newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ఆర్థిక సర్వే: దేశ ఆర్థిక స్తబ్ధత నుంచి బయటపడేనా?

01-02-202001-02-2020 08:48:55 IST
Updated On 01-02-2020 12:09:18 ISTUpdated On 01-02-20202020-02-01T03:18:55.927Z01-02-2020 2020-02-01T03:18:47.029Z - 2020-02-01T06:39:18.478Z - 01-02-2020

ఆర్థిక సర్వే: దేశ ఆర్థిక స్తబ్ధత నుంచి బయటపడేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇవాళ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2020-2021 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అనేక అంశాలు తెరమీదకు వస్తున్నాయి. దేశ జీడీపీ వృద్ధిరేటు 2020–21లో 6నుంచి 6.5 శాతానికి పుంజుకోవచ్చని అంచనా వేసింది.

ఆర్థిక సర్వే ప్రకారం సంస్కరణలను అమలుచేయడం, భారత్‌ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా మార్చాలని.. ఆహార సబ్సిడీలను తగ్గించుకోవాలని.. నాణ్యమైన మౌలిక సదుపాయాలకు భారీగా పెట్టుబడులు అవసరమని.. రియల్ ఎస్టేట్ రంగాన్ని పటిష్టం చేయాలని ఆర్థిక సర్వే సూచించింది. శుక్రవారం ఆర్థిక సర్వే నివేదికను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు ముందుంచారు.  

2019–20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు 3.3 శాతానికి పరిమితం చేస్తాఆర్థిక మంత్రి సీతారామన్‌ పేర్కొన్నారు. అయితే వాస్తవిక పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి. కార్పొరేట్‌ పన్ను కోత, ఇతర పన్నుల వసూళ్లు తక్కువగా ఉండడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్యలోటు 3.8 శాతానికి చేరనుందని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యలోటు తగ్గడానికి కొన్ని మార్గాలను సూచించారు. 

రూ.1.84 లక్షల కోట్ల మేర ఉన్న ఆహార సబ్సిడీలను  తగ్గించుకోగలిగితే ద్రవ్యలోటు విషయంలో ప్రభుత్వానికి ఎంతో వెసులుబాటు లభిస్తుందని సర్వే పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నాక ప్రభుత్వం తన  ఖర్చులను స్థీరీకరించుకోవచ్చంటోంది.

2024–25 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్లు అంటే.. రూ.350 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరేందుకు మౌలిక రంగంలో కనీసం 1.4 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమని సర్వే తెలిపింది. మౌలిక రంగంలో పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థకు ఎంతో అవసరం. విద్యుత్‌ కోతలు, చాలీ చాలని రవాణా సదుపాయాలు అధిక వృద్ధి సాధన దిశగ అవరోధంగా నిలుస్తాయి.

సాఫీగా, వేగవంతమైన వృద్ధి కోసం భారత్‌ నాణ్యమైన సదుపాయాల కల్పనకు సకాలంలో తగినన్ని పెట్టుబడులు పెట్టాలి అని ఆర్థిక సర్వే తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) దేశ ఆర్థిక వ్యవస్థలో పరిణామ పరంగా చిన్నగా ఉండడాన్ని సర్వే ప్రస్తావించింది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థాయికి వాటిని పటిష్టం చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా పేర్కొంది.

ప్రభుత్వరంగ బ్యాంకులు సమర్థంగా లేకపోతే అది ఆర్థిక వ్యవస్థను వినూత్నమైన అవకాశాలను అందుకోలేకపోవచ్చని, బ్యాంకుల్లో అన్ని కార్యకలాపాలకు ఫైనాన్షియల్‌ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించింది. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణతో మెరుగైన ఫలితాలురావచ్చని సర్వే చెబుతోంది. దేశంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవాల్సిన అవసరం ఉందని సర్వే పేర్కొంది.

అమ్మకం కాని ఇళ్లు అధిక సంఖ్యలో ఉండడంతో వీటిని తగ్గించుకునేందుకు నిర్మాణదారులు కొంత మేర ధరలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే సూచించింది.2011-12 నుంచి 2017-18 మధ్య కాలంలో దేశంలో 2.62 కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం 4.1 శాతంగా ఉండొచ్చు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది ఎక్కువ. హోటల్ లైసెన్స్ వ్యవస్థను ప్రక్షాళలన చేయాలని సర్వే సూచించింది. దేశంలో ఒక హోటల్‌ను ప్రారంభించడం కన్నా ఒక తుపాకీ లైసెన్సు సంపాదించడం సులువని సర్వే పేర్కొంది. ఢిల్లీలో పిస్తోల్‌ కలిగి ఉండేందుకు కావాల్సిన పత్రాల కన్నా హోటెల్‌ తెరవాలంటే ఎక్కువ డాక్యుమెంట్లు అవసరమని తెలిపింది.

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   16 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle