newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

ఆ ఒక్కటీ పాటించకపోతే మాస్కులు కూడా కాపాడలేవు: తాజా అధ్యయనం

07-04-202007-04-2020 17:48:48 IST
Updated On 07-04-2020 17:55:25 ISTUpdated On 07-04-20202020-04-07T12:18:48.819Z07-04-2020 2020-04-07T12:18:46.656Z - 2020-04-07T12:25:25.641Z - 07-04-2020

ఆ ఒక్కటీ పాటించకపోతే మాస్కులు కూడా కాపాడలేవు: తాజా అధ్యయనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ దేశాలన్ని కరోనా మహమ్మారి బారిన పడి కకావికలమవుతున్నాయి. ఎప్పుడూ ప్రపంచం చూడనంతగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారికి ఎటువంటి మందు కానీ, వాక్సిన్‌ కానీ కనిపెట్టలేదు. ఈ వైరస్‌ను ఎదుర్కోవాలంటే తరచు చేతులు కడుక్కోవడం, మాస్క్‌లు ధరించడం, ఇంటిని, పరిసరాలను క్రిములు వ్యాప్తిచెందకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం లాంటి స్వీయ రక్షణ చర్యలు మాత్రమే మార్గాలు. అయితే హాంకాంగ్‌ యూనివర్శిటి వాళ్లు కరోనా వైరస్‌ పై జరిపిన రీసెర్చ్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 

కరోనా వైరస్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, ప్లాస్టిక్‌ ఉపరితలాలపై 4రోజుల వరకు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా కరోనా నుంచి రక్షణ కోసం ఉపయోగించే మాస్క్‌లపై మాత్రం కరోనా వైరస్‌ వారం రోజుల పాటు ఉంటుందని హాంకాంగ్‌ యూనివర్శిటి పరిశోధకులు తెలిపారు. మాస్క్‌ ముందు భాగాన్ని చేతితో తాకితే ఆ వైరస్‌ చేతికి అంటుకొని దాని ద్వారా ముఖాన్ని, కళ్లను, ముక్కును తాకినప్పుడు మనం వైరస్‌ బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. అందుకే చేతులు కడుక్కున్న తరువాతే ముఖాన్ని కానీ, కళ్లను కానీ ముట్టుకోవాలని సూచిస్తున్నారు. 

గది ఉష్ణోగ్రత వద్ద ఏఏ వస్తువులపై కరోనా వైరస్‌ ఎంత సేపు ఉంటుందని పరిశోధనలు చేశారు. దీనిలో భాగంగా ప్రింటింగ్‌ పేపర్‌, టిష్యూ పేపర్‌ల మీద కరోనా వైరస్‌ కేవలం మూడు గంటలు మాత్రమే ఉంటుందని కనుగొన్నారు. చెక్క మీద, బట్టల మీద రెండో రోజుకు కనిపించకుండా పోతుందని, గ్లాస్‌ మీద, బ్యాంక్‌ నోట్ల మీద రెండురోజుల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మాస్క్‌ల మీదే అత్యధికంగా వారం రోజుల పాటు కరోనా వైరస్‌ ఉంటుందని వారు తెలిపారు. కరోనాను ఎదుర్కొవడానికి తరచు చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ఒక్కటే మార్గమని వారు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 13 లక్షలకు పైగా కరోనా బారిన పడగా 75 వేల మందికి పైగా మృతి చెందారు.  

సర్జికల్ మాస్క్ అవటర్ లేయర్‌‌పై కరోనా వైరస్ సోకితే అది ఏడురోజులపాటు అక్కడే ఉండిపోతుందని తాజా పరిశోధనలో తేలింది. అందుకే సర్జికల్ మాస్కు ధరించాం కాబట్టి మనకేం కాదని నిర్లక్ష్యంగా ఉండకూడదని పరిశోధకులంటున్నారు. అందుకే సర్జికల్ మాస్కును ధరించినప్పటికీ పొరపాటున కూడా చేత్తా ఆ మాస్క్ బయటి భాగాన్ని తాకకూడదు. మాస్క్ వెలుపలి భాగాన్ని చేతితో తాకితే మాస్క్‌లో ఉన్న వైరస్ వెంటనే చేతికి సోకుతుందని, తర్వాత చేతులతో కళ్లను తుడుతుకుంటే మీ కళ్లకుకూడా వైరస్ సోకుతుందని హాంకాంగ్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

ప్రపంచానికి ఇప్పటి తారకమంత్రం ఒకటే. చేతులను నీటితో కడుక్కోవడం. శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం. మాయలపకీరు ప్రాణం చిలక గూటిలో ఉన్నట్లుగా అంతప్రాణాంతక కరోనా  వైరస్ కూడా ఆల్కహాల్ లిక్విడ్‌ కలిసిన శానిటైజర్‌‌ దెబ్బకు మాడిమసవుతుందనన్నమాట.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   8 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle