newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదు.. సంపూర్ణ లాక్‌డౌన్

27-07-202027-07-2020 10:30:53 IST
Updated On 27-07-2020 10:34:28 ISTUpdated On 27-07-20202020-07-27T05:00:53.268Z27-07-2020 2020-07-27T05:00:48.167Z - 2020-07-27T05:04:28.697Z - 27-07-2020

ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదు.. సంపూర్ణ లాక్‌డౌన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమ దేశంలో ఇంతవరకు ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదని ఇన్నాళ్లూ గర్వంగా చెప్పుకున్న ఉత్తర కొరియాలోకి కూడా కరోనా ప్రవేశించిందని సమాచారం. దీంతో కరోనా వైరస్‌ భయంతో ఉత్తర కొరియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ దేశంలో తొలి కరోనా కేసు నమోదైనట్టుగా ఆందోళన వ్యక్తమవుతోంది. దక్షిణ కొరియా నుంచి ఇటీవల కైసాంగ్‌ నగరానికి వచ్చిన ఒక వ్యక్తికి కోవిడ్‌ లక్షణాలు ఉన్నాయని ప్రభుత్వ న్యూస్‌ ఏజెన్సీ కేసీఎన్‌ఏ వెల్లడించింది.

మూడేళ్ల క్రితం దక్షిణ కొరియాకి పారిపోయి వెళ్లిన ఆ వ్యక్తి జూలై 19న అధికారుల కన్నుగప్పి సరిహద్దు నగరమైన కైసాంగ్‌లోకి ప్రవేశించినట్టు కేసీఎన్‌ఏ తెలిపింది. రక్త పరీక్షల్లో ఆ వ్యక్తికి వైరస్‌ సోకినట్టు తేలడంతో దేశ అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌  కైసాంగ్‌లో సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఆ రోగిని క్వారంటైన్‌లో ఉంచడమే కాదు, అతడిని కలుసుకున్న వారిని, అయిదు రోజులుగా కైసాంగ్‌ నగరానికి వెళ్లి వచ్చిన వారందరినీ ప్రభుత్వం క్వారంటైన్‌లో ఉంచింది.

కరోనా వైరస్‌ బట్టబయలైన తొలిరోజుల్లో ఉత్తర కొరియా కరోనా లక్షణాలున్న కొందరిని క్వారంటైన్‌లో ఉంచినట్టుగా వార్తలు వచ్చాయి కానీ ఇలా ఒక నగరాన్ని పూర్తిగా మూసేయడం ఇదే తొలిసారి. ఆరోగ్య రంగంలో దేశం పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో రెండు లక్షల జనాభా ఉన్న కైసాంగ్‌లో తొలి అనుమానాస్పద కేసు నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. అయితే చైనాతో విస్తృతమైన సరిహద్దుల్ని పంచుకున్న ఆ దేశంలో ఇంతవరకు కరోనా లేదంటే నమ్మశక్యం కావడం లేదని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ ఆ ఒక్క దేశంలో మాత్రం కనీసం అడుగుపెట్టలేకపోయింది. ఆ దేశ నియంత పేరు చెబితే శత్రువులు వణికిపోవాల్సిందే అని  అనుకునేవారంతా.. ఇప్పడు కరోనా కూడా భయపడిందేమో అంటున్నారు. సరిహద్దు దేశాల్లో కరోనా విజృంభిస్తున్నా ఇన్నాళ్లూ ఆ దేశంలో కనీసం ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఆదివారం రాత్రి  లక్షణాలున్న ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ దేశం అధికారికంగా ప్రకటించిన తొలి కేసు ఇదేకావడం గమనార్హం. 

మరోవైపు వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేసాంగ్ నగరంలో లాక్‌డౌన్ విధించారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వైరస్‌ లక్షణాలున్న ప్రతి ఒక్కరిని గుర్తించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వారితో మెలిగిన వారందరినీ కఠినమైన క్యారెంటైన్‌ నిబంధనలు వర్తించే విధంగా నిర్బంధించాలని పేర్కొన్నారు. 

దేశ వ్యాప్తంగా ఇప్పటికే 976 పరీక్షలు నిర్వహించామని వారిలో ఏ ఒక్కరినీ కరోనా పాజిటివ్‌గా తేలలేదని అధికారులు అధ్యక్షుడికి వివరించారు. కోవిడ్ 19 లక్షణాలు ఉన్న 25,551 మందిని క్వారైంటైన్ చేశామని.. అందులో 255 మంచి ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు వివరించామని పేర్కొన్నారు.

తొలి కేసు నమోదైన దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఉత్తర కొరియాకు ప్రమాదం పొంచిఉందని కిమ్‌ ఆదేశించారు. కాగా కేసాంగ్‌ నగరం దక్షిణ కొరియాకు సరిహద్దుల్లో ఉంటుంది. మొన్నటి వరకు కాస్తా ప్రశాంతంగా ఉన్న సౌత్‌ కొరియాలో కరోనా తిరగబెడుతోంది. గడిచిన పది రోజుల్లో 50-60 కేసులు కొత్తగా నమోదు అవుతున్నాయి. అక్కడి నుంచే వైరస్‌ వ్యాప్తి చెంది ఉంటుందని నార్త్‌ కొరియా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఆ దేశానికి సరిహద్దు గల చైనా లోనూ గతంలో వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో దేశ భవిష్యత్తు దృష్ట్యా చైనా సరిహద్దును ఇప్పట్లో తెరిచేది లేదని కిమ్‌ స్పష్టం చేశారు. కాగా గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్‌ నగరంలో కరోనా వైరస్‌ వెలుగు చూసిన నాటి నుంచి ఉత్తర కొరియా అన్ని సరిహద్దులను మూసివేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్యాంగ్‌యాంగ్‌కు రాకపోకలపై నిషేధం విధించామని కిమ్‌ తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 30 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి లేకపోతే ప్రభుత్వం కఠిన చర్యలు తిసుకుంటుదని హెచ్చరించారు.

ఉత్తర కొరియాలో కరోనా వైరస్ ఉనికి బయటపడటంతో విశ్వ మహమ్మారిగా కరోనా ప్రపంచమంతటా విస్తరించినట్లే లెక్క.

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   17 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle