newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

ఆర్థిక సునామీ భారత్, చైనాలను తాకదు: ఐరాస

01-04-202001-04-2020 13:27:17 IST
2020-04-01T07:57:17.096Z01-04-2020 2020-04-01T07:57:14.129Z - - 05-08-2020

ఆర్థిక సునామీ భారత్, చైనాలను తాకదు: ఐరాస
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనా, భారతదేశం మినహా అభివృద్ది చెందిన, చెందుతున్న దేశాలన్నీ ఆర్థిక మాంద్యం బారిన పడితీరతాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. నేక అభివృద్ధి చెందుతున్నదేశాలలో ఆరోగ్య సంక్షోభం ముదరనుందని తెలిపింది. ఆరోగ్యం సంక్షోభం వస్తే, ఈ దేశాలు మరింత ఆర్థిక కష్టాల్లో కూరకుపోతాయని అంచనావేసింది. ఆర్థిక  ఆరోగ్య సంక్షోభం కలయిక చాలా దుర్మార్గంగా వుంటుందని వ్యాఖ్యానించింది.  కాబట్టి ఆ దేశాలలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ,  సేవలను బలోపేతం చేసే మార్గాలను అన్వేషించాలని పేర్కొంది. 

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని అంచనా వేస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మాంద్యంలోకి జారుకోనుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. కోవిడ్‌-19 సృష్టించిన విలయానికి ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మంది  అభివృద్ధి చెందుతున్న దేశాలలో అపూర్వమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నందున ఈ ముప్పు ఏర్పడనుందని తెలిపింది. 

ఈ సంక్షోభం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆదుకోవాలంటే 2.5 ట్రిలియన్‌ డాలర్ల సహాయ ప్యాకేజీ అవసరమని ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి (యుఎన్‌సిటిఎడి) కాన్ఫరెన్స్‌ అంచనావేసింది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాలకు కోవిడ్‌-19 షాక్‌’ పేరుతో ఒక నివేదికను సంస్థ విడుదల చేసింది. ఎక్కువగా వినియోగ వస్తువుల ఎగుమతులపై ఆధారపడిన ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు మళ్లీ గాడిలో పడాలంటే వచ్చే రెండేండ్లలో రెండు నుంచి మూడు ట్రిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు అవసరమవుతాయని తెలిపింది. 

అంతేకాదు అనేక అభివృద్ధి చెందుతున్నదేశాలలో ఆరోగ్య సంక్షోభం ముదరనుందని తెలిపింది. ఆరోగ్యం సంక్షోభం వస్తే, ఈ దేశాలు మరింత ఆర్థిక కష్టాల్లో కూరకుపోతాయని అంచనావేసింది. ఆర్థిక  ఆరోగ్య సంక్షోభం కలయిక చాలా దుర్మార్గంగా వుంటుందని వ్యాఖ్యానించింది.  కాబట్టి ఆ దేశాలలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ,  సేవలను బలోపేతం చేసే మార్గాలను అన్వేషించాలని పేర్కొంది. 

2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పోల్చితే, మహమ్మారి కరోనా ఆర్ధిక షాక్ అభివృద్ధి చెందుతున్న దేశాలను భారీగా తాకనుందని యుఎన్‌సిటిఎడి తెలిపింది. ప్రపంచ ఆర్ధికవ్యవస్థ ఈ ఏడాది ట్రిలియన్ డాలర్లలో ప్రపంచ ఆదాయాన్ని కోల్పోతుందని తెలిపింది.  చైనా, భారతదేశం మినహా  అభివృద్ధి చెందుతున్న దేశాలకు తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తుందని పేర్కొంది.  

కొనసాగుతున్న  ఆర్ధిక పతనాన్ని ఊ హించడం చాలా కష్టం, కానీ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు మెరుగుపడకముందే పరిస్థితులు మరింత దిగజారిపోతాయనేస్పష్టమైన సూచనలు ఉన్నాయని  యుఎన్‌సిటిఎడి సెక్రటరీ జనరల్ ముఖిసా కిటుయ్ చెప్పారు. ఈ సంవత్సరం దూసుకుపోతున్న ఆర్థిక సునామీ నేపథ్యంలో రాబోయే రెండేళ్లలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2-3 ట్రిలియన్ డాలర్ల రెస్క్యూ ప్యాకేజీని కేటాయించాలన్నారు. 

అలాగేమాంద్యాన్ని నివారించేందుకు అభివృద్ధి చెందిన దేశాలతోపాటు చైనా కూడా తమ ఆర్థిక వ్యవస్థల్లోకి భారీ ఎత్తున నిధులను కుమ్మరిస్తున్నాయని, జీ 20 కూటమి దేశాలు కూడా ఇటీవలే తమ ఆర్థిక వ్యవస్థల్లోకి 5 ట్రిలియన్‌ డాటర్లను పంపింగ్‌ చేయాలని నిర్ణయించినట్లు గుర్తుచేసింది. ఇది అసాధారమైన సంక్షోభానికి అసాధారణమైన ప్రతిస్పందన లాంటిదని పేర్కొంది. 

‘ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుండటంతో మాంద్యంలోకి జారుకుంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది చాలా ఇబ్బందికరమైన అంశం. అయితే ఈ మ్యాంద్యం ప్రభావం ఇండియా, చైనాలపై ఉండకపోవచ్చు అని  వెల్లడించింది.

ఇందుకు నాలుగు పాయింట్లు రికవరీ ప్రణాళికను  ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ప్రతిస్పందనగా 2009 కేటాయింపులకు మించిన ఆర్థిక కేటాయింపులు ప్రస్తుతం జరగాలి. బలహీ ఆర్థికవ్యవస్థలకు ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను అందించాలి. రెండవ చర్యగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ అప్పులో సగం రద్దు చేసిన మాదిరిగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశాలకు ఆర్థిక వ్యవస్థలకు రుణాలను రద్దు చేయాలి. లేదా గణనీయంగా తగ్గించాలి.  

మూడవ చర్యగా పేద దేశాల్లో అత్యవసర ఆరోగ్య సేవలు, సంబంధిత సామాజిక సహాయ కార్యక్రమాలకుగాను 500 బిలియన్ల పెట్టుబడులను కల్పించాలి. చివరగా, ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి ఇప్పటికే పెరుగుతున్న మూలధన ప్రవాహాన్ని తగ్గించడానికి నియంత్రణలను ఆయా దేశాలు అమలు చేయాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   2 hours ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   8 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   9 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   9 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   04-08-2020


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle