newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

ఉన్నావ్ బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం.. ససేమిరా అన్న తండ్రి

08-12-201908-12-2019 08:43:56 IST
2019-12-08T03:13:56.245Z08-12-2019 2019-12-08T03:01:26.832Z - - 05-08-2020

ఉన్నావ్ బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం.. ససేమిరా అన్న తండ్రి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలిని సజీవంగా తగుల బెట్టి చంపడానికి ప్రయత్నించిన ఘటనలో 90 శాతం కాలిన గాయాలతో పోరాడి మరణించిన బాధితురాలు. బాధితురాలి కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉపశమన చర్య కింద రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. బీజేపీ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య, ఉన్నావ్‌ ఎంపీ సాక్షి మహారాజ్‌తో కలిసి శనివారం బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎం సహాయనిధి నుంచి మృతురాలి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇ‍వ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. వారికి ఓ ఇంటినికూడా కేటాయిస్తామని, ఇతర సదుపాయాలను కూడా కల్పిస్తామని వెల్లడించింది. 

సీఎం ఆదిత్యనాథ్‌తోపాటు ప్రభుత్వం బాధితురాలికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిందితులు ఎవరైనా విడిచిపెట్టేది లేదని, ఈ విషయంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. సీఎం యోగి ఆదిత్యానాథ్‌ కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఉన్నావ్‌ బాధితురాలు మరణం దురదృష్టకరమని విచారణ వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా నిందితులకు  కఠిన శిక్ష పడేలా చూస్తామని పేర్కొన్నారు.

మరోవైపున ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి మృతి పట్ల ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిందితులందరినీ అరెస్టు చేశామని, కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకు అప్పగించి.. వారికి త్వరగా శిక్ష పడేలా చేస్తామని ఆయన పేర్కొన్నారు.

గురువారం కోర్టు విచారణకు వెళ్తున్న ఉన్నావ్ బాధితురాలిని రైల్వేస్టేషన్‌ సమీపంలో నిందితులు అడ్డుకొని పెట్రోల్‌ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు శుక్రవారం రాత్రి మరణించింది. ఈ ఘటన అనంతరం అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి దారుణం జరిగినా బీజేపీ ప్రభుత్వ సరిగా స్పందించడం లేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. జరిగిన ఘోరమంతా జరిగాక ఏం చేసినా ఏం లాభమని విమర్శలు గుప్పిస్తున్నారు.

ముఖ్యమంత్రి ప్రకటనపై బాధితురాలి తండ్రి మండిపడ్డారు. నా కుమార్తె ప్రాణాలు కోల్పోయిన ఘటనకు గాను తనకు ఆర్థిక సాయం వద్దేవద్దని ఆమె మృతికి కారణమైన వారిని ఉన్నఫళాన చంపేయాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. ‘నా కుమార్తె మృతికి కారణమైన దోషులను హైదరాబాద్‌ ఎన్‌కౌంటర్‌ తరహాలో చంపేయాలి. లేక వెంటనే ఉరి తీయాలి. అదే నాకు ఓదార్పు. నాకు ఎటువంటి ఆర్థిక సాయం అవసరం లేదు అని ఆయన ప్రభుత్వ సహాయాన్ని తోసిపుచ్చారు. ఈకేసులో నిందితులు తన కుటుంబాన్ని పదే పదే బెదిరిస్తూ వచ్చారని, అయినా వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని బాధితురాలి తండ్రి ఆరోపించారు.

బాధితురాలు మరణ వాంగ్మూలంలో తనపై పెట్రోల్ పోసి తగులబెట్టిన అయిదుగురు వ్యక్తుల పేర్లను న్యాయమూర్తి ముందు చెప్పింది. తనపై అత్యాచారం చేసిన శివం త్రివేది, శుభం త్రివేదితోపాటు హరి శంకర్ త్రివేది, ఉమేష్ బాజ్‌పేయి, రామ్ కిషోర్ త్రివేదిలు గురువారం తెల్లవారు జామున కోర్టు విచారణకు బయలు దేరి గౌరా క్రాసింగ్ దాడుతుండగా తనను అడ్డగించి వారిపై మోపిన కేసును ఉపసంహరించాలని డిమాండ్ చేశారని, కానీ తాను తిరస్కరించడంతో వారు తనను సజీవంగా తగులబెట్టడానికి ప్రయత్నించారని బాధితురాలు చెప్పింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా కోర్టు ఆ అయిదుగురు మృగాలను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది.

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   5 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   9 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle