newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

ఆ పేద దేశం, ఈ ధనిక దేశం కరోనా నియంత్రణకు అనుసరించిన మార్గం భేష్

13-04-202013-04-2020 12:27:11 IST
Updated On 13-04-2020 12:51:02 ISTUpdated On 13-04-20202020-04-13T06:57:11.817Z13-04-2020 2020-04-13T06:57:03.443Z - 2020-04-13T07:21:02.575Z - 13-04-2020

ఆ పేద దేశం, ఈ ధనిక దేశం కరోనా నియంత్రణకు అనుసరించిన మార్గం భేష్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పెద్ద దేశాల మాటేమో కానీ చిన్న చిన్న దేశాలు కరోనా వైరస్ వంటి మహమ్మారి నివారమకు లాక్ డౌన్ చేస్తే వాటి ఆర్థిక వ్యవస్థలు, ప్రజా జీవితం కూడా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆఫ్రికాలో అతి చిన్న ఆర్థిక వ్యవస్థ అయిన ఇథియోపియా లాక్ డౌన్ జోలికి పోకుండా సమస్యను తనదైన ధోరణిలో పరిష్కరించడానికి ప్రయత్నించి ఘనవిజయాన్నే సాధించింది. అమెరికా వంటి అగ్రరాజ్యం, యూరప్ సంపన్న దేశాలు కరోనా బారిన పడి చేష్టలుడిగిపోతున్న సమయంలోనే ఇథియోపియా స్వల్ప వనరులతో కరోనాను కట్టడి చేసి పడేసింది. నిజంగానే కరోనా కట్టడి విషయంలో ఇతర దేశాలకు మార్గదర్శకంగా నిలిచింది. అదే సమయంలో సంపన్న యూరప్ దేశమైన జర్మనీ లో కరోనా కేసులు ఎక్కువవుతున్నప్పటికీ మరణాల విషయంలో స్పెయిన్, ఇటలీ, ఇంగ్లండ్ బాట పట్టకుండా తప్పించుకుంది. దీనికి కారణం ఆ దేశంలో వైద్యపరమైన మౌలిక సౌకర్యాలు బ్రహ్మాండంగా వృద్ధి చెందటమే అంటున్నారు.

ఇథియోపియా జనాభా 11 కోట్లు.. అక్కడి ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వెంటిలేటర్లు కేవలం 450.. ఇతర జబ్బులతో బాధపడుతున్న వారికి పోను, కరోనా బాధితుల కోసం కేటాయించినవి కేవలం 54 మాత్రమే. ఇలాంటి తరుణంలో ఆ వైరస్‌ విజృంభిస్తే పరిస్థితేంటి.. ఇది ఆఫ్రికా దేశం ఇథియోపియా ముందున్న భయం. సమస్య పెరిగితే తట్టుకోవటం కష్టం. అందుకే సమస్యను ఉన్నంతలో కట్టడి చేయాలని నిర్ణయించింది. అసలే అతి చిన్న ఆర్థిక వ్యవస్థ.. లాక్‌డౌన్‌ చేస్తే మరింత చితికిపోతామన్న ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన కల్పించింది. కేవలం అవసరమున్నవారు తప్ప మిగతావారు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది. బయటకు వచ్చిన వారు గుమి కూడకుండా కనీసం మీటరుకు ఒకరు చొప్పున దూరం పాటించాలని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలు గుర్తించి జనం కూడా సహకరించటం ప్రారంభించారు. ఇప్పుడు ఆ దేశంలో ఉన్న పాజిటివ్‌ కేసుల సంఖ్య కేవలం 65 మాత్రమే. 

‘భౌతిక దూరం పాటించటం ఒక్కటే కరోనాను నియంత్రించే మంత్రం. ఇప్పుడు ఇథియోపియా జనం అదే చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాన్ని పాటించటంలో క్రమశిక్షణ చూపుతున్నారు. ఈ పేద దేశాన్ని ఆ క్రమశిక్షణే గట్టునపడేస్తుందని మేం నమ్ముతున్నాం’ అని డాక్టర్‌ రాజు రమేశ్‌రెడ్డి చెప్పారు. అర్బా మించ్‌ యూనివర్సిటీ సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన.. కరోనాను ఎదుర్కొనేందుకు ఇథియోపియా అనుసరిస్తున్న తీరును మీడియాకు వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే విందాం.

‘అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు కరోనాను సకాలంలో నియంత్రించలేక అల్లకల్లోలమవుతోంది. మరి అమెరికా లాంటి దేశాల ఆర్థిక సాయంతో నెట్టుకొచ్చే పేద ఇథియోపియా తట్టుకోగలదా.. అందు కే మార్చి తొలివారంలోనే అక్కడి ప్రభుత్వం మేల్కొంది. సరిహద్దులను మూసేసింది, విమానాలను రద్దు చేసింది. రాజధాని నగరం అడిస్‌ అబాబాలో కఠిన ఆంక్షలు విధించింది. కేసుల సంఖ్య తక్కువగానే ఉండటంతో ఇప్పటికీ లాక్‌‌డౌన్‌ విధించలేదు. కానీ విద్యాసంస్థలు మూసేసి, అవకాశం ఉన్న వారందరినీ ఇంటి నుంచే పనిచేయమని పురమాయించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆదేశించింది. వాహనాల్లో సీటుకు ఒకరే కూర్చోవాలని, ఆటోరిక్షాల్లో ఇద్ద రు మాత్రమే ఉండాలని ఆదేశించింది. ఇక ప్రజల్లో అవగాహన కోసం 35 వేల మందితో బృందాలు ఏర్పాటు చేసింది. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలు చూసి ఆందోళనలో ఉన్న జనం ఆ నిబంధనలను బాగా పాటిస్తున్నారు. స్వీయ నియంత్రణతో క్రమశిక్షణగా ఉంటున్నారు. రాజధాని నగరంలో 44 పాజిటివ్‌ కేసులు మాత్రమే ఉండేవి. మంగళవారం ఒక్కరోజే 8 కేసులు పెరిగి ఆ సంఖ్య 52కు చేరుకుంది. దీంతో ప్రభుత్వం వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. 4 కేసులు మాత్రమే రాజధాని ఆవల ఉన్నాయి. ఇప్పటివరకు రాజధానిలోనే ఉన్న కఠిన ఆంక్షలు ఇప్పుడు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నారు. దేశమంతటా ప్రజల్లో క్రమశిక్షణ కనిపిస్తున్నందున సమస్యను పెరగకుండా చూసే అవకాశముంది.  

ఇథియోపియా ప్రజల సంప్రదాయ ఆహారం ఇంజీరా. గసాల ఆకారంలో ఉండే మిల్లెట్‌ (టెఫ్‌) పిండితో తయారు చేసే ఈ ఆహారం అక్కడి ప్రజల రోగ నిరోధకశక్తిని బాగా పెంచుతోంది. ఎన్నో వ్యాధుల నుంచి వారికి ఇది రక్షణగా ఉంటుంది. 80% గ్రామీణ జనాభాతో ఉండే ఈ దేశంలో కాలుష్యం చాలా తక్కువే. వెరసి ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఇవి ఎంతో ఉపకరిస్తున్నాయి. ఇప్పుడు కరోనాను కూడా వారి శరీరం తట్టుకునే అవకాశముంది. ఇటు భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇథియోపియా జనాన్ని చూసైనా భారతీయులు స్వీయ క్రమశిక్షణ పాటిస్తే పరిస్థితి కుదుటపడే అవకాశముంది. అయితే భారత్‌తో పోలిస్తే మేం చాలా ధైర్యంగా ఉన్నామని డాక్టర్‌ రాజు రమేశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

జర్మనీలో తక్కువ మరణాలకు కారణం...

ప్రపంచం మొత్తమ్మీద శనివారం నాటికి కోవిడ్‌–19 బారిన పడి మరణించినవారు లక్షకుపైమాటే. అయితే చనిపోతున్న వేగం దేశాన్ని బట్టి మారుతోంది. కానీ.. జర్మనీలో ఇది అతి కనిష్టంగా ఎందుకు ఉందన్నది మాత్రం శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. గత శనివారం జర్మనీలో 1.22 లక్షల మంది వ్యాధి బారిన పడగా 2,736గా ఉంది. ఇదే సమయంలో ఇటలీలో 1.47 లక్షల కేసులకు గాను మరణించిన వారు 18 వేలకుపైమాటే. స్పెయిన్‌లో 1.61 లక్షల కేసులకు గాను 16 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు కారణం ఏమిటన్నది తమకు అర్థం కావడం లేదని అంటున్నారు జర్మనీలోని రాబర్ట్‌ కోచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధికార ప్రతినిధి మారెకీ డీగెన్‌. ఆరోగ్యశాఖకు చెందిన ఈ సంస్థ వైరస్‌ కట్టడి చర్యలను పర్యవేక్షిస్తోంది. 

ఇటలీ, జర్మనీ రెండింటిలోనూ వయో వృద్ధులు ఎక్కువైనా ఒక దేశంలోనే ఎక్కువ మంది బలికావడం గమనార్హం. జర్మనీలో ఇతర దేశాల కంటే భిన్నంగా తీసుకున్న చర్యలు కూడా ఏవీ లేవు. కాకపోతే ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు బాగా పనిచేస్తాయని వైరాలజిస్ట్‌ సెంట్‌మెర్‌ తెలిపారు. మరణాలు తక్కువగా ఉండేందుకు ఇదో కారణం కావచ్చునని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు కరోనా కోసం వేగంగా ఎక్కువమందికి పరీక్షలు జరపడం కూడా తమకు ఉపయోగపడి ఉండవచ్చని.. బాధితులను తొందరగా గుర్తించడం ద్వారా చాలామంది ప్రాణాలు దక్కి ఉండవచ్చునని వివరించారు. 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   2 hours ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   8 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   9 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   9 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   11 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   04-08-2020


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle