newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

ఆర్మీ అధికారిణులకూ శాశ్వత కమిషన్ : సుప్రీం చారిత్రక తీర్పు

18-02-202018-02-2020 10:22:08 IST
2020-02-18T04:52:08.717Z18-02-2020 2020-02-18T04:51:52.483Z - - 05-08-2020

ఆర్మీ అధికారిణులకూ శాశ్వత కమిషన్ : సుప్రీం చారిత్రక తీర్పు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్‌ హోదా ఇవ్వాలని, మహిళా అధికారులు కమాండ్‌ పోస్టింగ్‌కూ అర్హులని సర్వోన్నత న్యాయస్ధానం సోమవారం చారిత్రక తీర్పు వెలువరించింది. సర్వీసులో ఎంతకాలం ఉన్నారనే దానితో సంబంధం లేకుండా మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్‌ హోదా వర్తిస్తుందని తీర్పులో పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందిస్తూ ఆర్మీలో మహిళా అధికారులందరికీ మూడునెలల్లోగా శాశ్వత కమిషన్‌ హోదాను మంజూరు చేయాలని ఆదేశించింది. పురుషుల మాదిరే మహిళా అధికారుల నియామక నిబంధనలు ఒకేలా ఉండాలని తేల్చిచెప్పింది. 

ఆర్మీ మహిళల పరిమితుల గురించి పలు అంశాలతో కూడిన జాబితాను కేంద్రప్రభుత్వం అపెక్స్ కోర్టుకు సమర్పించింది. శారీరక బలహీనత, శారీరకపరంగా మహిళలకు ఉన్న పరిమితులు వంటివి కూడా మహిళాధికారుల సర్వీసు కొనసాగింపు‌నకు అవరోధాలుగా ఉంటున్నాయని ఈ నోట్‌లో కేంద్రం పేర్కొంది. ప్రధానంగా సైన్యంలో గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారే వివిధ ర్యాంకులలో కొనసాగుతున్నారని, వారిపై వున్న వివిధ సామాజిక, సాంస్కృతిక ప్రభావాల కారణంగా మహిళాధికారులను ఆమోదించే మానసిక చైతన్యం సైనిక యూనిట్లలో లేదని ఈ నోట్ పేర్కొంది.  

స్త్రీపురుషుల మధ్య శారీరక వ్యత్యాసాల కారణంగా పురుషులతో పోలిస్తి సైనిక మహిళల శారీరక సామర్థ్యం తక్కువ ప్రమాణాలతో కూడి ఉంటోందని, అందుకనే మహిళాధికారుల శారీరక సామర్థ్యం సైనిక యూనిట్లలో ఇప్పటికీ సవాలు విసురుతోందని కేంద్ర ప్రభుత్వం సమర్పించిన నోట్ తెలిపింది. ఈ నోట్ సారాంశాన్ని  సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. 

శారీరక లక్షణాలను కారణంగా చూపుతూ వారికి శాశ్వత కమిషన్‌ హోదా నిరాకరించడాన్ని కోర్టు తప్పుపడుతూ లింగ అసమానత్వపు ధోరణిని కేంద్రం విడనాడాలని హితవు పలికింది. మహిళల శారీరక లక్షణాలతో వారి సామర్ధ్యాన్ని అంచనావేయడం మహిళలకు, సైన్యానికీ అవమానకరమని  జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళా అధికారులను కమాండ్‌ పోస్టులకు నిరాకరించడం పక్షపాతపూరిత నిర్ణయమని, సమానత్వ హక్కుకు విరుద్ధమని స్పష్టం చేసింది.

సైనికాధికారులు యుద్ధరంగంలో అందరికంటే ముందుండి తమ నియంత్రణలోని పురుషులకు నాయకత్వం వహించాల్సి  ఉంటుందని, అందుకే యుద్దరంగంలో ప్రత్యక కర్తవ్యాలు నెరవేర్చడానికి తగిన  శారీరక సంపత్తి సైనిక అధికారిణులకు ఉండాలని కేంద్రం నోట్‌లో పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా అభ్యంతరం తెలిపింది.

ఢిల్లీ హైకోర్టు తీర్పును ఎత్తిపడుతూ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సైన్యంలో పురుషులుకు, మహిళలకు మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వివక్ష తొలిగిపోనుందని భావిస్తున్నారు.

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   43 minutes ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   5 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   9 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle