newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ఉరి తప్పదు.. నా కూతురి ఆత్మకు ఈరోజే శాంతి లభిస్తుంది: నిర్భయ తల్లి

20-03-202020-03-2020 07:00:02 IST
2020-03-20T01:30:02.313Z20-03-2020 2020-03-20T01:29:59.207Z - - 09-08-2020

ఉరి తప్పదు.. నా కూతురి ఆత్మకు ఈరోజే శాంతి లభిస్తుంది: నిర్భయ తల్లి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిర్భయ దోషులకు న్యాయపరంగా ఇక ఎలాంటి అవకాశాలూ లేవని ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు గురువారం రాత్రి తేల్చి చెప్పడంతో తన కుమార్తెను దారుణంగా హతమార్చిన హంతకులకు ఉరి ఖాయం అని నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. ‘‘వారిని రేపు (శుక్రవారం ఉదయం) ఉరితీయబోతున్నారు. ఏడేళ్ల తర్వాత నా కూతురి ఆత్మకు శాంతి చేకూరబోతోంది. నాకు కూడా మనశ్శాంతి కలుగుతుంది’’ అని ఆశాదేవి వ్యాఖ్యానించారు. తన కుమార్తె మాత్రమే కాకుండా భారతదేశంలోని అమ్మాయిలందరికీ ఈరోజు న్యాయం జరుగుతుందని ఆశాదేవి వ్యాఖ్యానించారు. ఉరి శిక్ష తేదీని వాయిదా వేయడానికి వారికి ఇక ఏ పిటిషన్లూ అందుబాటులో ఉండవని ఆమె అభిప్రాయపడ్డారు.

2012 డిసెంబర్ 16న దేశరాజధానిలో కదిలే బస్సులో నిర్బయను సామూహిక అత్యాచారంతో దారుణ హత్యకు గురిచేసిన నిందితుల్లో నలుగురికి (ముఖేష్ సింగ్, అక్షయ్ సింగ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ) నేటి ఉదయం అంటే శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయనున్నారు. 

కన్నకుమార్తెకు జరిగిన ఘోర అన్యాయానికి నిందితులకు తగిన శిక్ష పడేలా చేయాలని చివరివరకూ ప్రయత్నించిన నిర్బయ కన్నతల్లి ఆశాదేవికి ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఎదురైన చేదు అనుభవాలకు లెక్కేలేదు. ‘‘ఆడపిల్లను ఒంటరిగా ఎందుకు బయటకు పంపిస్తారు. అలా అబ్బాయిలతో స్నేహం చేస్తే ఇలాంటి పరిస్థితి ఎదురుకాక ఇంకేమవుతుంది. రాత్రీ పగలూ తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగితే ఇలాగే అవుతుంది’’అని సామాన్యుల నుంచి దోషుల లాయర్‌ వరకు ప్రతీ ఒక్కరు సూటిపోటి మాటలతో ఆమెను చిత్రవధ చేశారు. 

అయినా వాటన్నింటినీ ఆమె లెక్కచేయలేదు. తన కూతురి కోసం వీధుల్లో నిరసన కార్యక్రమాలకు దిగిన యువత ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగింది. జిల్లా కోర్టు మొదలు.. హైకోర్టు.. సుప్రీంకోర్టు ఇలా న్యాయం కోసం ఆమె ఎక్కని కోర్టు మెట్టులేదంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో మార్చి 13, 2014లో అత్యంత హేయమైన నేరానికి పాల్పడ్డారనడానికి సరైన ఆధారాలు లభించిన మీదట నిర్భయ దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే వాళ్లు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దిగువకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లారు.

ఈ నేపథ్యంలో 2017 మే 5న నిర్భయ దోషులు నలుగురికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో ఆశాదేవి మనస్సు కాస్త శాంతించింది. ఇక మరణశిక్ష అమలే తరువాయి అని ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఈ తీర్పును కేవలం ఆశాదేవి మాత్రమే కాదు సగటు ఆడపిల్లల తల్లితండ్రులు, నిర్భయకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరు స్వాగతించారు. అయితే శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వచ్చినంత మాత్రాన అది సత్వరమే అమలు కాదని తెలుసుకోవడానికి ఆశాదేవికి ఎక్కువ సమయం పట్టలేదు. అయినా ఆమె తన పోరాటం ఆపలేదు. భారత న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతో అలుపెరుగక కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యతను మారుతున్న ప్రభుత్వాలు, ప్రసంగాలు దంచే నాయకులకు గుర్తుచేస్తూనే ఉంది.

ఇలాంటి తరుణంలో అనేక పిటిషన్లు, రివ్యూ పిటిషన్లు, న్యాయ ప్రక్రియల అనంతరం జనవరి 22, 2020లో ఉరిశిక్ష అమలు చేసేందుకు ఢిల్లీ పటియాలా హౌజ్‌కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసింది. అయితే దోషుల వరుస పిటిషన్లతో.. ఫిబ్రవరి 1 తర్వాత మార్చి 3కు వాయిదా పడింది. అనంతరం మార్చి 20న నలుగురు దోషులు ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మ ఉరితీయాలంటూ తాజా డెత్‌ వారెంట్లు జారీ అయ్యాయి. అయితే ఉరిశిక్ష అమలు తేదీ సమీపిస్తున్న వేళ.. తాజాగా నిర్బయ దోషులు మరోసారి కోర్టు తలుపు తడుతున్నారు. భారత్‌లో తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమకు ఏ పాపం తెలియదని.. తమను బలిపశువులు చేశారంటూ ఐసీజేకు విన్నవించారు.

మరోవైపు వారి కుటుంబ సభ్యులు తమకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాయగా.. దోషుల్లో ఒకడైన అక్షయ్‌ భార్య మంగళవారం ఔరంగాబాద్‌ కుటుంబ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అంతేకాదు తాము దాఖలు చేసిన పిటిషన్ల విచారణ పూర్తయ్యేంత వరకు శిక్ష అమలు నిలిపివేయాలంటూ మరో పిటిషన్‌ దాఖలు చేశారు దోషులు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మరోసారి శిక్ష అమలు వాయిదా పడుతుందా అనే సందేహాలు తలెత్తాయి కూడా.. కానీ భూదేవి అంత సహనంతో.. తన కూతురికి ఆలస్యంగానైనా తప్పక న్యాయం జరుగుతుందనే ఆశతో ఆమె ఇన్నాళ్లూ ఎదురుచూసింది. ఆ నలుగురికి ఎన్నడూ ఉరిశిక్ష అమలు కానివ్వని దోషుల తరపు లాయర్‌ తనను సవాలు చేసినా పోరాట పటిమతో ముందుకు సాగింది. 

ఈ క్రమంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతోందని ఒక్కోసారి ఆశాదేవి ఆగ్రహం వ్యక్తం చేసినా.. మానవ హక్కుల సంఘాల తీరును విమర్శించినా.. దాని వెనుక తల్లి ప్రేమ, ఏడేళ్ల సంఘర్షణ, మానసిక వేదనే తప్ప మరే ఇతర కారణాలు లేవని గ్రహించాలి. పైగా.. ఇన్నేళ్లుగా ఇంతగా పోరాడుతున్న ఆశాదేవి సంపన్నురాలేమీ కాదు. మెడలో కేవలం నల్లపూసల గొలుసు మాత్రమే ధరించే సాధారణ గృహిణి. భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో పొలం అమ్మేసి మరీ కూతురిని చదివించిన వ్యక్తికి భార్య. ఇక గురువారం నాడు దోషులకు ఏ అవకాశాలు లేవంటూ కోర్టులు వారి పిటిషన్లను కొట్టివేసిన నేపథ్యంలో ఆమె హర్షం వ్యక్తం చేశారు. ‘‘వారిని ఉరితీయబోతున్నారు. ఏడేళ్ల తర్వాత నా కూతురి ఆత్మకు శాంతి చేకూరబోతోంది. నాకు కూడా మనశ్శాంతి కలుగుతుంది’’ అని ఆశాదేవి వ్యాఖ్యానించారు

అత్యంత దయనీయ పరిస్థితుల్లో ప్రాణాలు విడిచిన నిర్భయకు తల్లి ఆమె. రెండు గంటల్లో తిరిగి వచ్చేస్తానమ్మా బయటకు వెళ్లిన కూతురిపై ఏ మృగం దాడి చేసిందో తెలియనంతగా.. కూతురి శరీరం సామూహిక అత్యాచారానికి గురై  రక్తంతో తడిసిపోతే కళ్లారా చూసి ఆమె తల్లి గుండె పగిలేలా రోదించింది. పెదవులు చిట్లిపోయి... తలమీద చర్మం ఊడిపోయి... మాంసపు ముద్దలా ఆస్పత్రి మంచం మీద పడి ఉన్న బిడ్డకు ఎప్పుడెప్పుడు స్పృహ వస్తుందా అని ఎదురుచూసింది. తమ కెరీర్‌లో ఇంతటి ఘోరమైన కేసును ఎప్పుడూ చూడలేదని వైద్యులు వాపోయినా.. ఏదో ఒక అద్భుతం జరిగి తన చిన్నారి తల్లి కళ్లు తెరుస్తుందనుకుంది.

కానీ నిర్భయ తన తల్లి కలలను కల్లలు చేస్తూ శాశ్వతంగా ఆమెకు దూరమైంది. చికిత్స పొందుతున్న క్రమంలో ఏనాడు కనీసం గుక్కెడు మంచి నీళ్లు కూడా తాగకుండానే ఈ ప్రపంచాన్ని విడిచివెళ్లిపోయింది. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి కోలుకోవడం ఏ తల్లికైనా సాధ్యం కాదు. ఆశాదేవి కూడా ఇందుకు అతీతురాలు కాదు. కూతురిని తలుచుకుని అందరిలాగే కుంగిపోయింది. బిడ్డ జ్ఞాపకాలతో పిచ్చిపట్టినదానిలా అయిపోయింది. అయితే ఇలా ఏడుస్తూ కూర్చుంటే.. తన కూతురికి న్యాయం జరగదనే సత్యం ఆమెకు తొందరగానే బోధపడింది. అందుకే తనకు కడుపుకోత మిగిల్చిన వాళ్లకు సరైన శిక్ష పడేలా చేసేందుకు నడుం బిగించింది. ఓ తల్లిగా తాను సర్వం కోల్పోయినా.. మనసును బండరాయి చేసుకుంది. బాధను దిగమింగి తనలోని శక్తినంతటినీ కూడగట్టుకుని ఏడేళ్లుగా సుదీర్ఘ పోరాటం చేసింది.

తన కుమారుడికి ప్రాణ బిక్ష పెట్టమంటూ దోషుల్లో ఒకరైన ముఖేశ్‌ సింగ్‌ తల్లి తనను అభ్యర్థించిన సందర్భంలో ఆశాదేవి చెప్పిన మాటలు హృదయమున్న ప్రతి ఒక్కరినీ ద్రవింపజేయక మానవు. 

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   16 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle