newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ఈశాన్యంలో ఎన్ఐఏ సోదాలు... ఆర్టీఐ కార్యకర్త అరెస్ట్

27-12-201927-12-2019 09:49:28 IST
2019-12-27T04:19:28.355Z27-12-2019 2019-12-27T04:19:23.546Z - - 03-08-2020

ఈశాన్యంలో ఎన్ఐఏ సోదాలు... ఆర్టీఐ కార్యకర్త అరెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అసోంలో నిర్వహించిన సోదాలు కలకలం రేపుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం సమాచార హక్కు కార్యకర్త అఖిల్‌ గొగోయ్‌ ఇంట్లో ఎన్‌ఐఏ  సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల సందర్భంగా పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. గొగోయ్ ఇంట్లో ల్యాప్‌టాప్‌తో పాటు వివిధ కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు.

డిసెంబర్‌ 12న ఎన్‌ఐఏ అఖిల్ గోగోయ్ ని అదుపులోకి తీసుకుని విచారించింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో నిరసనల నేపథ్యంలో అనేక రైతు సంఘాలకు సలహాదారుగా ఉన్న గొగోయ్‌ను ప్రభుత్వం అరెస్టు చేయడంపై నిరసన వ్యక్తం అవుతోంది.

గువాహటిలోని నిజరపరా ప్రాంతంలోని గొగోయ్‌ నివాసంలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేశారని తెలుస్తోంది. చాలాసేపు ఈ తనిఖీలు జరిగాయి.  గొగోయ్ గుర్తింపుకార్డులతో పాటు పలు పత్రాలను మీడియాకు చూపించారు ఆయన భార్య గీతాశ్రీ తములీ. గురువారం  ఉదయం 7 గంటలకు ప్రారంభమైన తనిఖీలు మూడు గంటలపాటు జరిగాయి. 

కజిరంగలోని కేఎంఎస్‌ఎస్‌ ఆర్చిడ్‌ ఎన్విరాన్‌మెంట్‌ పార్కుకు సంబంధించిన పత్రాలను కూడా ఎన్‌ఐఏ బృందం కోరింది. అయితే అలాంటి సమాచారం తమవద్ద లేదని గీతాశ్రీ తములీ పేర్కొన్నారు. అఖిల్ గోగోయ్‌ని న్యాయస్థానం ముందు హాజరుపరిచింది ఎన్ ఐఏ. అఖిల్ గొగోయ్‌ను 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తూ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం ఆదేశించింది. అఖిల్ గోగోయ్ ఇంట్లో సోదాలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. 

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle