newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మృతి? మీడియాలో భిన్న కథనాలు

27-04-202027-04-2020 09:47:45 IST
Updated On 27-04-2020 09:50:38 ISTUpdated On 27-04-20202020-04-27T04:17:45.909Z27-04-2020 2020-04-27T04:16:01.231Z - 2020-04-27T04:20:38.250Z - 27-04-2020

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మృతి? మీడియాలో భిన్న కథనాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
-రాజధాని ప్యోంగ్యాంగ్‌లో తక్కువ ఎత్తులో ఎగురుతున్న హెలికాఫ్టర్లు 

-రైళ్ల రాకపోకలకు అంతరాయం

-సబ్బులు నుంచి బియ్యం, ఎలెక్ట్రానిక్స్ దాకా ఎగబడి కొంటున్న జనం

-కిమ్ ప్రత్యేక రైలు తూర్పు తీరంలో ఒక కీలకమైన స్టేషన్‌లో రోజుల తరబడి ఉండిపోవడం

-చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వైద్యనిపుణుల బృందం హుటాహుటిన ఉ.కొరియాకు బయలుదేరడం

-కిమ్‌కు శస్త్రచికిత్స చేసిన డాక్టర్‌కు ఆపరేషన్ చేస్తున్న సమయంలోనే చేతులు వణకటం... ఇవన్నీ కిమ్‌కి ఏదో జరిగిందని సంకేతిస్తున్నాయి.

ఉత్తర కొరియా నుంచి వస్తున్న కొన్ని బలమైన సంకేతాలు ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరణించి ఉంటారనే వార్తలకు వీలుకల్పిస్తున్నాయి. దేశాధ్యక్షుడు కిమ్ ఎక్కడున్నారన్నది గత రెండువారాలకు పైగా ఎవరికీ తెలీదు. సుప్రీం నేత ఆరోగ్యం గురించి, తానెక్కడున్నారన్న వివరాల గురించి ఉత్తర కొరియా పాలకవర్గం కిమ్మనకుండా ఉన్నప్పటికీ దేశరాజధానిలో మాత్రం తెలియని ఆందోళన, అలజడి చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. పైగా రాజధాని ప్యోంగాంగ్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగటం, ప్రజలు కంటికి కనిపించిన వస్తువునల్లా కనడానికి దుకాణాలకు తీయడం.. అనేవి ఉత్తర కొరియాలో ఏదో జరగరానిది జరిగినట్లు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

2019లో కిమ్ జీవిత చరిత్ర "ది గ్రేట్ సక్సెసర్: ది డివైన్లీ పర్ఫెక్ట్ డెస్టినీ ఆఫ్ బ్రిలియంట్ కామ్రేడ్ కిమ్ జోంగ్ ఉన్" పుస్తక రచయిత్రి ఫిఫీడ్ తన కాలమ్‌లో అసాధారణమైన విషయాన్న పేర్కొన్నారు. రాజధాని ప్యోంగాంగ్‌లో ప్రజలు లాండ్రీ డిజర్జెంట్ నుంచి బియ్యం వరకు, ఎలెక్ట్రానిక్స్ నుంచి లిక్కర్ దాకా దుకాణాల్లో దొరికిన ప్రతిదీ కొనిపడేస్తున్నారని, దిగుమతి చేసుకున్న విదేశీ సరుకులు హాట్ కేక్స్‌లాగా అమ్ముడవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇక డబ్బాల్లో భద్రం చేసిన చేపలు, సిగిరెట్లు వంటి దేశీయ ఉత్పత్తులకు గత కొద్ది రోజులుగా గణనీయంగా డిమాండ్ పెరిగిందని ఆమె తెలిపారు. అసాధారణమైన ఘటన జరిగితే తప్ప ఉ.కొరియా ఇలాంటి స్పందనలను వ్యక్తీకరించదని ఆమె చెప్పారు.

అయితే ఆమె కిమ్ ఆరోగ్య పరిస్థితి, క్షేమసమాచారాల గురించి తనకు ఏమీ తెలీదని చెప్పారు. ఇలాంటి రూమర్ల పట్ల తాను జాగ్రత్తగా ఉంటానని, అనేకసార్లు వచ్చిన ఇలాంటి పుకార్లు వాస్తవంలో తప్పని చాలా సార్లు రుజువయ్యాయని ఫిఫీల్డ్ తెలిపారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కిమ్ గురించి తనకేమీ తెలీదన్నదే సమాధానమన్నారు. ఉత్తరకొరియా అసలు విషయాన్ని ప్రకటించడం లేక కిమ్ ప్రజలముందుకు రావడం జరిగేంతవరకు మాలో ఎవరికీ ఈ విషయంపై ఏమీ తెలీదని ఆమె చెప్పారు.

గత కొన్ని వారాలుగా కిమ్ జోంగ్ ఉన్ బహిరంగ జీవితంలో కనిపించడం లేదు. తన తాత కిమ్ ఇల్ సంగ్ సంస్మరణ దినోత్సవమైన ఏప్రిల్ 15న కూడా దేశాధ్యక్షుడు కనిపించకపోవడం చాలా అనుమానాలకు దారి తీసింది. ఉత్తర కొరియా కేలండర్లో ఏప్రిల్ 15కు జాతీయ ప్రాధాన్యత ఉంది. పైగా కిమ్ ఈ ఉత్సవాలకు దూరంగా ఉండటం ఇదే తొలిసారి కూడా. 

ఇటీవలే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న కిమ్ పరిస్థితి విషమంగా ఉందని అనేక వార్తా నివేదికలు చెబుతున్నాయి. హాంకాంగ్ శాటిలైట్ టెలివిజన్ వైస్ డైరెక్టర్ షిజాన్ గ్జింజౌ ఒక పోస్టులో కిమ్ జోంగ్ ఉన్ చనిపోయారని ధ్రువీకరించారు. అయితే ఈ ప్రకటనను ఉభయ కొరియాల్లో ఎవరూ ఆమోదించలేదు. దక్షిణ కొరియా సైతం అసాధారణమైన కార్యకలాపాలేవీ ఉత్తర కొరియాలో కనిపించడం లేదని తెలిపింది. చైనా మాత్రం కిమ్ ఆరోగ్య పరిస్థితిపై సలహా ఇవ్వడానికి వైద్య నిపుణుల బృందాన్ని పంపించింది.

కిమ్‌కి సంబంధించిన ప్రత్యేక రైలు వోన్సాన్ రిసార్టు టౌన్‌ వద్ద కనిపించిందని వార్తలొచ్చాయి. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే నార్త్ కొరియా మోనిటరింగ్ ప్రాజెక్టు 38 నార్త్ ప్రకారం కిమ్ ప్రత్యేక రైలు ఆ ప్రాంతంలో ఉన్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలు తెలిపినట్లు పేర్కొంది. ఏప్రిల్ 21, 23 తేదీల్లో వోన్సాన్ స్టేషన్‌లోనే కిమ్ రైలు పార్క్ చేసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్టేషన్‌ని కిమ్ కుటుంబ సభ్యులకు మాత్రమే రిజర్వ్ చేసి ఉంచుతారు.

కిమ్ రైలు అక్కడ ఉన్నప్పటికీ దేశాధ్యక్షుడి ఆరోగ్యం గురించి, ఆయన జాడ గురించి అది సూచించకపోవచ్చు. కానీ దేశ తూర్పు తీరప్రాంతంలోని ఒక కీలకమైన ప్రాంతంలో కిమ్ ఉన్నట్లు ఖాయంగా తెలిసింది. 

ఇటీవలే  కిమ్‌కి శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ఆయన వ్యక్తిగత వైద్యుడి చేతులు వణికినట్లు కూడా సమాచారం బయటకొచ్చింది.

అయితే ఉత్తరకొరియా తలుపులు మూసుకున్న దేశం కాబట్టి అధికారికంగా ప్రకటించేంతవరకు దేశాధ్యక్షుడి క్షేమ సమాచారాలు కాని మరే విషయమైనా బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం చాలా చాలా తక్కువే అనేది వాస్తవం.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle