newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ఉరి శిక్ష నుంచి త‌ప్పించుకునేందుకు.. ''నిర్భ‌య నిందితుల స్కెచ్‌''

25-12-201925-12-2019 03:32:34 IST
Updated On 25-12-2019 03:32:30 ISTUpdated On 25-12-20192019-12-24T22:02:34.819Z25-12-2019 2019-12-24T22:02:18.979Z - 2019-12-24T22:02:30.502Z - 25-12-2019

ఉరి శిక్ష నుంచి త‌ప్పించుకునేందుకు.. ''నిర్భ‌య నిందితుల స్కెచ్‌''
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2012 నిర్భ‌య కేసుకు సంబంధించి దోషుల శిక్ష మ‌రింత ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తుంది. న్యాయ‌ప‌రంగా త‌మ‌కు ఉన్న ప్ర‌తీ అవ‌కాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు నిర్భ‌య దోషులు సిద్ధ‌మ‌య్యారు. కాగా, తీహార్ జైలు అథారిటీ ఇచ్చిన నోటీసుల‌కు తాము సుప్రీం కోర్టులో క్యూరేటివ్‌ పిటిష‌న్ దాఖ‌లు చేస్తామంటూ నిర్భ‌య దోషులు స‌మాధానం ఇవ్వ‌డం జ‌రిగింది.

అంతేకాకుండా, సుప్రీం కోర్టులో క్యూరేటివ్‌ పిటిష‌న్, ఆ త‌రువాత రాష్ట్ర‌ప‌తి క్ష‌మాభిక్ష అంశం అవ‌కాశాన్ని కూడా తాము వినియోగించుకుంటామ‌ని నిర్భ‌య దోషులు తీహార్ జైలు అధికారుల‌కు చెప్పారు. దీంతో 2017 మే 5న ట్ర‌య‌ల్ కోర్టు ఇచ్చిన తీర్పును స‌మ‌ర్ధిస్తూ నిర్భ‌య దోషుల‌కు సుప్రీం కోర్టు విధించిన ఉరిశిక్ష మ‌రింత ఆల‌స్యం కానుంది.

నిర్భ‌య దోషుల‌కు డెత్ వారెంట్ ఇష్యూపై, మ‌రీ ముఖ్యంగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 22న విచార‌ణ జ‌ర‌గ‌బోతుంది. ఈ సంద‌ర్భంగా సుప్రీం కోర్టులో తాము క్యూరేటివ్ పిటిష‌న్ దాఖ‌లు చేసుకుంటామంటూ తీహార్ జైలు అథారిటీ ఇచ్చిన నోటీసుల‌కు స‌మాధానం ఇచ్చారు. దాని ఆధారంగానే నిర్భ‌య కేసు మ‌ళ్లీ సుప్రీం కోర్టు ముందుకు వెళ్ల‌నుంది.

ఇక నిర్భ‌య దోషులు సుప్రీం కోర్టులో దాఖ‌లు చేయ‌నున్న క్యూరేటివ్ పిటిష‌న్ విష‌యానికొస్తే, ట్ర‌య‌ల్ కోర్టు ఇచ్చిన ఉరి శిక్ష అమ‌లును నిలుపుద‌ల చేయాల‌న్న‌దే ఆ పిటిష‌న్ సారాంశం. అయితే, ఒక‌వేళ‌ క్యూరేటివ్ పిటిష‌న్‌ను సుప్రీం కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రిస్తే దోషుల‌కు విధించిన ఉరి శిక్ష‌ను నిలుపుద‌ల చేస్తుందా..?  లేక పిటిష‌న్‌నే తిర‌స్క‌రిస్తుందా..? అన్న‌ది తెలియాల్సి ఉంది.

ఒక‌వేళ  సుప్రీం కోర్టు గ‌నుక దోషుల క్యూరేటివ్ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించిన‌ట్ల‌యితే, ఆ త‌దుప‌రి క్షమాభిక్ష కోసం రాష్ట్ర‌ప‌తి వ‌ద్ద‌కు వెళ్లే అవ‌కాశం ఉంటుంది. దాంతో రాష్ట్ర‌ప‌తి కూడా ఎంత త్వ‌ర‌గా దీనిపై నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది కూడా వేచి చూడాల్సి ఉంటుంది.

ఇలా, క్యూరేటివ్ పిటిష‌న్‌ను సుప్రీం కోర్టు అంగీక‌రిస్తే ఎటువంటి ప‌రిణామాలు ఉంటాయి..? ఆ పిటిష‌న్‌ను సుప్రీం కొట్టేస్తే తిరిగి రాష్ట్ర‌ప‌తి వ‌ద్ద‌కు వెళ్ల‌డం వంటి ప‌రిణామాల‌తో శిక్ష అమ‌లును మ‌రింత జాప్యం అయ్యే దిశ‌గానే నిర్భ‌య దోషులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పొచ్చు. మ‌రోప‌క్క‌, నిర్భ‌య త‌ల్లిదండ్రులు మాత్రం దోషుల‌కు వెంట‌నే శిక్ష అమ‌లు అయ్యేలా తీర్పును వెలువ‌రించాల‌ని వేసిన పిటిష‌న్ జ‌న‌వ‌రి 3వ వారంలో విచార‌ణ‌కు రానుంది. ఇలా నిర్భ‌య నిందితుల శిక్ష మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle