newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఊపిరాడకపోతే బోర్లపడుకొబెట్టండి.. కరోనాపై భారత సంతతి వైద్యురాలి కొత్త వైద్యం

17-04-202017-04-2020 14:22:50 IST
Updated On 17-04-2020 14:26:17 ISTUpdated On 17-04-20202020-04-17T08:52:50.061Z17-04-2020 2020-04-17T08:52:48.125Z - 2020-04-17T08:56:17.718Z - 17-04-2020

ఊపిరాడకపోతే బోర్లపడుకొబెట్టండి.. కరోనాపై భారత సంతతి వైద్యురాలి కొత్త వైద్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌కు ఇంతవరకు తగిన మందేలేదు. వాక్సిన్ తయారీ కనుచూపుమేరలో కనిపించడంలేదు. కానీ వేలసంఖ్యలో దేశదేశాల్లో మానవ ప్రాణాలను హరిస్తున్న కరోనాకు విరుగుడు ఏది అని కనుగొనడంలో ఒక్కో దేశం ఒక్కో ప్రయోగం చేస్తోంది. తలచిన వైద్య పద్ధతులన్నీ ప్రయోగిస్తోంది. వీటన్నింటి లక్ష్యం ఒక్కటే. నిస్సహాయంగా దిక్కులేని మరణాల బారిన పడతున్న రోగుల ప్రాణాలను నిలబెట్టడం ఎలా అన్నదే. భారత్‌లో విస్తృతంగా వాడుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్ర కరోనా విరుగుడుకు సంజీవని అని యావత్ ప్రపంచంలో ఇప్పటికే ఒక నమ్మకం బలపడిపోయింది. అందుకే ఆ మాత్ర మాకు కావాలంటే మాకు కావాలని ప్రపంచ దేశాలన్ని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 

ఈ నేపథ్యంలో అమెరికా వైద్యులు ఐసీయూలో ఉంటున్న కరోనా రోగుల ప్రాణాలను రక్షించేందుకు ఒక కొత్త పద్దతిని కనిపెట్టారు. రోగులకు మెరుగైన స్థాయిలో ఆక్సిజన్ అందించడంలో వారు ఈ వినూత్న పద్ధతిని కనుగొన్నారు. అదేమిటంటే రోగులను వెల్లకిలా కాకుండా, బోర్లా పడుకోబెడితే వారికి ఆక్సిజన్ బాగా అందుతోందట. ఇది కూడా భారత సంతతి అమెరికన్ వైద్యురాలు కనిపెట్టిన పద్ధతి కావడం విశేషం.

మనిషికి ఏ కారణం వల్ల అయినా కావచ్చు ఊపిరాడకపోతే వెంటనే తన బట్టలు వదులు చేసి వెల్లకిలా పడుకో బెట్టడం మన సమాజంలో తరతరాలుగా ఆచరిస్తున్న సంచిత జ్ఞానం. కరోనా విషయంలో ఈ సంప్రదాయ జ్ఞానం తిరగబడింది. ఐసీయూలో ఉండి కూడా ఆక్సిజన్ అందక ఇబ్బందిపడుతున్న కరోనా రోగులకు కొత్త వైద్యం కనుగొన్నారు. అది రహస్యమేమీ కాదు. అనుభవంలో కనుగొన్న అతి సామాన్య విధానం. రోగిని బోర్లపడుకోబెట్టడం. ఇలా పడుకోబెట్టిన రోగులు సులభంగా గాలి పీల్చుకుంటున్నారని న్యూయార్క్‌లో తేలింది.

కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండి.. ఐసీయూలో ఉన్న రోగుల ప్రాణాలను రక్షించేందుకు అమెరికాలో  వైద్యులు ఓ వినూత్న పద్ధతిని గుర్తించారు. వెల్లకిలా కాకుండా బోర్లా పడుకోబెట్టడం ద్వారా రోగులకు మెరుగైన స్థాయిలో ఆక్సిజన్‌ అందుతున్నట్లు గుర్తించారు. ఈ పద్ధతి ద్వారా తాము విలువైన ప్రాణాలనెన్నో నిలబెట్టినట్లు న్యూయార్క్‌లోని నార్త్‌వెల్‌ హెల్త్‌ ఆసుపత్రిలోని క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి మంగళ నరసింహన్‌ చెబుతున్నారు. ‘ఇది చాలా చిన్నపనే. కానీ రోగుల పరిస్థితిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది’ అని ఆమె తెలిపారు. 

బోర్లా పడుకోబెట్టడం వల్ల రోగికి అవసరమైన ఆక్సిజన్‌ తగినంత ఊపిరితిత్తుల్లోకి చేరుతోందని, లాంగ్‌ ఐలండ్‌ జ్యూయిష్‌ ఆసుపత్రిలో ఒక రోగి రక్తంలోని ఆక్సిజన్‌ సాచురేషన్‌ 85 నుంచి 98 వరకు పెరిగిందని సీఎన్‌ఎన్‌ టెలివిజన్‌ ఒక కథనంలో తెలిపింది. ‘బోర్లా పడుకోబెడితే ఊపిరితిత్తుల్లోని కొన్ని భాగాలు తెరుచుకుంటున్నాయి. మామూలుగానైతే ఇవి మూసుకుపోయి ఉంటాయి’ అని మసాచూసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రికి చెందిన కాథరీన్‌ హిబ్బర్ట్‌ తెలిపారు. 

బోర్లా పడుకోబెట్టడం మంచిదే! పైగా పాత విధానమే..

కాస్త వెనక్కు పోయి చూస్తే 2013లో న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ఈ ప్రక్రియకు సంబంధించి ఒక అధ్యయనం ప్రచురితమైంది. ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా ఉన్న రోగులను బోర్లా పడుకోబెట్టినప్పుడు ప్రాణగండం తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. అయితే ఈ అధ్యయనంలో వెంటిలేటర్లపై ఉన్న వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. 

గత నెల చైనా వూహాన్‌లో జరిగిన మరో అధ్యయనం కూడా ఇలా బోర్లా పడుకోబెట్టడం అనేది కొంతమందికి బాగా ఉపయోగపడిందని తేల్చింది. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిలో ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తాయో ఇది తెలుపుతోందని సౌత్‌ ఈస్ట్‌ యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్‌ హైబో క్యూ తెలిపారు. వెంటిలేటర్‌ అవసరమైన రోగుల్లో కొందరు ఈ పద్ధతికి స్పందిస్తారని తెలుస్తోందని క్యూ చెప్పారు. 

అయితే ప్రస్తుతానికి ఈ పద్ధతిని అందరికీ ఉపయోగించవచ్చా లేదా అనేది పూర్తిగా స్పష్టం కావడం లేదు. తగినన్ని పరీక్షలు జరగకపోవడమే దీనికి కారణం. ఏదేమైనా భారత సంతతి అమెరికన్ వైద్యురాలు మంగళ నరసింహన్ కరోనా వైద్య చికిత్సపై ప్రసరించిన కొత్త కాంతి ఫలిస్తే, రోగుల మరణాలను తగ్గించగలిగితే అంతకు మించిన పని ఏముంటుంది మరి.

 

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   4 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   20 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle