newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఆర్మీ, నేవీలలో కోవిడ్ 19 కేసులతో ఆందోళన

18-04-202018-04-2020 10:17:51 IST
Updated On 18-04-2020 10:31:36 ISTUpdated On 18-04-20202020-04-18T04:47:51.258Z18-04-2020 2020-04-18T04:47:39.461Z - 2020-04-18T05:01:36.316Z - 18-04-2020

ఆర్మీ, నేవీలలో కోవిడ్ 19 కేసులతో ఆందోళన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా కేసులు ఎవరినీ వదలడం లేదు. వృద్ధులే కాదు యువకులు, చిన్నారులను బలి తీసుకుంటోంది ఈ మహమ్మారి. గతంలో కంటే రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, యూపీ రాష్ట్రాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి.  ఒక్క ముంబై నగరంలోనే రెండువేలకు పైగా కేసులు నమోదకావడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఇండియా ఆర్మీని కూడా ఈ వైరస్ వదలడంలేదు.  లడక్ లో పనిచేసే ఇండియన్ ఆర్మీలో కొంతమందికి కరోనా సోకింది. 

ప్రభుత్వం ఇప్పటికే ఆర్మీలో పటిష్టమైన చర్యలు తీసుకుంది. విధి నిర్వహణలో భౌతిక దూరం అమలవుతూనే వుంది. దీంతో ఆర్మీలో వైరస్ కంట్రోల్ అయ్యింది.  అయితే, ఇప్పుడు మరో ప్రమాదం ముంచుకొచ్చింది.  కరోనా వైరస్ ఇండియన్ నేవి సిబ్బందికి కూడా సోకినట్టుగా వార్తలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ముంబై నేవల్ బేస్ లో పనిచేస్తున్న ఓ నేవి సిబ్బందికి ఏప్రిల్ 7 వ తేదీన కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతనికి చికిత్స అందిస్తున్నారు. 

అయితే, అతనితో కలిసి పనిచేసిన వ్యక్తులకు టెస్టులు నిర్వహించగా అందులో 20 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు నేవి అధికారులు ధృవీకరించారు.  దీంతో ఇండియన్ నేవీ అప్రమత్తం అయ్యింది.  సిబ్బందికి కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.  

దాదాపు 15 నుంచి 20మంది నేవీ సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. వీరంతా వైరస్ సోకే సమయానికి ఐఎన్ఎస్ యాంగ్రీ నివాస స్థావరాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరినీ ఐఎన్ హెచ్ఎస్ అశ్వినీ నేవీ ఆస్పత్రికి తరలించారు. నేవీలో వైరస్ బారిన పడ్డవారితో పాటు వారితో పాటు విధులు నిర్వర్తించిన సైనికులను కూడా గుర్తించే పనిలో పడ్డారు. 

ఇతర దేశాల్లోనూ...

కరోనా కేసులు ఇతర దేశాల్లోనూ నేవీ, ఆర్మీ సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నాయి. అమెరికాలో థియెడర్ రూజ్ వెల్ట్ విమాన వాహకనౌకలో 660 మందికి వైరస్ సోకింది. ఇటు ఫ్రాన్స్ విమాన వాహకనౌకలోనూ 1081 మందికి వైరస్ ఉందని గుర్తించారు. మన ఆర్మీలో 8మందికి వైరస్ సోకింది. భారత ఆర్మీలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎమర్జెన్సీ కానీ వివిధ కార్యక్రమాలు, శిక్షణ విభాగాల్లో ప్రయాణాలను వాయిదా వేశారు. 

 

 

 

కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   8 hours ago


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   10 hours ago


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   14 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   16 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   18 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   19 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   20 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle