newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

ఈయన మోదీకి 'షా'డో నా-2

12-06-201912-06-2019 07:49:36 IST
Updated On 12-06-2019 07:56:18 ISTUpdated On 12-06-20192019-06-12T02:19:36.040Z12-06-2019 2019-06-12T02:19:28.226Z - 2019-06-12T02:26:18.616Z - 12-06-2019

ఈయన మోదీకి 'షా'డో నా-2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
(మొదటి భాగం తరువాయి)

మోడీకి అమిత్ షా అంటే ఎంతో నమ్మకం, విశ్వాసం. అఖండ భారతావనిలో కమల వికాసం సాధ్యం కావాలంటే అమిత్ షా వంటి వ్యక్తి అవసరమని మోడీ భావించారు. 2014 నుంచి 2019 వరకూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆయన బీజేపీ జెండా పాతేశారు. రెండవసారి మోడీ ప్రధాని కావడం కష్టమని మీడియా మొత్తం ఘోషించినా అమిత్ షా మాత్రం మోడీపై నమ్మకంతో వ్యవహరించారు. 

బీజేపీకి సంపూర్ణ మెజారిటీ కోసం అమిత్ షా ప్రయత్నించారు. అంతా చక్కబెట్టేశాక మోడీ కేబినెట్లో చేరారు. పార్టీ సారథ్యం నుంచి పాలన వ్యవహారాల్లోకి అడుగుపెట్టారు. కేబినెట్‌లో నెంబర్‌ టూ అయ్యారు. మోడీకి సరైన జోడీ అమిత్ షా అంటారు బీజేపీ నేతలు. నిన్నమొన్నటివరకూ పార్టీకీ-ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు కీలకమయిన హోంశాఖ బాధ్యతలు చేపట్టి పాలనా వ్యవహారాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. 

Image result for home minister amit shah

అమిత్ షా ఎలాంటి ప్రాధాన్యత సాధించారంటే ... ఒకటి కాదు ఏకంగా 8 కేబినెట్ కమిటీలలో అమిత్ షా సభ్యుడుగా ఉన్నారు0. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు 7, రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు 5 కమిటీల్లో సభ్యులుగా నియమించారు. కీలకమయిన అన్ని శాఖల్లో మోడీ తర్వాత అమిత్ షానే నియమించడం వెనుక మోడీ వ్యూహం మనం అర్థం చేసుకోవచ్చు. దేశానికి సంబంధించిన ఆయా కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే ముఖ్యకమిటీలన్నింట ఆయనకు పెద్దపీట వేశారు. నీతి ఆయోగ్‌లోనూ ఆయన్ను ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా నియమించారు. 

ఆర్థిక వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు, భద్రతా వ్యవహారాలు, పెట్టుబడులు, వృద్ధి ఉపాధి నైపుణ్యాభివృద్ధి, నియామకాల కమిటీ, వసతి సౌకర్యాల కేబినెట్‌ కమిటీ.. మొత్తం 8 కమిటీలను కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. ప్రతి కమిటీలో అమిత్‌ షా సభ్యుడిగా ఉన్నారు. ప్రధాని సభ్యుడిగా లేని రెండు కమిటీల్లోనూ అమిత్‌ షా సభ్యుడిగా నియమితులయ్యారు.

అంతేకాదు,  కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌ పేయి నివసించిన ఇంటిని కేటాయించారు. అమిత్ షా ఇంటి భద్రత కోసం ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఆయన నివాసం వద్ద ఢిల్లీ పోలీసులు అదనంగా మోహరించారు. ఆయనకు ఇప్పటికే ‘జడ్‌ ప్లస్‌’ భద్రత ఉంది. కేంద్ర పారామిలటరీ బలగాలు ఆయన రక్షణ బాధ్యతలను చూస్తున్నాయి.

Image result for home minister amit shah security

ఇప్పుడు జాతీయ భద్రతా దళానికి చెందిన బ్లాక్‌ క్యాట్‌ కమాండో రక్షణ కల్పించారు. దీని ప్రకారం 50 మంది కమాండోలు అమిత్ షా రక్షణలో ఉంటారు. వీరిలో SWAT (Special Weapons and Tactics) టీం ఉంటుంది. వీరి దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. నిరంతరం అమిత్ షా భద్రతను పర్యవేక్షిస్తారు. అమిత్ షా ఎక్కడికి వెళ్లినా ఆయన వెన్నంటే ఉంటారు కమాండోలు. 

సాధారణంగా ప్రధాని మోడీకి అన్ని శాఖలపై నియంత్రణ ఉంటుంది. కానీ అమిత్ షా మాత్రం వివిధ శాఖలతో సమావేశం నిర్వహించడం చర్చనీయాంశం అవుతోంది. అమిత్ షా దూకుడు గమనించిన కొందరు ఢిల్లీ రాజకీయనేతలు అమిత్ షాని షాడో మోడీ అంటున్నారు. గతంలో ఏ హోంమంత్రి ఇంత యాక్టివ్ గా లేడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Image result for amith shah shadow of modi

గతంలో అద్వానీ లాంటి వ్యక్తులు హోంమంత్రులుగా వ్యవహరించినా ఇతర శాఖలపై అంతగా తమ ఫోకస్ పెట్టలేదు. తర్వాత రాజ్ నాథ్ సింగ్ కూడా హోంమంత్రిగా వున్నారు. ఆయన కూడా సేమ్ టు సేమ్. తన శాఖ వరకూ వివిధ నిర్ణయాలు తీసుకునేవారు రాజ్ నాథ్ సింగ్. కానీ అమిత్ షా తనదైన ముద్రవేయడానికి ప్రయత్నిస్తున్నారు. మోడీ నీడలా అమిత్ షా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. 

మొత్తం మీద మోడీ తర్వాత ఎవరనే ప్రశ్నకు అమిత్ షా సమాధానంగా నిలుస్తున్నారు. అందుకే రాజకీయ విశ్లేషకులు కూడా బీజేపీలో నెంబర్ టు అమిత్ షా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో కునారిల్లుతుంటే బీజేపీ మాత్రం సమర్ధులైన నేతలతో ముందుకు సాగుతోంది. 

Image result for home minister amit shah

ఈయన మోదీకి 'షా'డో నా -1

కరోనా వైరస్ చికిత్స-- ఐసీయంఆర్ కొత్త మార్గదర్శకాలు

కరోనా వైరస్ చికిత్స-- ఐసీయంఆర్ కొత్త మార్గదర్శకాలు

   20 hours ago


నేనొచ్చేంతవరకు అమెరికాను దోచేసింది.. చైనాపై ట్రంప్ ఆరోపణ

నేనొచ్చేంతవరకు అమెరికాను దోచేసింది.. చైనాపై ట్రంప్ ఆరోపణ

   23-05-2020


ఈ ప్యాకేజీ దేశప్రజలపై ఒక క్రూరమైన జోక్‌.. సోనియాగాంధీ ధ్వజం

ఈ ప్యాకేజీ దేశప్రజలపై ఒక క్రూరమైన జోక్‌.. సోనియాగాంధీ ధ్వజం

   23-05-2020


పశ్చిమ బెంగాల్‌ను ఊడ్చేసిన ఎంఫాన్  తుపాను.. అండగా ఉంటామన్న మోదీ

పశ్చిమ బెంగాల్‌ను ఊడ్చేసిన ఎంఫాన్ తుపాను.. అండగా ఉంటామన్న మోదీ

   22-05-2020


మరో మూడు నెలలు మారిటోరియం... జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు

మరో మూడు నెలలు మారిటోరియం... జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు

   22-05-2020


కరోనా మృత్యుఘోషలో భారత్.. ఒక్కరోజులో 132 మంది మృతి.. 5,609 పాజిటివ్ కేసులు

కరోనా మృత్యుఘోషలో భారత్.. ఒక్కరోజులో 132 మంది మృతి.. 5,609 పాజిటివ్ కేసులు

   22-05-2020


అమెరికా స్టాక్ ఎక్చేంజిల నుంచి చైనా అవుట్.. చైనా కంపెనీలపై సెనేట్ కొరడా

అమెరికా స్టాక్ ఎక్చేంజిల నుంచి చైనా అవుట్.. చైనా కంపెనీలపై సెనేట్ కొరడా

   22-05-2020


ఎంఫాన్ తుపానుకి 84 మంది బలి.. వణికిపోయిన బెంగాల్

ఎంఫాన్ తుపానుకి 84 మంది బలి.. వణికిపోయిన బెంగాల్

   21-05-2020


టిక్ టాక్‌ను కేంద్రం బ్యాన్ చేస్తుందా..? టిక్ టాక్‌పై ఏంటీ ర‌గ‌డ..?

టిక్ టాక్‌ను కేంద్రం బ్యాన్ చేస్తుందా..? టిక్ టాక్‌పై ఏంటీ ర‌గ‌డ..?

   21-05-2020


నేను  హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడుతునే ఉన్నా.. ట్రంప్ నో సైడ్ ఎఫెక్ట్స్

నేను హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడుతునే ఉన్నా.. ట్రంప్ నో సైడ్ ఎఫెక్ట్స్

   21-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle