newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఇండియాలో ఇస్లామిక్ తీవ్రవాద ముఠాల కదలికలు?

26-07-202026-07-2020 12:24:34 IST
2020-07-26T06:54:34.368Z26-07-2020 2020-07-26T06:54:21.897Z - - 07-08-2020

ఇండియాలో ఇస్లామిక్ తీవ్రవాద ముఠాల కదలికలు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)అల్‌ఖైదా అనుబంద ఉగ్రవాద ముఠాలు కదలికలు ప్రబలంగానే ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక హెచ్చరించింది. ఐసిస్ సభ్యులు కేరళ, కర్ణాటకలో పెద్ద సంఖ్యలో తిష్ఠ వేశారని పేర్కొంది. అల్‌ఖైదా అనుబంధ సంస్థ‘అల్‌ఖైదా ఇన్‌ ద ఇండియన్‌ సబ్‌ కాంటినెంట్‌’ (ఏక్యూఐఎస్‌) ఎక్కువగా ఉందని వెల్లడించింది. భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌లో ఎక్యూఐఎస్ సభ్యులు 150-200 మంది ఉండొచ్చని తెలిపింది. ఈ ప్రాంతంలో దాడులకు కుట్రలు పన్నుతున్నారని హెచ్చరించింది.

ఐసిస్‌, తాలిబన్‌ కనుసన్నల్లో ఏక్యూఐఎస్‌ కార్యకలాపాలు సాగిస్తోంది. అఫ్గానిస్థాన్‌లోని నిమ్రుజ్‌, హెల్మండ్‌, కాందహార్‌ ప్రావిన్స్‌ల నుంచి ఈ ముఠా కార్యకలాపాలు సాగిస్తోంది. ఏక్యూఐఎస్‌ ప్రస్తుత నేత ఒసామా మహ్మద్‌.. సైన్యం చేతిలో హతమైన అసిమ్‌ ఉమర్‌ స్థానంలో అతడు పగ్గాలు చేపట్టాడు. అసిమ్‌‌ను చంపినందుకు ప్రతీకారంగా ఈ ప్రాంతంలో దాడులు చేయాలని ఐసిస్‌ కుట్రలు పన్నుతోంది.

ఐసిస్‌కు చెందిన భారత అనుబంధ ముఠా (హింద్‌ విలాయాహ్‌)లో 180 నుంచి 200 మంది సభ్యులు ఉన్నారు. కేరళ, కర్ణాటకలో పెద్ద సంఖ్యలో ఐసిస్‌ ముష్కరులు ఉన్నారు. భారత్‌లో కొత్తగా ఒక ‘ప్రావిన్స్‌’ను ఏర్పాటు చేసినట్లు గత ఏడాది మేలో ఐసిస్‌ పేర్కొంది. ఐసిస్, అల్-ఖైదా ఉగ్రవాద కార్యకలాపాలపై కోవిడ్ -19 ప్రభావం చూపిందని పర్యవేక్షణ బృందం తెలిపింది. కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డౌన్ వల్ల ఉగ్రవాదుల ప్రణాళికకు అంతరాయం కలిగిందని పేర్కొంది.

అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం వల్ల ఉగ్రవాద నెట్‌వర్కింగ్, ఆర్థిక సంబంధిత కార్యకలాపాలు గణనీయంగా తగ్గినట్టు వివరించింది. కోవిడ్ ఆంక్షల వల్ల ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న లక్ష్యాల సంఖ్య తగ్గిందని పేర్కొంది. బహిరంగ సభలపై నిషేధం, వేదికలు మూసివేయడంతో దాడులకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదని వివరించింది.

 

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   an hour ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   4 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   4 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   5 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   05-08-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle