newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

ఆ నలుగురిని ఉరి తీసిన పవన్ పారితోషికం ఎంతంటే.?

20-03-202020-03-2020 07:49:38 IST
2020-03-20T02:19:38.707Z20-03-2020 2020-03-20T02:19:35.210Z - - 12-08-2020

ఆ నలుగురిని ఉరి తీసిన పవన్ పారితోషికం ఎంతంటే.?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యావత్ దేశమంతా ఎదురుచూస్తున్న క్షణం ఇదే. ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి శిక్ష పడింది. నలుగురు దోషులైన అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్‌లను తలారీ పవన్ ఒకేసారి ఉరి తీశాడు. ఇలా నలుగురికి ఉరి పడటం దేశంలోనే తొలిసారి అని చెప్పవచ్చు. ఉరి కంబంపై నలుగురు దోషులు వేలాడారు. దేశమంతా హర్షాతిరేకాలు వెలువడ్డాయి. అసలు ఉరి అమలవుతుందా? లేదా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. 

సరిగ్గా తెల్లవారుజామున నలుగురి ఆరోగ్య పరిస్థితి బాగుందని తిహార్‌ జైలు అధికారులు వెల్లడించిన అనంతరం. ఉరిశిక్ష అమలు చేశారు. మరోవైపు ఉరితీత నేపథ్యంలో అధికారులు జైలును లాక్‌డౌన్‌ చేశారు. జైలు బయట మీడియా పెద్ద సంఖ్యలో గుమిగూడింది. నిర్భయ దోషులకు ఉరి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నిర్భయ దోషులకు మరణ శిక్ష విధించేందుకు తలారిగా పవన్  జల్లాడ్ ను తిహార్ జైలు అధికారులు ఏరికోరి ఎంపికచేశారు. పవన్ కు అనుభవం మాత్రమే కాదు.. అతని కుటుంబంలోని తన ముందు తరాల వాళ్లు తలారిగా పనిచేయటమే కారణం. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య వంటి ఎన్నో కీలక కేసుల్లో దోషులకు పవన్  తండ్రి, తాత ఉరిశిక్ష అమలు చేశారు.

నిర్భయ సామూహిక అత్యాచార దోషులను.. ఉరితీసే అవకాశం ఉత్తర్ ప్రదేశ్ మేరఠ్ కు చెందిన పవన్  జల్లాడ్ కు దక్కింది. 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులోని నలుగురు నిందితులను ఉరితీసేందుకు ప్రభుత్వం పవన్ నే  ఎంచుకుంది. నిర్భయ దోషులను ఉరితీసేందుకు పవన్ సరైన వ్యక్తిగా తిహార్  జైలు అధికారులు భావించారు. పవన్ కు ఉరి తీసిన అనుభవం ఉంది. శారీరకంగా బలిష్ఠంగా ఉన్నాడు. అతని పూర్వీకులు కూడా తలారిలే కావటం వల్ల ఎలాంటి తప్పిదాలు జరగవన్న భావనతో అధికారులు పవన్ వైపు మొగ్గుచూపారు.

నిర్భయ దోషులకు నలుగురికి మరణశిక్ష అమలు చేస్తే పవన్ కు లక్ష రూపాయలు పారితోషికంగా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిర్భయ దోషులను ఉరి తీసే అవకాశం రావాలని పవన్  జల్లాడ్  ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు. తలారిగా ఎంపికైన వెంటనే ఉత్తర్ ప్రదేశ్  జైళ్ల శాఖకు కృతజ్ఞతలు తెలిపాడు. తలారిగా విధులు నిర్వర్తిస్తున్నందుకు నెలకు రూ.5వేలు పవన్ కు చెల్లిస్తుంది ఉత్తర్ ప్రదేశ్ జైళ్ల శాఖ. అతనికి ఉన్న ఏకైక ఆదాయ మార్గం ఇదే. ప్రస్తుతం ఆర్థిక సమస్యల్లో ఉన్నాడు జల్లాడ్. శిథిలావస్థకు చేరుకున్న మేరఠ్ లోని తన ఇంటికి మరమ్మతులు చేయించే స్తోమత కూడా లేదు.

నిర్భయ దోషుల ఉరి ద్వారా లభించే రూ.లక్ష.. తన ఆర్థిక అవసరాలు తీరుస్తాయన్న ఆశతో ఉన్నాడు జల్లాడ్ . తన కూతురు పెళ్లికీ ఈ డబ్బు వినియోగిస్తానని చెబుతున్నాడు.

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   10 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle