newssting
BITING NEWS :
* శనివారం మధ్యాహ్నమే కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్ని రేపటికి ప్రీ పోన్ చేసిన ఏపీ సర్కార్ *కాకినాడలో దారుణం..రేచర్లపేటలో నాలుగేళ్ల చిన్నారి మీద అత్యాచారం..చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు మైనర్లు *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం*ఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్*ఆస్తుల కేసులో హాజరుకాలేనని సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్ పిటిషన్... విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. ఈ రోజు హాజరుపై సీఎం జగన్‌కు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు*అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *అమరావతిలో 31వ రోజుకు చేరిన ఆందోళన.. లోకేష్ బైక్ ర్యాలీ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు * టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

ఇవాళ భారత్ బంద్...మోడీ విధానాలపై వామపక్షాల నిరసన

08-01-202008-01-2020 09:09:41 IST
Updated On 08-01-2020 12:09:49 ISTUpdated On 08-01-20202020-01-08T03:39:41.364Z08-01-2020 2020-01-08T03:39:34.240Z - 2020-01-08T06:39:49.019Z - 08-01-2020

ఇవాళ భారత్ బంద్...మోడీ విధానాలపై వామపక్షాల నిరసన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత ప్రభుత్వ ఆర్థిక విధానాలు, మండిపోతున్న నిత్యావసరాల ధరలు, పడిపోయిన వేతనాలు, ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ...  నేడు జాతీయ ట్రేడ్‌ యూనియన్ల ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా  సమ్మెకు దిగాయి. సమ్మెలో బ్యాంక్‌ యూనియన్లు కూడా ఉండటంతో .. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ సేవలు నిలిచిపోతున్నాయి. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ.. ఈనెల 3నుంచే నిరసన కార్యక్రమాలు చేపట్టాయి కార్మిక సంఘాలు. 

జాతీయట్రేడ్ యూనియన్ పిలుపుతో దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతోంది. అంగన్‌వాడీలు, బీఎస్‌ఎన్‌ఎల్‌లు ఉద్యోగులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్‌పీసీఎల్‌, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాలకు చెందిన కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు.

కేంద్రం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్స్‌గా మారుస్తుండటంతో  సుమారు 6 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ... కార్మిక సంఘాలు సమ్మె నోటీసు అందించాయి. బ్యాంకు ఉద్యోగులు తమ వేతనాల సవరణ, డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచాలని, ఎన్‌పీఏల రికవరీ, కఠిన చట్టాలు తేవాలని పలు డిమాండ్లు తెరమీదకు తెచ్చాయి. 

బ్యాంకింగ్‌ రంగంలో.. 5 బ్యాంకింగ్‌ యూనియన్లు, కోఆపరేటివ్‌, గ్రామీణ బ్యాంకులతోపాటు.. జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఉద్యోగులు సైతం సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మె ప్రభావం ఖాతాదారులమీద పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి వివిధ బ్యాంకులు డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ యథావిధిగా నడుస్తాయని... ఏటీఎంల్లో సరిపడా క్యాష్‌ ఉంచామంటున్నారు బ్యాంక్‌ అధికారులు.

సమ్మె సందర్భంగా విజయవాడ పండిట్ నెహ్రు బస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆందోళనకి దిగిన వామపక్ష పార్టీలు నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. వామపక్ష, మైనారిటీ సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. 

పోలీసుల అక్రమ అరెస్టులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లులను రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధాన వల్లే ఈరోజు భారత్ బంద్ చేపట్టామన్నారు రామకృష్ఱ. ఈ బంద్ కు బెజవాడలోని వర్తక, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా  మద్దతు పలుకుతున్నాయి. 

నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

   6 hours ago


ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

   11 hours ago


కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

   12 hours ago


గాంధీకి బదులు లక్ష్మీదేవి.. స్వామి సలహాను మోడీ పాటిస్తారా?

గాంధీకి బదులు లక్ష్మీదేవి.. స్వామి సలహాను మోడీ పాటిస్తారా?

   16-01-2020


డాక్టర్లకు యువతుల ఎర.. మోడీ ఆగ్రహం!

డాక్టర్లకు యువతుల ఎర.. మోడీ ఆగ్రహం!

   15-01-2020


బ్రేకింగ్: నిర్భయ కేసులో కీలక మలుపు.. నలుగురి ఉరికి లైన్ క్లియర్

బ్రేకింగ్: నిర్భయ కేసులో కీలక మలుపు.. నలుగురి ఉరికి లైన్ క్లియర్

   14-01-2020


సీఏఏ‌పై సత్య నాదెళ్ళ.. చట్టం బాధాకరం అంటూ కామెంట్స్

సీఏఏ‌పై సత్య నాదెళ్ళ.. చట్టం బాధాకరం అంటూ కామెంట్స్

   14-01-2020


ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

   14-01-2020


భారత వృద్ధిరేటు 5 శాతమేనా.. నివ్వెరపరుస్తున్న నిప్పులాంటి నిజాలు

భారత వృద్ధిరేటు 5 శాతమేనా.. నివ్వెరపరుస్తున్న నిప్పులాంటి నిజాలు

   13-01-2020


యువత ఉసురు తీస్తున్న నిరుద్యోగం, ఆర్థికమాంద్యమే కారణమా?

యువత ఉసురు తీస్తున్న నిరుద్యోగం, ఆర్థికమాంద్యమే కారణమా?

   13-01-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle