newssting
BITING NEWS :
*ఇవాళ గురుపూర్ణిమ.. చంద్రగ్రహణం **దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

ఆ ఆస్పత్రి బిల్లు ఎంతో తెలిస్తే ... గుండె జారిపోద్ది

26-06-202026-06-2020 08:55:40 IST
Updated On 26-06-2020 10:59:21 ISTUpdated On 26-06-20202020-06-26T03:25:40.562Z26-06-2020 2020-06-26T03:23:45.240Z - 2020-06-26T05:29:21.205Z - 26-06-2020

ఆ ఆస్పత్రి బిల్లు ఎంతో తెలిస్తే ... గుండె జారిపోద్ది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ పుణ్యమాని కార్పోరేట్ ఆస్పత్రులు లక్షల్లో బిల్లులు వసూలు చేస్తూ రోగులకు షాకిస్తున్నాయి.తాజాగా ఓ కరోనా రోగికి ట్రీట్ మెంట్ అందించి ఏకంగా లక్షల్లో బిల్లు వసూలు చేసింది. కరోనా వైరస్ ఎంత ఖరీదైన జబ్బో రోగులకు, సామాన్యులకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. 

మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో మే 26వ తేదీన ఒక రోగి చేరాడు. ఈనెల 7వ తేదీని డిశ్చార్జ్ అయ్యాడు. మొత్తం 14 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స అందుకున్నాడు. మొత్తం బిల్లు ఎంత అయిందో తెలుసా. అక్షరాలా 15 లక్షల 33 వేలు 588 రూపాయలు. కరోనా వైరస్ తగ్గేందుకు వాడిన మందులకే ఆస్పత్రి వేసిన బిల్లు 4 లక్షల 22 వేలు. ఎక్విప్ మెంట్ కి లక్షా 50 వేల పైమాటే. ఇన్వెస్టిగేషన్ కి లక్షా 41 వేలు. మెడికల్ ఎక్విప్ మెంట్ పేరుతో 2 లక్షల 18 వేలు వసూలు చేసింది.

https://www.photojoiner.net/image/Ngggawqv

ఇతర ఛార్జీల పేరుతో రెండు లక్షల79 వేలు బిల్లేసింది. ప్రోసీజర్స్ పేరిట వేసిన బిల్లు ల లక్షా 4 వేలు, రూం రెంట్ పేరిట 1లక్షా 23 వేలు .. ఇలా తడిసి మోపెడయి 15 లక్షలు దాటిపోయింది. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ 15లక్షల ఇన్స్యూరెన్స్ మంజూరు చేసింది. అదే సామాన్యుడైతే పరిస్థితి ఏంటి? తల తాకట్టుపెట్టినా అంత బిల్లు చెల్లించడం అసాధ్యం. సామాన్యులు కరోనా వైరస్ టెస్టుల కోసం వెళితేనే ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతించిన మొత్తానికి రెండుమూడు రెట్లు ఇతర ఎక్విప్ మెంట్ల పేరుతో రోగుల నుండి బాదేస్తున్నాయి ఆస్పత్రులు. 

ప్రైవేటు ఆస్ప‌త్రులు, ల్యాబ్‌ల‌లో క‌రోనా టెస్టుల‌కు ప్ర‌జ‌ల నుంచి వ‌సూలు చేసే చార్జీలు దేశ‌మంతా ఒకే విధంగా ఉండాల‌ని సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించింది. అలాగే క‌రోనా బారినప‌డిన పేషెంట్ల‌కు ఆస్ప‌త్రుల్లో స‌రైన చికిత్స అందేలా ప‌ర్య‌వేక్ష‌ణ‌కు నిపుణులు క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని, ఈ క‌మిటీలు త‌ర‌చూ ఆస్ప‌త్రుల‌కు నేరుగా వెళ్లి చెక్ చేయాల‌ని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు చెప్పింది. దేశ వ్యాప్తంగా ప‌లు న‌గారాల్లో క‌రోనా టీట్మెంట్, మృత‌దేహాల‌ను క్లియ‌ర్ చేసే విష‌యాల్లో ప్ర‌భుత్వాలు ఫెయిల్ అవుతున్నాయ‌న్న వార్త‌ల‌పై సుప్రీం సుమోటోగా తీసుకుని విచార‌ణ జరుపుతోంది. గత వారం విచారించిన కోర్టు పలు ఆదేశాలు జారీచేసింది. 

వ్యక్తిగత గోప్యత పేరుతో కరోనా టెస్టులు, ట్రీట్మెంట్ వివరాలను దాచి వుంచకూడదని కోర్టు ఆదేశించింది. క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారి రిపోర్టుల‌ను పేషెంట్, వారికి కుటుంబ‌స‌భ్యుల‌కు చెప్పొద్దంటూ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఆదేశాల‌ను సుప్రీం కోర్టు ఈ విచార‌ణ సంద‌ర్భంగా త‌ప్పుబ‌ట్టింది. త‌ప్ప‌నిస‌రిగా పేషెంట్స్, వారి కుటుంబ‌స‌భ్యులకు టెస్టు రిపోర్టుల‌ను అందించాల‌ని, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం త‌న ఆదేశాలను పునః స‌మీక్షించుకోవాల‌ని ఆదేశించిన సంగతి తెలిసిందే.

దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాల్లో ప్రైవేటు ల్యాబ్స్‌లోనూ టెస్టులు చేసేందుకు తెలంగాణ స‌హా ప‌లు రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు అనుమ‌తి మంజూరు చేశాయి. అయితే ఆ ప్రైవేటు సంస్థ‌లు ఇష్టానుసారం ఛార్జీలు వ‌సూలు చేయ‌కుండా ఉండేందుకు రాష్ట్రంలో రూ.2200 గ‌రిష్ఠ ధ‌ర‌గా తెలంగాణ ప్ర‌భుత్వం ఫిక్స్ చేసింది. అయితే పొరుగున ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఈ ధ‌ర‌ను రూ.2900గా ప్ర‌క‌టించింది. ప్రైవేటు ల్యాబ్స్‌లో టెస్టుల‌కు సంబంధించి ఇలా ర‌క‌రకాలుగా తేడాలు ఉన్న నేప‌థ్యంలో సుప్రీం కోర్టు సూచ‌న‌లు ఎలా పాటిస్తాయో చూడాలి. కరోనా భయంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి టెస్టులు చేయించుకునేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 

అమెరికాలో ఆ వృద్ధుడి ఆస్పత్రి బిల్లు రూ.9 కోట్లు 

అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. అక్కడ ఓ 70 ఏళ్ల వృద్దుడికి కరోనా వైరస్ సోకింది . ఆయన ఆస్పత్రిలో చేరి డిశ్చార్జ్ అయ్యాడు.  ఆసుపత్రిలో ఉన్న సమయంలో వృద్దుడి కుటుంబ సభ్యులు బిల్లులు చెల్లించారు. ఇంటికి వెళ్లిన వృద్దుడికి ఆసుపత్రి యాజమాన్యం ఫైనల్ బిల్లు పంపించింది. అంతే ఆసుపత్రి బిల్లు చూసిన కరోనా పేషంట్ కు దిమ్మతిరిగిపోయింది. కరోనా చికిత్సకు మీకు అయిన ఆసుపత్రి బిల్లు కేవలం రూ. 9 కోట్లు మాత్రమే అని 181 పేజీల బిల్లు పంపించారు. కరోనా తో పోరాటం చేసి బతికినందుకు ఈ బిల్లు చూసి నిజంగానే ఆయనకు చుక్కలు కనిపించాయి. 

అరుణాచల్, లద్దాఖ్, కార్గిల్‌లలో భూకంపం

అరుణాచల్, లద్దాఖ్, కార్గిల్‌లలో భూకంపం

   an hour ago


భారత్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. చైనా కంపెనీల తాజా రాగం

భారత్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. చైనా కంపెనీల తాజా రాగం

   3 hours ago


ఒక్క రోజులో 60 వేల కేసులు.. అల్లాడుతున్న అమెరికా

ఒక్క రోజులో 60 వేల కేసులు.. అల్లాడుతున్న అమెరికా

   3 hours ago


ఈసీ కీలక నిర్ణయాలు... కరోనా ఎఫెక్టే కారణమా?

ఈసీ కీలక నిర్ణయాలు... కరోనా ఎఫెక్టే కారణమా?

   9 hours ago


భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజులో 23వేలు, 442 మంది మృతి

భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజులో 23వేలు, 442 మంది మృతి

   10 hours ago


భారత్‌పై దుందుడుకు వైఖరి..  చైనా నిజ స్వరూపం ఇదే.. ట్రంప్‌ స్పష్టత

భారత్‌పై దుందుడుకు వైఖరి.. చైనా నిజ స్వరూపం ఇదే.. ట్రంప్‌ స్పష్టత

   10 hours ago


భారత్‌లో కరోనా బీభత్సం.. 30 రోజుల్లో 4 లక్షల కేసులు.. ఐదు రోజుల్లో లక్ష కేసులు

భారత్‌లో కరోనా బీభత్సం.. 30 రోజుల్లో 4 లక్షల కేసులు.. ఐదు రోజుల్లో లక్ష కేసులు

   04-07-2020


భారత్ వివాదాలను పెంచుకోదలుస్తోందా.. మోదీ వ్యాఖ్యకు చైనా ఖండన

భారత్ వివాదాలను పెంచుకోదలుస్తోందా.. మోదీ వ్యాఖ్యకు చైనా ఖండన

   04-07-2020


రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24 గంటల్లో 20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి

రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24 గంటల్లో 20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి

   04-07-2020


చైనా, పాక్‌ల నడ్డివిరిచిన భారత్.. విద్యుత్ పరికరాల దిగుమతిపై నిషేధం

చైనా, పాక్‌ల నడ్డివిరిచిన భారత్.. విద్యుత్ పరికరాల దిగుమతిపై నిషేధం

   04-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle