newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ఇంటినుంచే పనితో ఉద్యోగులకు శాశ్వత నష్టం.. సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్య

19-05-202019-05-2020 09:44:42 IST
Updated On 19-05-2020 10:12:30 ISTUpdated On 19-05-20202020-05-19T04:14:42.579Z19-05-2020 2020-05-19T04:14:39.591Z - 2020-05-19T04:42:30.629Z - 19-05-2020

ఇంటినుంచే పనితో ఉద్యోగులకు శాశ్వత నష్టం.. సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కార్పొరేట్ దిగ్గజాలనుంచి సాధారణ సంస్థల దాకా ఉద్యోగులను ఇంటినుంచే పనిచేసేందుకు అనుమతిస్తున్న సమయమిది. కానీ సిబ్బంది శాశ్వతంగా ఇంటినుంచే పనిచేసే విధానం ఉద్యోగులకు అన్ని రకాలుగా నష్టదాయకమేనని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడి, దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా దాదాపు ఉద్యోగులందరూ ఇంటినుంచే సేవలను అందిస్తున్న తరుణంలో సత్య నాదెళ్ల ఇలా వ్యాఖ్యానించడం సంచలనం కలిగించింది.

శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేయడం వల్ల ఉద్యోగులకే ఎక్కువ ప్రమాదం వుంటుందని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా  ఉద్యోగులు సమాజంలో కలవలేని పరిస్థితులు వస్తాయని, వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని వెల్లడించారు. దీని వల్ల కంపెనీల్లోని చాలా నియమ నిబంధనలు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్నారు. 

సమావేశాల్లో పాల్గొనేటప్పుడు భౌతికంగా కలవడానికి, ఆన్‌లైన్‌లో వర్చువల్ వీడియో  కాన్ఫరెన్సుల ద్వారా కలవడానికి చాలా తేడా ఉంటుందని చెప్పారు. భౌతిక, వ్యక్తిగత సమావేశాల ప్రయోజనాలను ఇవి భర్తీ చేయలేవన్నారు. అంతేకాదు అంతా రిమోట్ సెటప్‌గా మారిపోవడం అంటే.. ఒక మూఢత్వంలోంచి మరో మూఢత్వంలోకి జారిపోవడమేనని ఆయన పేర్కొన్నారు. 

ఇటీవలే న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ సత్య నాదెళ్ల ఈ వ్యాఖ్యలు చేశారు. శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఎంచుకున్న ఉద్యోగులకు వ్యాయామం ఎలా, వారి మానసిక ఆరోగ్య పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు. రిమోట్ గా పనిచేయడం అంటే మనుషుల మధ్య సామాజిక బంధాలను నాశనం చేయడమే అన్నారు.   

కాగా  కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఫేస్‌బుక్,  ఆల్ఫాబెట్ (గూగుల్) ఇతరులు తమ ఉద్యోగులను ఇంటి నుండి సంవత్సరం చివరి వరకు పని చేయమని కోరిన తరువాత ట్విటర్ ముందుకొచ్చింది. ప్రధానంగా  మహమ్మారి ప్రభావం తగ్గిన తరువాత కూడా ట్విటర్ తన సిబ్బందికి ఇంటి నుండి 'ఎప్పటికీ' పనిచేసుకోవచ్చనే అవకాశాన్ని ప్రకటించిన తరువాత సత్య నాదెళ్ల వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మైక్రోసాఫ్ట్ వర్క్ ఫ్రం హోం విధానాన్ని అక్టోబర్ వరకు పొడిగించింది.

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   6 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   9 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   a day ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle