newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఇంత జ‌రుగుతుంద‌ని ఊహించ‌లేదా..?

17-12-201917-12-2019 14:58:24 IST
Updated On 17-12-2019 15:40:15 ISTUpdated On 17-12-20192019-12-17T09:28:24.657Z17-12-2019 2019-12-17T09:28:22.217Z - 2019-12-17T10:10:15.623Z - 17-12-2019

ఇంత జ‌రుగుతుంద‌ని ఊహించ‌లేదా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండోసారి కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత భార‌తీయ జ‌న‌తా పార్టీ దూకుడుగా వెళుతోంది. లోక్‌స‌భ‌లో పూర్తి స్థాయిలో మెజారిటీతో ఉండ‌టంతో, రాజ్య‌స‌భ‌లోనూ స‌రిప‌డా బ‌లం ఉండ‌టంతో తాము అనుకున్నవి అన్నీ చేసేస్తోంది బీజేపీ. త్రిపుల్ త‌లాఖ్‌, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు వంటివి ప‌క్కాగా చేసేసింది. ఇదే దూకుడుతో పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం చేసింది.

అయితే, మిగ‌తా స‌మ‌యాల్లో బీజేపీ అంచ‌నాలు స‌రిగ్గానే ఉన్నా పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం విష‌యంలో మాత్రం ఆ పార్టీ అంచ‌నాలు త‌ల‌క్రిందుల‌య్యాయి. కేంద్రం ఊహించ‌ని విధంగా ఈ చట్టంపై వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది.

దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు రోజురోజుకూ ఉధృత‌మ‌వుతున్నాయి. ఉద్రిక్త ప‌రిస్థితులకు దారి తీస్తున్నాయి. దీంతో కేంద్రం విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. మొద‌టిసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత బీజేపీ ప్ర‌భుత్వం పెద్ద నోట్ల ర‌ద్దు, జీఎస్టీ అమ‌లు వంటి ప్ర‌యోగాల‌ను చేసింది. వీటి ఫ‌లితాలు ఆశించిన స్థాయిలో రాలేదు.

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థకు ఈ నిర్ణ‌యాలు పెద్ద దెబ్బ‌గా ఆర్థిక విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే, బీజేపీ మాత్రం పెద్ద నోట్ల ర‌ద్దు, జీఎస్టీ తాలూకు ఫ‌లితాలు భ‌విష్య‌త్‌లో ఉంటాయ‌ని చెబుతోంది. దీంతో 2019లోనూ బీజేపీ ఘ‌న విజ‌యం సాధించింది.

ఈసారి గెల‌వ‌గానే దేశంలో అనేక ఏళ్లుగా వివాదాస్ప‌దంగా ఉన్న అంశాల‌ను ముందెసుకుంది బీజేపీ సర్కార్‌. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేసి ద‌శాబ్దాల క‌శ్మీర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించామని చెప్పుకుంది.

అయితే, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు విష‌యంలో కేంద్రం అప్ర‌మ‌త్తంగా ఉంది. క‌శ్మీర్‌లో ప‌టిష్ఠ బందోబ‌స్తు ఏర్పాటు చేసింది. ఎక్క‌డా అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంది. నిర్భందం విధించినా ఒక్క బుల్లెట్ కూడా ప్ర‌యోగించ‌లేద‌ని కేంద్రం చెబుతోంది.

అయితే, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం విష‌యంలో మాత్రం కేంద్రం అంత‌గా జాగ్ర‌త్త ప‌డ‌న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ చ‌ట్టం తీసుకురావాల‌నే ఆలోచ‌న‌లో కేంద్రం ఉన్న‌ప్పుడు పెద్ద‌గా వ్య‌తిరేక‌త రాలేదు.

కానీ, పార్ల‌మెంటులో బిల్లు ప్ర‌వేశ‌పెట్టాక విప‌క్షాలు తీవ్రంగా వ్య‌తిరేకించారు. త‌ర్వాత ప్ర‌జ‌ల్లోనూ వ్య‌తిరేక‌త మొద‌లైంది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు ఈ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళ‌నలు ప్రారంభించారు.

ఆందోళ‌న‌లు అదుపుత‌ప్పి ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీశాయి. ప‌శ్చిమ బెంగాల్‌, ఢిల్లీలోనూ విధ్వంసాలు జ‌రిగాయి. దేశ‌వ్యాప్తంగా విశ్వ‌విద్యాల‌యాల్లో విద్యార్థులు ఈ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు చేస్తున్నారు.

ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివ‌ర్సిటీలో మొద‌లైన విద్యార్థుల ఆందోళ‌న దేశ‌మంతా పాకింది. సోష‌ల్ మీడియాలోనూ ఈ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ చ‌ట్టాన్ని స‌మ‌ర్థించే వారు కూడా పెద్ద సంఖ్య‌లోనే ఉన్నా ఇంత స్థాయిలో వ్య‌తిరేక‌త ఉంద‌ని, ఆందోళ‌న‌లు, విధ్వంసాలు జరుగుతాయ‌ని కేంద్ర స‌ర్కార్ ఊహించి ఉండ‌దు. ఒక‌వేల ఊహించి ఉంటే క‌నుక ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో విఫ‌ల‌మైన‌ట్లే లెక్క‌.

ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత‌, అయోధ్య తీర్పు త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా పెద్ద‌గా నిర‌స‌న‌లు ఏమీ వ్య‌క్తం కాలేదు. దేశాన్ని పీడిస్తున్న క్లిష్ట స‌మ‌స్య‌ల‌కు ఏదో విధంగా ఒక ప‌రిష్కారం దొరుకుతుంది క‌దా అని అన్ని వ‌ర్గాల వారూ స‌ర్దుకుపోయారు.

ఇదే ఉత్సాహంతో కేంద్రంలో తీసుకువ‌చ్చిన పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం విష‌యంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జ‌రుగుతోంది. ఎవ‌రి హ‌క్కుల‌కూ భంగం వాటిల్ల‌ద‌ని కేంద్ర ప్ర‌భుత్వ పెద్దలు ప‌దేప‌దే చెబుతున్నా ఆందోళ‌న‌లు ఆగ‌డం లేదు.

దీంతో ఆందోళ‌న‌ల వెనుక కాంగ్రెస్ స‌హా విప‌క్షాల కుట్ర ఉంద‌ని బీజేపీ ఆరోప‌ణ‌లు మొద‌లు పెట్టింది. అయితే, ప్ర‌జల ఆందోళ‌న‌ల‌తో ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న పార్టీలు కూడా ఇప్పుడు చ‌ట్టాన్ని వ్య‌తిరేకిస్తున్నాయి.

 

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   3 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   5 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   8 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   8 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   9 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle