newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

17-01-202017-01-2020 09:23:04 IST
2020-01-17T03:53:04.322Z17-01-2020 2020-01-17T03:52:53.383Z - - 12-08-2020

ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇస్రో తన సత్తా చాటుతూనే వుంది. 2020 సంవత్సరంలో బోణీ కొట్టేసింది మన అంతరిక్ష పరిశోధనా సంస్థ. తాజాగా ఇస్రో ప్రయోగించిన జీశాట్-30 ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు.  ఏ ఉపగ్రహన్నయినా నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించడం ఇస్రో అలవాటు.

ఈ సారి జీశాట్-30 ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి ప్రయోగించలేదు. వేదిక మార్చింది. ప్రెంచ్‌ గయానా లోని కౌరు అంతరిక్ష ప్రయోగశాల నుంచి ప్రయోగించిన జీశాట్‌ – 30 విజయవంతంగా  నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఇవాళ తెల్లవారుజామున 2.35 గంటలకు కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ వాహకనౌక ద్వారా జీశాట్-30 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.

ఈ శాటిలైట్ ద్వారా మనదేశంలోని ఇంటర్నెట్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. నాణ్యమైన టెలివిజన్‌ ప్రసారాలు, టెలీకమ్యూనికేషన్‌, బ్రాడ్‌ క్రాస్టింగ్‌ సేవలు అందుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఇన్‌శాట్- 4ఏ స్థానంలో మరింత మెరుగ్గా సేవలందించేందుకు జీశాట్-30 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. గత ఏడాది చంద్రయాన్ 2లో ప్రయోగంలో చివరి క్షణాల్లో విఫలం కావడంతో శాస్త్రవేత్తల్లో కొంత నిరుత్సాహం  ఏర్పడింది.

కానీ  ఆ తర్వాత చేసిన ప్రయోగాల్లోనూ విజయం సాధించడంలో రెట్టించిన ఉత్సాహం ఏర్పడింది.  ఈ ఏడాది అంతరిక్ష ప్రయోగాలకు జీశాట్‌-30 నాంది పలికింది. ఈ ఉపగ్రహం బరువు 3,357 కిలోలు. ఇది జియో స్టేషనరీ ఆర్బిట్ నుంచి సీ, కేయూ బ్యాండ్లలో కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది. ఫ్రెంచ్ టెలికం సంస్థ యుటెల్‌శాట్ ‌తో కలిసి ఈ ప్రాజెక్టును రూపొందించింది ఇస్రో.

ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్ కే శివన్, ఫ్రెంచ్ గుయానా స్పేస్ స్టేషన్ సీఈఓ స్టెఫానె ఇజ్రాయెల్ ప్రకటించాయి. ఈ ప్రయోగం ద్వారా మరో 15 సంవత్సరాల పాటు టెలికమ్యూనికేషన్ల వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు. ఇప్పటివరకూ సేవలందించిన ఇన్ శాట్ 4ఏకి విశ్రాంతి లభిస్తుంది. అత్యాధునిక ట్రాన్స్‌పాండర్లను అమర్చడం వల్ల మనదేశంతో పాటు గల్ఫ్, ఆస్ట్రేలియా, పలు ఆసియా దేశాలపైనా దీని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   4 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle