newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

ఈయన మోదీకి 'షా'డో నా -1

12-06-201912-06-2019 07:42:33 IST
Updated On 12-06-2019 07:55:03 ISTUpdated On 12-06-20192019-06-12T02:12:33.951Z12-06-2019 2019-06-12T02:11:26.039Z - 2019-06-12T02:25:03.866Z - 12-06-2019

ఈయన మోదీకి 'షా'డో నా -1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2019 ఎన్నికల ముందు వరకూ అమిత్ షా అంటే కేవలం బీజేపీ బాస్ అనే పేరుండేది. కానీ రెండవసారి మోడీ ప్రధాని అయ్యాక అమిత్ షా ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. అందునా కాంగ్రెస్, ఇతర విపక్షాల కంచుకోటల్లోనూ కాషాయ జెండా ఎగరేయడంతో అమిత్ షా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అమిత్ షా అంటే మోడీ షాడోలా తయారయ్యారని ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన వేరుగా ఉండేది. ఇప్పుడు హోంమంత్రి అయ్యాక ఆయన తన దర్పం, అధికారం బాగా వినియోగిస్తున్నారు. ప్రధాని మోడీ స్థాయిలో చేసే పనులను కూడా అమిత్ షా చక్కబెట్టేస్తున్నారు. 

Image result for amith shah shadow of modi

గుజరాత్‌లో నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో హోంమంత్రిగా పని చేసిన అమిత్ షా .. ఇప్పుడు కేంద్రంలో. మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు.. అదే హోంశాఖను చేపట్టారు. అప్పటినుంచీ మోడీకి అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరిస్తున్నారు. అంచెలంచెలుగా బీజేపీలో ఎదుగుతూ ఇప్పుడు పార్టీలోనే నెంబర్ టూ స్థానానికి చేరుకున్నారు. 

బీజేపీని ఇప్పటి వరకు కనుసైగలతో నడిపిన అమిత్ షా.. ఇప్పుడు ప్రభుత్వంలోనూ పవర్ సెంటర్ అయిపోయారు. బీజేపీ నిర్మాతల్లో ఒకరైన లాల్‌ కృష్ణ అద్వానీని వయసు కారణాలపై పోటీ నుంచి తప్పించినపుడు ఆయన సొంత నియోజకవర్గం గాంధీనగర్‌ నుంచి ఎవరు పోటీచేస్తారని మీడియాలో ఊహాగానాలు సాగాయి. ఒకప్పుడు అద్వానీకి పోల్‌ మేనేజర్‌గా పనిచేసిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగుతారని ఎవరూ ఊహించలేదు.

రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అమిత్ షాను ప్రత్యక్ష ఎన్నికల రంగంలోకి దింపినపుడే మోడీ తదుపరి కేబినెట్లో బెర్తు ఖాయమని తేలిపోయింది. ఊహించినట్లే అమిత్ షా అఖండ మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించారు. అమిత్ షా ఏం చేసినా మోడీకి చెప్పి చేస్తారని అంటారు. మోడీ కంటే ఇంచుమించు అంతే. అందుకే ఇద్దరి మనస్తత్వాలు కలిసిపోయాయి.

మొదటిసారి అమిత్ షా మోదీని 1982లో కలిశారు. అమిత్ షా 1991 ఎన్నికల్లో అద్వానీకి ప్రచార నిర్వహణాధికారిగా పనిచేశారు.1990లో మోదీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1997లో షా తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత మరో మూడు సార్లు గెలిచారు. 2001లో మోదీని ముఖ్యమంత్రి చేశాక అమిత్ షా దశ తిరిగిపోయింది. మోదీ మంత్రివర్గంలో హోంశాఖతో పాటు 12శాఖలు నిర్వహించారు. మోదీ ప్రధాని అయ్యాక అమిత్‌ షా కేంద్ర రాజకీయాల్లో కీలకమయ్యారు. తొలిసారి కేబినెట్లో చేరకుండా  బీజేపీ అధ్యక్షుడయ్యారు. 2014లోనే మోడీ కేబినెట్లో చేరే అవకాశం వచ్చినా వద్దని అమిత్ షా సున్నితంగా తిరస్కరించారని చెబుతారు.  (ఇంకా ఉంది)

ఈయన మోదీకి 'షా'డో నా-2


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle