newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

ఈ ట్వీట్ మర్మమేమి అజిత్ జీ

24-11-201924-11-2019 19:18:39 IST
Updated On 24-11-2019 19:18:29 ISTUpdated On 24-11-20192019-11-24T13:48:39.358Z24-11-2019 2019-11-24T13:47:23.625Z - 2019-11-24T13:48:29.091Z - 24-11-2019

ఈ ట్వీట్ మర్మమేమి అజిత్ జీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తన బాబాయికి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయిపోయారు. కానీ ఆయన మాటల్లో (ట్వీట్లు) మర్మమేంటో అర్థంకాక కాకలు తీరిన రాజకీయనేతలు సైతం తలలు పట్టుకుంటున్నారు.

రాత్రికి రాత్రి మహా రాజకీయాలను మలుపు తిప్పిన అజిత్ పవార్ తాజాగా చేసిన ట్వీట్ అందరినీ ఆలోచనలో పడేసింది. పార్టీ ప్రతిష్టను మంటగలిపిన అజిత్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఓవైపు ఎన్సీపీ నేతలు మండిపడుతున్నారు. 

ఈ కీలక పరిణామాల నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఆయన తనను మహారాష్ట్ర డిప్యూటీ సిఎం అని పేర్కొన్నారు. అలాగే 'అంతా సవ్యంగానే సాగుతోంది. ఎవరూ ఆందోళ చెందాల్సిన పనిలేదు. కావాల్సిందల్లా కొంచెం ఓపిక పట్టండి అంతే' అంటూ ట్వీట్ చేశారు.

ఇదంతా ఒక ఎత్తయితే తానింకా ఎన్సీపీలోనే ఉన్నానని.. ఇకముందు కూడా అదే పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు కొసమెరుపు ఏంటంటే.. తమ నేత శరద్ పవారే అని వ్యాఖ్యానించడంపై ట్విట్టర్లో జోకులు పేలుతున్నాయి.

అంతేకాదు, మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ సర్కార్ సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తుందంటూ డిప్యూటీ సీఎం ట్యాగ్ తో ట్వీట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన ట్విట్టర్ ఖాతాలో కవర్ పేజీని సైతం మార్చేశారు. మహారాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోని తన కవర్ పేజీగా పెట్టుకోవడం విశేషం. ఇవన్నీ చూశాక రాజకీయనేతలు అర్థం చేసుకోవడం ఎవరి తరం అనిపించడం ఖాయం. 

Image

అజిత్ ట్వీట్ పై శరద్ పవార్ మండిపడ్డారు. అజిత్‌పవార్ వ్యాఖ్యలకు శరద్‌పవార్ కౌంటర్ ఇచ్చారు. అజిత్ పవార్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని. .బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు  శరద్‌పవార్. మహారాష్ట్రలో గందరగోళ రాజకీయాలకు ఈ తాజా వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. 

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   2 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   5 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle