newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

ఆప‌రేష‌న్ బంద‌ర్ .. ఎందుకింత రహస్యం!

24-06-201924-06-2019 06:57:29 IST
Updated On 24-06-2019 12:07:03 ISTUpdated On 24-06-20192019-06-24T01:27:29.178Z23-06-2019 2019-06-23T16:51:15.396Z - 2019-06-24T06:37:03.000Z - 24-06-2019

ఆప‌రేష‌న్ బంద‌ర్ .. ఎందుకింత రహస్యం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పుల్వామా దాడి త‌ర్వాత మోడీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన బాలాకోట్ దాడులు మొన్న‌టి ఎన్నికల్లో న‌రేంద్ర మోడీ మ‌రోసారి అధికారంలోకి రావ‌డానికి బాగా ఉప‌యోగ‌ప‌డ్డాయి. దేశ ర‌క్ష‌ణ త‌మ‌దే బాధ్య‌త‌న్న మోడీ ప్ర‌చారం జ‌నానికి బాగా న‌చ్చి, ఓట్ల వ‌ర్షం కురిపించింది. అయితే ఈ బాలాకోట్ దాడుల గురించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఆల‌స్యంగా బ‌య‌ట‌పెట్టారు. 

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 26వ తేదీ, తెల్ల‌వారు జామున 3.30 నిమిషాల‌కు 12 మిరాజ్ యుద్ధ విమానాలు, స‌రిహద్దు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి ప్ర‌వేశించి ఖైబ‌ర్ క‌నుమ‌ల్లోని బాలాకోట్ ఉగ్ర‌వాద శిబిరాల మీద బాంబుల వ‌ర్షం కురిపించాయి. దాడికి ముందు ప‌క్కా వ్యూహ ర‌చ‌న చేసిన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారుల‌, ఈ దాడికి ఆప‌రేష‌న్ బంద‌ర్ అనే పేరు పెట్టార‌ట‌. ఇన్నాళ్ల పాటు ఈ కోడ్ నేం ర‌హ‌స్యంగా ఉంచిన వాయుసేన అధికారులు తాజాగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 

అయితే బంద‌ర్ అనే పేరు ఎందుకు పెట్టార‌న్న‌దీ స్ప‌ష్టంగా చెప్ప‌లేదు. ఆర్మీ విశ్లేష‌కుల అభిప్రాయం ప్ర‌కారం, రామ రావ‌ణ యుద్ధ స‌మ‌యంలో రాముని ఆజ్ఞ‌తో ర‌హ‌స్యంగా లంక‌లో చొరబ‌డిన  హ‌నుమంతుడు, లంకా ద‌హ‌నం చేసిన శ‌త్రువుల‌ను దారుణంగా దెబ్బ‌తీశాడ‌నీ, బాలాకోట్ దాడులు కూడా ర‌హ‌స్యంగానే జ‌రగడం వ‌ల్లే ఆప‌రేషన్ బంద‌ర్ అని పేరు పెట్టిన‌ట్లు భావిస్తున్నారు. 

ఇక ఈ దాడిలో వాయుసేన‌కు చెందిన నెంబ‌ర్ 7, నెంబ‌ర్ 9 స్క్వాడ్రెన్ ద‌ళానికి చెందిన యుద్ధ విమాన‌లు పాల్గొన్నాయ‌ని కూడా వాయుసేన అధికారులు చెప్పుకొచ్చారు. త్వ‌ర‌లోనే ఈ దాడిలో పాల్గొని విజ‌య‌వంతంగా ఉగ్ర‌వాద శిబిరాల‌ను ధ్వంసం చేసిన పైలెట్ల‌కు వాయుసేన మెడ‌ల్స్ అందిస్తామ‌ని కూడా ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ అధికారులు అంటున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle