newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

ఇరాన్ ఎఫెక్ట్ : చిక్కిపోతున్న రూపాయి@72

09-01-202009-01-2020 08:57:54 IST
Updated On 09-01-2020 09:32:20 ISTUpdated On 09-01-20202020-01-09T03:27:54.594Z09-01-2020 2020-01-09T03:19:06.871Z - 2020-01-09T04:02:20.838Z - 09-01-2020

ఇరాన్ ఎఫెక్ట్ : చిక్కిపోతున్న రూపాయి@72
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మన రూపాయి మరింత చిక్కిపోతోంది. అమెరికా-ఇరాన్‌ టెన్షన్స్‌ నేపథ్యంలో చమురు ధరలు భగ్గుమన్నాయి.  ఇరాక్‌లోని అమెరికి సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడి అనంతరం  అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర ఒకదశలో 70డాలర్లకు చేరింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలకు త్వరలో రెక్కలు రానున్నాయి. ఇప్పటికే పెట్రోల్ రేటు లీటరుకి 80 రూపాయలు దాటింది. డీజిల్ దరిదాపుల్లో వుంది. సాధారణంగా చమురు ధరల ఎఫెక్ట్ మన దేశ ఆర్థికరంగంపై తీవ్రంగా ఉంటుంది. 

రూపాయి పతనంతో దేశీయ మార్కెట్లో మొబైల్స్‌తో సహా అనేక దిగుమతి వస్తువుల ధరలు మరింత పెరుగుతాయి. రూపాయి సెగతో గృహోపకరణాలు, కొన్ని ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలు పెరుగుతాయి. 

దిగుమతి వస్తువులు ఎక్కువగా ఉండే మిగతా రంగాల కంపెనీలూ ఇదే బాట పట్టే అవకాశం ఉంది.ఇలా రూపాయి మారకం విలువ 7 రూపాయలకు చేరడం కొత్తేం కాదు. 2018 సెప్టెంబరులో రూపాయి మారకం విలువ 72.50ని తాకింది. 2019 నవంబరులోనూ  72.09 వద్దకు చేరుకుంది. మరోవైపు రూపాయి ట్రేడింగ్‌ సేవలు ఇకపై 24 గంటలూ అందుబాటులో ఉండేలా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలు జారీచేసింది.

ఇందులో భాగంగా రోజంతా దేశీ కరెన్సీ ట్రేడింగ్‌ సేవలు అందించడానికి దేశీ బ్యాంకులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూపాయి ట్రేడింగ్‌ పరిమాణం భారత్‌లో కన్నా విదేశాల్లో గణనీయంగా జరుగుతుండడంతో రిజర్వుబ్యాంకు ఈ చర్యలు తీసుకుంది. దేశీయంగా రూపాయి బలహీనపడడంతో ఐటీ షేర్లు లాభపడుతున్నాయి.

విదేశాలనుంచి మనదేశానికి డాలర్ల వరద కొనసాగే అవకాశాలున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు పెంచుకునేందుకు ఆర్ బీఐ చర్యలు చేపట్టింది. దీంతో చమురు ధరల పెరిగినా దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. 

ఆర్‌బీఐ వద్ద వున్న విదేశీ మారకద్రవ్య నిల్వలు పది నెలల దిగుమతుల అవసరాలను తీర్చగలవు. తాజా అంతర్జాతీయ అనిశ్చితిలో రూపాయి విలువను కాపాడేందుకు ఈ నిల్వలు ఆర్‌బీఐకి ఆయుధంగా పనిచేస్తాయనేది నిపుణులంటున్నారు. 

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   2 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   19 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   20 hours ago


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

   09-08-2020


భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

   09-08-2020


10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   08-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle