newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ఇప్పటికీ అమెరికా మేలుకోకపోతే కోటి 20 లక్షల మంది బలి!

02-04-202002-04-2020 14:25:10 IST
Updated On 02-04-2020 14:50:22 ISTUpdated On 02-04-20202020-04-02T08:55:10.306Z02-04-2020 2020-04-02T08:55:08.300Z - 2020-04-02T09:20:22.848Z - 02-04-2020

ఇప్పటికీ అమెరికా మేలుకోకపోతే కోటి 20 లక్షల మంది బలి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌తో రాగల ముప్పు గురించి ఎందరు హెచ్చరించినా మొదట్లో బేఖాతరు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్వాకానికి ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన స్థితిలో పడింది. లక్ష నుంచి 2 లక్షలమంది వరకూ ఈ వ్యాధికి బలయ్యే ప్రమాదం వున్నదని ‘చావు కబురు’ చల్లగా చెప్పినట్టు ఆయన ఇప్పుడు ప్రకటిస్తున్నారు. సరిగ్గా నెలక్రితం ఆయన కరోనా ప్రమాదం గురించి కొట్టిపడేశారు. మార్చి 3న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధి గురించి హెచ్చరిస్తూ, దీని బారిన పడినవారిలో 3.4 శాతం మంది బలయ్యే అవకాశం వున్నదని తెలిపింది. కానీ ట్రంప్‌ అదంతా అబద్ధమని తోసిపుచ్చారు. మరణాల రేటు మహావుంటే ఒక శాతం ఉండొచ్చునని వాదిం చారు. అతిగా అంచనాలు వేసి భయపెట్టొద్దని సలహా కూడా ఇచ్చారు. ఇన్నాళ్లకు ఆయనకు జ్ఞానోద యమైంది.

ఇందుకు వైద్య రంగ నిపుణుల్ని, శాస్త్రవేత్తల్ని మొదటగా అభినందించాలి. నెలరోజులుగా వారు ఎంతో శ్రమపడితే తప్ప డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ స్థాయికి వచ్చివుండరని ఆయన మొండివైఖరి గురించి తెలిసినవారందరికీ అర్థమవుతుంది. ప్రమాద తీవ్రతను అంగీకరించిన ఈ సమయంలో కూడా ‘ఇంత తక్కువ మరణాలు’ తన ప్రభుత్వం తీసుకునే చర్యలవల్లేనని ట్రంప్‌ చెప్పుకున్నారు. మృతుల సంఖ్య ఒకేరోజు 500 దాటాక తన ప్రథమ ప్రాధాన్యత కరోనాయేనని, ఆర్థిక వ్యవస్థ ఆ తర్వాతే వస్తుందని తెలిపారు. కొన్ని రోజులు వెనక్కి వెళ్లి చూస్తే ట్రంప్‌ దీనికి విరుద్ధమైన ప్రకటనలు చేశారు. కరోనా వ్యాధి పెద్ద సమస్యకాదని, ఆర్థిక వ్యవస్థ సక్రమంగా నడపడమే తన కర్తవ్యమని ఆయన చెప్పిన సంగతి ఎవరూ మరిచిపోరు. సరిగదా... చాలా త్వరలోనే ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ రాబోతోందని కూడా ట్రంప్‌ మార్చి 7న భరోసా ఇచ్చారు.

బుధవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 8,50,000 దాటి ముందుకుపోగా, ఇందులో ఒక్క అమెరికాలోనే 1,65,000 మంది వున్నారు. ట్రంప్‌ నిలకడలేని ప్రకటనలు అమెరికా ప్రజల్ని భ్రమల్లో ముంచెత్తాయి. ఆయన మాటలతో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు అమల్లోకి తెచ్చినా పౌరులెవరూ వాటిని తీవ్రంగా తీసుకోలేదు. వివిధ రాష్ట్రాల గవర్నర్లను ట్రంప్‌ ఎగతాళి కూడా చేశారు. అదే ఇప్పుడు కొంపముంచిందని రోజురోజుకీ పెరుగుతున్న వ్యాధిగ్రస్తుల సంఖ్యను చూస్తే అర్థమవుతుంది.

అమెరికా చరిత్ర తిరగేస్తే అచ్చం ట్రంప్‌ మాదిరే సంక్షోభం ముంచుకొచ్చినప్పుడు నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూసిన పాలకుడు మరొకరు కనిపిస్తారు. 80వ దశకంలో ఆ దేశాన్నేలిన రొనాల్డ్‌ రీగన్‌ అప్పట్లో బయటపడిన హెచ్‌ఐవీఎయిడ్స్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ వైరస్‌ గురించి చెప్పినప్పుడు అతిగా స్పందించొద్దని రీగన్‌ కొట్టిపడేశారు. ఎనిమిదేళ్లు అధికారంలో వుంటే చిట్టచివరి సంవత్సరంలో మాత్రమే ఆయన అయిష్టంగా ఈ వ్యాధిగ్రస్తుల విషయంలో పూర్తి స్థాయి చర్యలకు ఉపక్రమించారు. కానీ ఈలోగా 4 లక్షలమంది పౌరులు ఆ వ్యాధికి బలైపోయారు. 

ఆ అనుభవాలు తన కళ్లముందే వున్నా ట్రంప్‌ సైతం అదే తరహా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఫలితంగా మొదట్లో కరోనా వెల్లడైన చైనాను మించి మరణాలు సంభవించే ప్రమాదం కనబడుతోంది. ట్రంప్‌ తనంత తానే ‘దాదాపు 2 లక్షలమంది వరకూ మరణించే అవకాశం ఉన్న’దని చెప్పారు. కానీ ఆ దేశంలోని ఇంపీరియల్‌ కాలేజీ అధ్యయనం చూస్తే ఎవరైనా బెంబేలెత్తడం ఖాయం.

ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించి సకాలంలో చర్యలు తీసుకోవడానికి సిద్ధపడకపోతే కోటి 20 లక్షలమంది మృత్యువాత పడే అవకాశం వున్నదని ఆ అధ్యయనం అంచనా వేసింది. ప్రాథమిక పరీక్షలు మొదలుకొని చికిత్స వరకూ వేర్వేరు అంశాల్లో ప్రభుత్వాలు స్పందించే తీరుతెన్నుల్ని ఊహించి, ఏరకంగా స్పందిస్తే ఏ తరహా పరిస్థితులు ఏర్పడతాయో కంప్యూటర్‌ ఆధారిత నమూనాల ద్వారా ఈ అంచనా వేసింది. వాటి ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది. 

ఎవరి అంచనాలెలా వున్నా పాలకులు మాత్రం అత్యుత్సాహంతో ఇంతమంది చనిపోతారంటూ లెక్కలు చెప్పి హడ లెత్తించకూడదు. మొదట్లో నిపుణుల సూచనల్ని, సలహాల్ని బేఖాతరు చేసి ఏ తప్పు చేశారో...ఇప్పుడు వెనకా ముందూ చూడకుండా కొన్ని అంకెలు వల్లెవేయడం ద్వారా కూడా ఆయన అదే తప్పు చేస్తున్నారు. ప్రభుత్వానికి నిపుణులు అనేకానేక సూచనలు చేస్తారు. పరిస్థితి తీవ్రత గురించి అవగాహన కలిగిస్తారు. తెలివైన పాలకులు వాటిని అర్థం చేసుకుని పౌరులకు ఎంతవరకూ చెప్పాలో అంతే చెబుతారు.

ప్రభుత్వాల చర్యలే సమస్య తీవ్రతను అర్థం చేయించాలి. అదే సమయంలో పాలకులు భరోసా ఇవ్వాలి. ఈ మహమ్మారిని ఎదుర్కొనడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని చర్యలూ తీసుకుంటున్నదన్న అభిప్రాయం పౌరుల్లో కలగజేయాలి. అప్పుడు మాత్రమే వారు తమ వంతు క్రమశిక్షణతో మెలిగి, ఎలాంటి సంక్షోభాన్నయినా అవలీలగా జయిం చగలుగుతారు. కరోనా వ్యాప్తికి సంబంధించి ఫిబ్రవరి–మార్చి నెల మధ్య సమయం ఎంతో కీలకం. దాన్నంతటినీ ట్రంప్‌ వృథా చేశారు. చెప్పడానికి ప్రయత్నించినవారిని గేలి చేశారు. తన మాటే సరైందని వాదించారు. ఫిబ్రవరి 26న ఆయన చేసిన ప్రకటనే ఇందుకు రుజువు. అప్పటికి 15 కేసులు బయటపడ్డాయి. ఇవి రెండుమూడు రోజుల్లో సర్దుకుంటాయని, ఆ తర్వాత కరోనా కేసులే వుండవని ఆయన చెప్పారు. 

ఆయనకు ఇప్పుడు తత్వం బోధపడింది. కానీ ఆ కేసుల సంఖ్య 1,65,000 కు చేరుకుంది. ఈమధ్య కాలమంతా ఆయన అబద్ధాలతో, దబాయింపులతో కాలక్షేపం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేశానికి వచ్చిన విపత్తయినా ప్రపంచ పౌరులందరికీ దుఃఖం కలిగిస్తుంది. అందునా చదువుకో, కొలువుకో అమెరికా వెళ్లినవారు ఇప్పుడు మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ గణనీయంగా వున్నారు. అందువల్లే ఆ అగ్రరాజ్యం త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

ఇప్పటికే వర్జీనియా వంటి రాష్ట్రాల్లో 48 శాతం పైగా జనాభా కోవిడ్-19 వైరస్ పాజిటివ్‌గా తేలారని వార్తలు వస్తున్నాయి. ఇక ఆర్కాన్సాస్, కెంటకీ, ఫ్లోరిడా, అలబామా, సౌత్ కరోలినా, టెన్నెసీ, మిసిసిపి, వెర్మాంట్, మైనే వంటి రాష్ట్రాలు కూడా ఇప్పటికే కరోనా వైరస్‌కు గురైన అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయంటే రానున్నరోజుల్లో అమెరికా అల్లల్లాడిపోక తప్పదని అంచనా.

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle