newssting
BITING NEWS :
*ఇవాళ గురుపూర్ణిమ.. చంద్రగ్రహణం **దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

ఆరు నెలల్లో కోటి కేసులు.. 5 లక్షల మృతులు.. ప్రపంచాన్ని వీడని కరోనా షాక్

28-06-202028-06-2020 10:44:51 IST
2020-06-28T05:14:51.500Z28-06-2020 2020-06-28T05:14:42.249Z - - 05-07-2020

ఆరు నెలల్లో కోటి కేసులు.. 5 లక్షల మృతులు.. ప్రపంచాన్ని వీడని కరోనా షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సరిగ్గా 6 నెలలు, 213 దేశాలు.. కోటి కేసులు, దాదాపు 5 లక్షల మృతులు.. ఇదీ కోవిడ్‌-19 సృష్టిస్తున్న అల్లకల్లోలం. కంటికి కనిపించని సూక్ష్మ క్రిమి చైనాలో వూహాన్‌లో పుట్టి యూరప్‌ దేశాల మీదుగా విస్తరించి అమెరికాలో ఉగ్రరూపం దాల్చి ప్రస్తుతం భారత్‌ని కూడా భయపెడుతోంది. శనివారం రాత్రికి ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,00,00,418కు, బాధితుల మరణాల సంఖ్య 4,98,952కు చేరాయి.  

ఒక వైరస్‌ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఒక వైరస్‌ అందరికీ కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ప్రపంచానికి తాళం వేసి ఆర్థికంగా అతలాకుతలం చేస్తోంది. 2019 డిసెంబర్‌ 31న సార్స్‌ తరహా వైరస్‌ కేసులు చైనాలోని వూహాన్‌లో వెలుగులోకి వస్తున్నాయని అందరికీ తెలిసినప్పుడు ఇదేదో మామూలు వైరస్‌ అనుకున్నారు. అంతకంతకూ ఆ వైరస్‌ శరవేగంగా విస్తరించింది. అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికింది. తొలి రెండు, మూడు నెలలు చైనాలోని వూహాన్‌తో పాటుగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, యూకే దేశాలు అల్లాడిపోయాయి. ఆ తర్వాత యూరప్‌లో కొన్ని దేశాలు కోలుకున్నప్పటికీ అమెరికాను కేసుల భయం వెంటాడుతూనే ఉంది. 

కరోనాతో వణుకుతున్న దేశాలు

అగ్రరాజ్యం అమెరికాని కరోనా అసాధారణ రీతిలో కాటేసింది. 25 లక్షలకు పైగా కేసులు లక్షా 25 వేలకు పైగా మృతులతో ఆ దేశం అగ్రభాగంలో ఉంది. ఇప్పటికీ అమెరికాలో రోజుకి సగటున 40 వేల మందికి కోవిడ్‌ –19 సోకుతోంది. బ్రెజిల్, రష్యా, భారత్, ఇరాన్, మెక్సికో, చిలీ, పెరూ, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ , ఇండోనేసియా దేశాల్లోనూ కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. న్యూజిలాండ్‌ సహా 15 దేశాలు ఇప్పటివరకు కరోనాని జయించామని చెప్పుకుంటున్నప్పటికీ మళ్లీ ఆయా దేశాల్లో రాదని చెప్పలేని పరిస్థితి. చైనాని కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ భయపెడుతోంది.  

ప్రాణాపాయం లేదు.. కానీ

కరోనా వైరస్‌ విస్తరణ దడ పుట్టించేలా ఉన్నప్పటికీ, వేరే ఇతర వ్యాధులు ఉన్నవారికే ఇది అత్యంత ప్రమాదకరం. మిగిలిన వారికి కేవలం ఇదొక ఫ్లూ లాంటి జ్వరం మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. కొన్ని ముందు జాగ్రత్త చర్యలతో ఈ వైరస్‌ను అరికట్టవచ్చునని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ అంచనాల ప్రకారం మొత్తం కేసుల్లో ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే వ్యాధి అదుపులోకి వచ్చే కేసులు 80% వరకు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరినా కోలుకున్న కేసులు 15 శాతం ఉంటే, వాటిలో విషమంగా మారిన కేసులు 5శాతం. ఆ 5శాతం కేసుల్లోనూ సగం మందికే ప్రాణాలకు ముప్పు ఉంటోంది.

ఇకపోతే గత వారంలో లక్ష పాజిటివ్ కేసులను నమోదు చేసిన భారత్ ఇంతవరకు 5 లక్షల పాజిటివ్ కేసులను ధృవీకరించింది. విశ్వమహమ్మారికి ఇది భారత్ చేర్పుగా చెప్పుకోవచ్చు. దేశంలోని 8 రాష్ట్రాలు మాత్రమే 87 శాతం కోవిడ్-19 మరణాలను నమోదు చేశాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్టరాలు దేశంలోని యాక్టివ్ కేసుల్లో 87 శాతాన్ని నమోదు చేయగా, దేశంలోని మొత్తం కరోనా మృతుల్లో 87 శాతాన్ని ఈ ఎనిమిది రాష్ట్రాలే  నమోదు చేయడం గమనార్హం. 

అరుణాచల్, లద్దాఖ్, కార్గిల్‌లలో భూకంపం

అరుణాచల్, లద్దాఖ్, కార్గిల్‌లలో భూకంపం

   an hour ago


భారత్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. చైనా కంపెనీల తాజా రాగం

భారత్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. చైనా కంపెనీల తాజా రాగం

   3 hours ago


ఒక్క రోజులో 60 వేల కేసులు.. అల్లాడుతున్న అమెరికా

ఒక్క రోజులో 60 వేల కేసులు.. అల్లాడుతున్న అమెరికా

   3 hours ago


ఈసీ కీలక నిర్ణయాలు... కరోనా ఎఫెక్టే కారణమా?

ఈసీ కీలక నిర్ణయాలు... కరోనా ఎఫెక్టే కారణమా?

   9 hours ago


భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజులో 23వేలు, 442 మంది మృతి

భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజులో 23వేలు, 442 మంది మృతి

   10 hours ago


భారత్‌పై దుందుడుకు వైఖరి..  చైనా నిజ స్వరూపం ఇదే.. ట్రంప్‌ స్పష్టత

భారత్‌పై దుందుడుకు వైఖరి.. చైనా నిజ స్వరూపం ఇదే.. ట్రంప్‌ స్పష్టత

   10 hours ago


భారత్‌లో కరోనా బీభత్సం.. 30 రోజుల్లో 4 లక్షల కేసులు.. ఐదు రోజుల్లో లక్ష కేసులు

భారత్‌లో కరోనా బీభత్సం.. 30 రోజుల్లో 4 లక్షల కేసులు.. ఐదు రోజుల్లో లక్ష కేసులు

   04-07-2020


భారత్ వివాదాలను పెంచుకోదలుస్తోందా.. మోదీ వ్యాఖ్యకు చైనా ఖండన

భారత్ వివాదాలను పెంచుకోదలుస్తోందా.. మోదీ వ్యాఖ్యకు చైనా ఖండన

   04-07-2020


రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24 గంటల్లో 20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి

రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24 గంటల్లో 20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి

   04-07-2020


చైనా, పాక్‌ల నడ్డివిరిచిన భారత్.. విద్యుత్ పరికరాల దిగుమతిపై నిషేధం

చైనా, పాక్‌ల నడ్డివిరిచిన భారత్.. విద్యుత్ పరికరాల దిగుమతిపై నిషేధం

   04-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle