newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు.. కర్ఫ్యూ... 13కు చేరిన మృతులు

26-02-202026-02-2020 07:55:35 IST
Updated On 26-02-2020 07:56:08 ISTUpdated On 26-02-20202020-02-26T02:25:35.737Z26-02-2020 2020-02-26T02:25:31.306Z - 2020-02-26T02:26:08.694Z - 26-02-2020

ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు.. కర్ఫ్యూ... 13కు చేరిన మృతులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పౌరసత్వ సవరణ చట్టం రచ్చ కొనసాగుతూనే వుంది. ఈశాన్య ఢిల్లీలో అల్లర్లలో 13 మంది మరణించారు. అల్లర్ల నేపథ్యంలో కర్ఫ్యూ విధించారు. ఈశాన్య ఢిల్లీలో కనిపిస్తే కాల్చివేసే ఉత్తర్వులు జారీ చేశారు. రంగంలోకి  దిగిన పారామిలటరీ బలగాలు, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈశాన్య ఢిల్లీలోని నాలుగు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. ట్రంప్‌ పర్యటిస్తుండగానే... అక్కడకు కాస్తంత దూరంలో హింస పెచ్చరిల్లింది. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) మద్దతిస్తున్న వారు... వ్యతిరేకిస్తున్న వారు... రెండు వర్గాలూ పెట్రేగిపోయాయి. దీంతో  2 రోజుల్లో ఏకంగా 13 మంది బలైపోయారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో సోమవారం మొదలైన ఘర్షణలు... మంగళవారం మరింత తీవ్రంగా మారాయి. 

ఈశాన్య ఢిల్లీలో ఆందోళనలను అదుపులోకి తెచ్చేందుకే కర్ఫ్యూ విధించామని పోలీసులు చెబుతున్నారు. చాంద్ బాగ్ లో పరిస్థితులు అదుపుతప్పాయి. సిఏఏ వ్యతిరేక ఆందోళనకారులకు, పోలీసులకు ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అక్కడి షాపులకు, బైకులకు నిప్పుపెట్టారు ఆందోళనకారులు. ఇదిలా ఉంటే ఢిల్లీలో అల్లర్ల పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే ఢిల్లీ అల్లర్లపై కేంద్రం సీరియస్ అయింది. భారత్ పరువు తీసేందుకు అల్లర్లు.  ఒక చేత్తో జెండా పట్టుకొని మరో చేత్తో రాళ్ళూ రువ్వుతున్నారని, హింసపై రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలని హోంశాఖ సహాయమంత్రి  కిషన్ రెడ్డి అన్నారు. 

ఈ ఘర్షణల్లో సోమవారం 5 మంది, మంగళవారం మరో 8 మంది బలైపోయారు. మరో 200 మంది వరకూ గాయపడగా... వారిలో 48 మంది పోలీసులు వున్నారు. వారికి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని గోకుల్‌పురిలోఅల్లరిమూకలు రెండు అగ్నిమాపక వాహనాల్ని ధ్వంసం చేశారు. దుండగులు ఏవి  కనిపించినా వాటిపై పెట్రోల్‌ పోసి నిప్పుపెడుతూ రెచ్చిపోయారు. ఫలితం ధ్వంసమైన వాహనాల భాగాలు, కాలిపోయిన టైర్లు, రాళ్లు ఇటుకలతో అక్కడి రోడ్లన్నీ నిండిపోయాయి. రాళ్లు, రాడ్లు, ఆఖరికి కత్తులు కూడా పట్టుకుని ఆందోళనకారులు రెచ్చిపోవటంతో.. వారిని చెదరగొట్టడానికి భాష్పవాయువు ప్రయోగించారు. అల్లర్ల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలోని వివిధ పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించారు. 

ఢిల్లీలో హింస నేపథ్యంలో కేంద్రం ముందు జాగ్రత్తలు తీసుకుంది. అన్ని కేబుల్, శాటిలైట్ టీవీ ఛానళ్లకు కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. టీవీ ఛానెల్స్‌‌కు సమాచార మంత్రిత్వ శాఖ కీలక సూచనలు  చేసింది. మంగళవారం రాత్రి ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ యాక్ట్ కింద ప్రైవేట్ శాటిలైట్ టీవీ చానెల్స్‌కు ఈ సూచనలు చేసింది. 

కీలక సూచనలు

* దేశ వ్యతిరేక కార్యకలపాలను ప్రోత్సహించేలా ప్రోగ్రామ్స్ ఉండకూడదు. అందుకు సంబంధించిన ఎలాంటి వీడియోలను ప్రసారం చేయకూడదు. 

* ఏదైనా మతాన్ని కానీ, కులాన్నీ కానీ కించపర్చేలా ఉన్న వీడియోలు గానీ.. పదాలను గానీ టీవీ చర్చా కార్యక్రమాల్లో ప్లే చేయకూడదు. వాటిని పదే పదే వాడకూడదు.

* వ్యక్తుల ప్రాథమిక హక్కులకు.. ఆయా వ్యక్తుల గౌరవానికి భంగం వాటిల్లేలా కార్యక్రమాలు ఉండకూడదు 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle