్‌డౌన్‌లు, ఆ తర్వాత కూడా కొనసాగుతున్న అనేక రకాల ఆంక్షలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో సొంత వాహనాల దుమ్ము దులిపి బయటకు తీయడం మొదలు పెట్టారు. ఇదే అదునుగా చమురు సంస్థలు నిలువుదోపిడీకి దిగుతున్నాయి. ఈ నెల 7 నుంచి రోజూ ధరల్ని పెంచుతూనే వున్నాయి. 

కేంద్ర ప్రభుత్వం వరుసగా రోజూ పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలు. విజయవాడలో సిపిఐ-సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు, ఇతర వామపక్ష నేతలు పాల్గొంటున్నారు. దేశంలో ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. 

ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నవేళ కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచుతూ ప్రజల సొమ్మును దోపిడీ చేస్తోందని సోనియా మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతున్నా 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటివరకు వెూదీ సర్కారు పెట్రోల్‌, డీజిల్‌పై 12 సార్లు ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచిందని సోనియాగాంధీ ఆరోపించారు.

లాక్ డౌన్ వల్ల చమురు వినియోగం బాగా తగ్గింది. ఒక సర్వే ప్రకారం డీజిల్, పెట్రోల్ వినియోగం 50 శాతంవరకూ తగ్గింది. కానీ కంపెనీలు మాత్రం ధరలు పెంచుతూనే వున్నాయి. పెట్రో ధరల పెంపువల్ల ద్రవ్యోల్బణం విజృంభించి, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే సామాన్యులు నిస్సహాయంగా వుండిపోతున్నారు. దీన్నంతటినీ మౌనంగా భరిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వాలు తమకొచ్చే పన్నుల కోసం మోకాలడ్డుతున్నాయనే విమర్శలున్నాయి. 

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   10 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   16 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   a day ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   14-05-2021


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle