newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

ఉద్యోగుల చేతికి మరింత జీతం.. ప్రభుత్వ ట్రిక్కుతో ఇది సాధ్యమే

10-12-201910-12-2019 09:58:16 IST
2019-12-10T04:28:16.390Z10-12-2019 2019-12-10T04:28:09.022Z - - 24-01-2020

ఉద్యోగుల చేతికి మరింత జీతం.. ప్రభుత్వ ట్రిక్కుతో ఇది సాధ్యమే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మీరు వేతన జీవులే అయితే ఇకపై మీరు ఇంటికి తీసుకుపోయే వేతనం పెరగనుంది. దేశంలో వస్తూత్పత్తులకు డిమాండ్ బాగా పడిపోయిన నేపథ్యంలో ఉద్యోగులు ప్రతినెలా చెల్లించే ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎప్) మొత్తాన్ని తగ్గించి ఆ మొత్తాన్ని ఉద్యోగి ఇంటికి తీసుకుని వెళ్లేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో దేశంలో వినియోగం పెరగుతుందని కేంద్రం ఆశిస్తోంది.  పార్లమెంటులో ఈ వారం కేంద్రం సమర్పించనున్న సోషల్ సెక్యూరిటీ కోడ్ బిల్‌ 2019తో ఇది సాధ్యపడనుంది.

సోషల్ సెక్యూరిటీ కోడ్‌లో ఎనిమిది కేంద్ర చట్టాలకు సంబంధించిన నిబంధనలను కలపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంప్లాయ్‌మెంట్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసిలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952, మెటర్నిటీ బెనిఫెట్ యాక్ట్ 1961, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972, సినీ వర్కర్స్ వెల్పేర్ ఫండ్ యాక్ట్ 1981, బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ సెస్ యాక్ట్ 1996, అనార్గనైజ్డ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ 2008 అనే ఎనిమిది చట్టాలల్లోని అంశాలను కలిపి ఈ కొత్త బిల్లును రూపొందిస్తున్నారు. 

పైగా, 44 లేబర్ చట్టాలను నాలుగు కోడ్‌లలో కలిపేశారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది కూడా. ఈ నాలుగు కోడ్లు ఏవంటే వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత మరియు రక్షణ, ఆరోగ్యం మరియు వర్కింగ్ పరిస్థితులు. ఈ నాలుగింటిలో సామాజిక భద్రత చిట్ట చివరిది.

ఇంతవరకు ఉద్యోగుల జీతంనుంచి 12 శాతాన్ని పీఎప్‌లో కలిపేవారు. దీనికి సమానమైన మొత్తాన్ని యజమాని కలిపేవాడు. కానీ ఇప్పుడు ఉద్యోగి కంట్రిబ్యూషన్ కాస్త తగ్గనుండగా, యజమాని కంట్రిబ్యూషన్ 12 శాతంగానే ఉంటుంది.  అయితే ఈ తగ్గింపు ఎమ్ఎస్ఎమ్ఇ, జౌళి, స్టారప్స్, వంటి కొన్ని రంగాల్లో మాత్రమే ఉంటుందని ప్రభుత్వాధికారులు తెలిపారు. 

ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వం తమకు ఈ కొత్త బిల్లును చూపించలేదని తెలిపారు. ప్రభుత్వం సామాజిక భద్రతకు హామీ ఇవ్వనట్లు దీన్ని బట్టి తెలుస్తోందని వారన్నారు. వారు ఉద్యోగుల నుంచి పొదుపు మొత్తాలను తీసివేసి దాంతో వినియోగాన్ని పెంచాలని భావిస్తున్నారు. ప్రభుత్వ చేతకానితనానికి ఉద్యోగులు ఎందుకు నష్టపోవాలి. దీనివల్ల రిటైర్మెంట్ సమయంలో వారి పొదుపు మొత్తాలు తగ్గిపోతాయి అని కార్మిక నేతలు చెబుతున్నారు,.

జీడీపీ రేటు ఆరేళ్ల దిగువకు పడిపోయిన నేపథ్యంలో వినియోగాన్ని పెంచడానికి కేంద్రం ఈ చర్యకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే వినియోగదారు విశ్వాసం గత తొమ్మిదేళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడపోయిందని ఆర్బీఐ సర్వే వెల్లడించింది. పైగా ఈపీఎప్‌ను కలిగి ఉన్న ఉద్యోగులు నేషనల్ పెన్షన్ సిస్టమ్‌కు మారేలా చేయాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ ఫించను పథకం అథిక రాబడులను అందిస్తుందని కార్మిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle