newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఇండియా లో చైనా నకిలీ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్.. రెండు రోజులు పరీక్షల బంద్‌! ఐసీఎంఆర్

22-04-202022-04-2020 09:02:19 IST
Updated On 22-04-2020 09:52:12 ISTUpdated On 22-04-20202020-04-22T03:32:19.321Z22-04-2020 2020-04-22T03:32:17.322Z - 2020-04-22T04:22:12.670Z - 22-04-2020

ఇండియా లో చైనా నకిలీ ర్యాపిడ్ టెస్ట్  కిట్స్.. రెండు రోజులు పరీక్షల బంద్‌! ఐసీఎంఆర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు ర్యాపిడ్ టెస్ట్ కిట్ల అమ్మకాల్లో కుంభకోణాలు అంటూ వాదోపవాదాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొరికిన వారికి దొరికినట్లుగా ర్యాపిడ్ టెస్టు కిట్లను కొనిపడేస్తున్నాయి. కానీ ఈ కిట్ల ద్వారా జరిగే కరోనా వైరస్ పరీక్షలు ఘోరంగా విఫలమవుతున్నాయని, వాటి ఫలితాలు కచ్చితత్వాన్ని కలిగిలేవని ఆధార సహితంగా వెల్లడి కావడంతో ర్యాపిడ్ టెస్టులపైనే భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్‌) నిషేధం విధించింది. ప్రత్యేకించి ఐసీఎంఆర్ చైనా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్టు కిట్ల నాణ్యత భయంకరంగా ఉందని తెలుస్తుండటంతో, కరోనా నియంత్రణ చర్యల్లో కీలకమైన ర్యాపిడ్‌ టెస్టులు రెండు రోజులపాటు నిలుపుదల చేయాలని ఐసీఎంఆర్‌ ఆయా రాష్ట్రాలని ఆదేశించింది.

కరోనా నియంత్రణ చర్యల్లో అతి కీలకమైన ర్యాపిడ్‌ టెస్టులు రెండు రోజులపాటు నిలుపుదల చేయాలని రాష్ట్రాలకు భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్‌) మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్‌ నిర్ధారణకు రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసిన ర్యాపిడ్‌ టెస్టుల ఖచ్చితత్వంపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ‘ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లలో ఎటువంటి లోపాన్ని విస్మరించవద్దు’ అని స్పష్టం చేసింది. కాగా, హాట్‌స్పాట్‌ కేంద్రాలు, కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్‌ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం 5 లక్షల ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను పాలు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అయితే ఇవి మొత్తంగా చైనా నుంచి తెప్పించినవి కావడం గమనార్హం.

భారత దేశానికి చైనా నుంచి వచ్చిన 5 లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల పనితీరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రత్యేకించి రాజస్థాన్‌లో వీటిని వాటి చూసిన ప్రభుత్వ డాక్టర్లు 95 శాతం ఫలితాలు విఫలమవడం చూసి కంగుతిన్నారు.  ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లలో కోవిడ్‌ నిర్ధారణ ఖచ్చితత్వం కేవలం 5.4 మాత్రమే ఉందని దాదాపు 95 శాతం పరీక్షలు విఫలమయ్యాయని తెలియడంతో ఆ రాష్ట్రం మంగళవారం  ర్యాపిడ్‌ టెస్టింగ్‌ను ఆపేసింది. దీంతో వాటిని కొనుగోలు చేసి పంపిన ఐసీఎంఆర్ అన్ని రాష్ట్రాల్లో కరోనా ర్యాపిడ్ టెస్టులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఈ సందర్భంగా  ఐసీఎంఆర్‌ ఎపిడెమాలజీ హెడ్‌ డాక్టర్‌ గంగాఖేల్కర్ స్పందిస్తూ, ఇంతవరకు 3 రాష్ట్రాలు ర్యాపిడ్ టెస్టింగ్ కట్లపై అనుమానాలు వ్యక్తం చేశాయని, అందుకే నిజానిజాలు కనుగొనేంత వరకు వాటిద్వారా దేశంలో ఎవరూ పరీక్షలు చేయవద్దని తెలిపారు. రెండు రోజులపాటు తమ ప్రతినిధులు అన్ని రాష్ట్రాలకు వెళ్లి టెస్టింగ్‌ కిట్ల పనితీరును పరిశీలిస్తారని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రక్త నమూనాలు తీసుకొచ్చి మరోసారి పరీక్షిస్తామని అన్నారు. ఈ వ్యవహారంపై రెండు రోజుల్లో సమగ్ర నివేదిక వస్తుందని.. ఒకవేళ టెస్టింగ్‌ కిట్లలో లోపాలు ఉంటే.. వాటిని రిప్లేస్‌ చేయాలని తయారీ కంపెనీని కోరతామని అన్నారు.

చైనా నుంచి వచ్చిన ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ వినియోగాన్ని నిలిపేస్తున్నట్లు రాజస్తాన్‌ ప్రకటించింది. ఆ కిట్స్‌ ద్వారా జరిపిన పరీక్షల్లో 90% సరైన ఫలితాలు రావాల్సి ఉండగా.. 5.4% మాత్రమే కచ్చితమైన ఫలితాలు వస్తున్నట్లు తేలిందన్నారు. ఈ విషయాన్ని ఐసీఎంఆర్‌ దృష్టికి తీసుకు వెళ్లామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రఘు తెలిపారు. ల్యాబ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌ వచ్చినవారికి ఈ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా జరిపిన పరీక్షలో నెగటివ్‌ వస్తోందన్నారు.‘ఇవి చైనాలో తయారైన కిట్స్‌. ఐసీఎంఆర్‌ ఉచితంగా 30 వేల కిట్స్‌ను రాష్ట్రానికి ఇచ్చింది. అదనంగా 10 వేల కిట్స్‌ను కొనుగోలు చేశాం’అని రాజస్తాన్‌ అదనపు చీఫ్‌ సెక్రటరీ రోహిత్‌ తెలిపారు. ఈ కిట్స్‌ రక్త పరీక్ష ద్వారా, అత్యంత తక్కువ సమయంలో కరోనాను నిర్ధారిస్తాయి. ఈ కిట్స్‌ ద్వారా పాజిటివ్‌గా తేలిన వారికి మళ్లీ ల్యాబ్‌ టెస్ట్‌ ద్వారా నిర్ధారిస్తారు.

చైనా నుంచి కొనుగోలు చేసిన ఆ కిట్స్‌ ద్వారా జరిపిన నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. క్షేత్రస్థాయిలో ఆ కిట్స్‌ పనితీరును పరీక్షించి, అనంతరం రాష్ట్రాలకు వాటి వినియోగంపై సూచనలు చేస్తామని ఐసీఎంఆర్ డాక్టర్ గంగాకేల్కర్ వివరించారు. నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని తేలితే, ఆ కిట్స్‌కు బదులుగా, సంబంధిత సంస్థను వేరే కిట్స్‌ను సరఫరా చేయాలని కోరుతామన్నారు. ‘ఒక రాష్ట్రం నుంచి ఈ విషయమై ఫిర్యాదు వచ్చింది. వేరే 3 రాష్ట్రాలతో మాట్లాడాము. ఈ ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ ఫలితాలకు, ల్యాబ్‌ పరీక్షల ఫలితాలకు మధ్య తేడాలు వచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. అందువల్ల రెండు రోజుల పాటు ఆ కిట్స్‌ వాడవద్దని రాష్ట్రాలకు సూచించాం’అని ఐసీఎంఆర్‌కు చెందిన డాక్టర్‌ రామన్‌ గంగాఖేడ్కర్‌ చెప్పారు.

 

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   9 minutes ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   5 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   20 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle