newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

ఆ 600ల మంది అబ్బాయిల్లో ఒక్క మహిళా ఇంజనీర్ నేనే: సుధామూర్తి

28-11-201928-11-2019 14:06:48 IST
2019-11-28T08:36:48.964Z28-11-2019 2019-11-28T08:36:37.685Z - - 12-08-2020

ఆ 600ల మంది అబ్బాయిల్లో ఒక్క మహిళా ఇంజనీర్ నేనే: సుధామూర్తి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సుధా మూర్తి.. ఈ పేరు భారతీయులకు సుపరిచితమైన పేరు. కానీ తాను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఎంత అనామకురాలంటే తన బ్యాచ్‌లోని 599 మంది అబ్బాయిల్లో ఈమె ఒకరే మహిళా ఇంజనీర్. ప్రపంచ ప్రసిద్ధ భారతీయ సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపక సభ్యుడు నారాయణ మూర్తి జీవన భాగస్వామిగా, ఇన్ఫోసిస్ సంస్థ ఏర్పాటుకు ప్రేరణ కర్తగా, ప్రస్తుతం ఇన్పోసిస్ చైర్‌పర్సన్‌గా సుధా మూర్తి ఈరోజు జగమెరిగిన వ్యక్తి. కౌన్ బనేగా క్రోర్ పతి స్పెషల్ ఎపిసోడ్‌లో భాగంగా ఈ శుక్రవారం టీపీ ప్రేక్షకుల ముందుకు రానున్న సుధామూర్తిని అమితాబ్ బచ్చన్ ఇంజనీరింగ్ చదవాలని ఎందుకనిపించింది అంటూ వేసిన ప్రశ్న టీజర్‍గా మారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోనీ టీవీ తన అదికారిక సోషల్ మీడియాలో ఈ ప్రత్యేక ఎపిసోడ్ పై టీజర్ విడుదల చేసింది. ఆ వీడియో ఇప్పుడు విశేషంగా వైరల్ అవుతోంది. ఈ టీజర్‌లో అమితాబ్ ఆమెను హుబ్లీలో తొలి మహిళా ఇంజనీరుగా మీ అనుభవాలేంటి అని ప్రశ్నించగా సుధామూర్తి సమాధానం ఇవ్వడం చూడవచ్చు.

మీరు హుబ్లీలో మొట్టమొదటి మహిళా ఇంజనీర్ కదా. పైగా మీరు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అవమానాలను, వ్యతిరేకతను ఎదుర్కొన్నారట. నిజమేనా అని అమితాబ్ అడిగారు. దానికి సుధామూర్తి సమాధానమిస్తూ ఇంజనీరింగ్ చదువుతానంటే ఇంట్లో అమ్మమ్మే వ్యతిరేకించిందిని, నీకు చేతకాదు అనేసిందని చెప్పారు. 

1968లో ఇంజనీరింగ్ చదవాలని నిర్ణయించుకున్నాను. కానీ మా అమ్మమ్మ నువ్వు ఆ కోర్సు చదవలేవని చెప్పింది. ఇంజనీరింగ్ చేస్తే మన కులంలో ఎవరూ నిన్ను పెళ్లి చేసుకోరని హెచ్చరించింది. ఇలాగే చాలామంది నాకు ఉచిత సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ నేను ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. నా బ్యాచ్‌లో 599 మంది అబ్బాయిలు ఉండేవారు. వారిలో నేనొక్కతినే అమ్మాయిని అని సుధామూర్తి చెబుతుండగా అమితాబ్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

మార్కులు అధికంగా వచ్చాయి కాబట్టే ఇంజనీరింగ్ సీటు సాధించావని కాలేజి ప్రిన్సిపాల్ నాతో చెప్పారు. కానీ ఆయన నాకు మూడు షరతులు పెట్టారు. ఒకటి. నేను చీరమాత్రమే ధరించి కాలేజీకి రావాలి. రెండు. నేను క్యాంటీన్‌కి పోకూడదు. ఎందుకంటే అది దరిద్రంగా ఉంటుంది. మూడు, నేను అబ్బాయిలతో అసలు మాట్లాడకూడదు. ఈ మూడు కండిషన్లకు ఒప్పుకున్నను. తొలి సంవత్సరంలో నేను ఏ అబ్బాయితోనూ మాట్లాడలేదు. కానీ నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చాక, వారే నాతో మాట్లాడడానికి ముందుకొచ్చారు అంటూ సుధామూర్తి హాట్ సీట్‌లో కూర్చుని చెబుతుంటే చూస్తున వీక్షకులు పడిపడి నవ్వారు.

హుబ్లీలో నేను చదివిన బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ బీసీ ఖానాపురే మా నాన్నకు తెలుసు. ఒకసారి ఇద్దరూ బార్బర్ షాపులో కలిసినప్పుడు ఆయన నా గురించి నాన్నకు చెప్పారు. డాక్టర్ సాబ్, మీ కూతురు చాలా తెలివైందని నాకు తెలుసు. మెరిట్ వల్లే ఆమెకు సీటు వచ్చింది. కానీ మాకు ఆమెతో కొన్ని సమస్యలు ఉన్నాయి.  కాలేజీ మొత్తంలో ఆమె ఒక్కతే అమ్మాయి.

ఇది ఆమెకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. మొదటి విషయం. మా క్యాంపస్‌లో లేడీస్ టాయెలెట్ లేదు. పైగా కాస్త రెస్టు తీసుకోవడానికి లేడీస్ రూమ్ కూడా  మా క్యాంపస్‌లో లేదు. రెండు. మా కుర్రాళ్లు హార్మోన్లు పెరిగే వయసులో ఉన్నారు. ఇది ఆమెకు సమస్యగా మారుతుంది. స్టాఫ్ ముందు వారు ఏమీ చేయకపోవచ్చు కానీ వారు ఆమెను ఏదో ఒకటి చేయవచ్చు. అమ్మాయిలతో మాట్లాడే అలవాటు మా వాళ్లకు లేదు కాబట్టి వారు ఆమెకు సహకరించకపోవచ్చు లేక సాయం అందించకపోవచ్చు. నలుగురు ఆడపిల్లల తండ్రిగా మీ గురించి కూడా నేను ఆందోళన చెందుతున్నాను. తన మంచికోసం ఇంజనీరింగ్ చదవాలనే ఇష్టాన్ని ఆమె మార్చుకోవాలని మీరు చెప్పగలరా అని మా ప్రిన్సిపల్ మా నాన్నతో చెప్పారట..కానీ నాన్న వినకపోయేసరికి, ఇక చేసేదేమీ లేక ఆయన నాకే కండిషన్లు పెట్టారు అని సుధామూర్తి అమితాబ్ తో చెప్పారు.

అయితే ఇంజనీరింగ్ కోర్సు చేసేసమయంలో అమ్మాయిలకు టాయ్‌లెట్ లేకపోవడమన్నది నాకు చాలా కష్టంగా అనిపించేది. అప్పుడే మనిషికి టాయ్‌లెట్ ప్రాధాన్యత అర్థమైంది అని సుధామూర్తి చెప్పారు. అందుకే ఇన్ఫోసిస్ పౌండేషన్ అధ్వర్యంలో ఇంతవరకు 16,000 టాయెలెట్లను నిర్మించామని చెప్పారు. 

సమాజంలో మూస పాత్రలకు, మూసతరహా జీవితానికి వ్యతిరేకంగా సుధామూర్తి తీవ్రంగా పోరాడారు. స్ఫూర్తిదాయకమైన ఆమె ఎపిసోడ్ ఈ శుక్రవారం రాత్రి 9 గంటలకు సోనీ టీవీలో ప్రసారం కానుంది.

 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   14 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle