newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

ఈనెల 8న బ్యాంకు ఉద్యోగుల సమ్మె భేరి

05-01-202005-01-2020 10:28:51 IST
2020-01-05T04:58:51.349Z05-01-2020 2020-01-05T04:58:37.310Z - - 05-08-2020

ఈనెల 8న బ్యాంకు ఉద్యోగుల సమ్మె భేరి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాలను, బ్యాంకింగ్ సంస్కరణలను బ్యాంకు యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వహిస్తున్న విధి విధానాలకు వ్యతిరేకంగా బ్యాంక్‌‌లు ఈనెల8న బంద్ నిర్వహిస్తున్నాయి. ఈ సమ్మె ప్రభావం దేశవ్యాప్తంగా బ్యాంకులపై పడనున్నాయి. ఏటీఎంలు కూడా బంద్ చేయనున్నారు. 

కేంద్ర ట్రేడ్ యూనియన్లు చేపడుతోన్న ఆల్‌‌ ఇండియా సమ్మెలో పాల్గొనాలని బ్యాంక్ యూనియన్లు కూడా నిర్ణయించాయి. ఈ నెల 8న  విధులకు రావొద్దని బ్యాంక్‌‌ యూనియన్లు ఉద్యోగులకు సూచించాయి. 

ఎవరైనా బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకోవాలన్నా, డబ్బు డ్రా చేసుకోవాలన్నా ఎవరైనా మంగళవారం రోజువరకే వారి పనులను పూర్తి చేసుకోవాలని బ్యాంకింగ్ వర్గాలు తెలుపుతున్నాయి. 8వ తేదీన న బ్యాంకుల్లోని అన్ని బ్రాంచ్‌‌ల్లో జరిగే సాధారణ బ్యాంకింగ్ సేవలన్నీ నిలిచిపోనున్నాయి.

ఆన్‌లైన్‌ ‌బ్యాంకింగ్ సేవలు మాత్రం ఈ సమ్మెకు ప్రభావితం కావు. ఈ సమ్మె ప్రభావం ఏటీఎం సేవలపై కూడా చూపనున్నట్టు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. బంద్ రోజు ఎలాంటి క్లరికల్ వర్క్‌‌ను చేపట్టవద్దని తమ సభ్యులను ఆదేశించినట్టు ఆల్‌‌ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్ జనరల్ సెక్రటరీ సౌమ్య దత్తా వెల్లడించారు.

ఈ సమ్మెకు అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఈఎఫ్‌ఐ) వంటి ఉద్యోగ సంఘాలు మద్దతు పలికాయి. ఈ సమ్మెకు 10 సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్లు మద్దతునిస్తున్నట్లు ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం తెలిపారు.

ఉద్యోగ భద్రత, ఉపాధి కల్పనలకు పెద్దపీట వేయాలని, కార్మిక చట్టాల్లో సవరణలు, బ్యాంకుల విలీనాలను ఆపాలని కోరుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకు యాజమాన్యాలు మాత్రం వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాయి. 

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   2 hours ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   8 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   9 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   9 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   04-08-2020


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle