newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఆప్ హ‌వా మామూలుగా ఉండ‌దట‌..!

05-02-202005-02-2020 08:02:57 IST
2020-02-05T02:32:57.818Z05-02-2020 2020-02-05T02:32:50.498Z - - 08-08-2020

ఆప్ హ‌వా మామూలుగా ఉండ‌దట‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ రాజ‌ధాని ఢిల్లీ ఎన్నిక‌ల‌పై యావ‌త్ దేశం దృష్టి పెట్టింది. ఢిల్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఎటువైపు నిలుస్తార‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ నెలకొంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ఢిల్లీని కూడా కైవ‌సం చేసుకోవాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. మ‌రోవైపు అధికారాన్ని తిరిగి నిల‌బెట్టుకోవ‌డానికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బాగానే ప్ర‌య‌త్నిస్తోంది. ఇక ఈసారి ఢిల్లీలో అధికారాన్ని చేప‌ట్టి పార్టీకి పున‌ర్వైభ‌వం తేవాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ, ఢిల్లీలో ఆప్‌, బీజేపీ మ‌ధ్యే హోరాహోరీ పోరు నెల‌కొంది.

ఢిల్లీ ప్రజ‌ల తీర్పు చాలా విల‌క్ష‌ణ‌గా ఉంటుంది. 2013 ఎన్నిక‌ల్లో మొత్తం 70 సీట్ల‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి 28, బీజేపీకి 32, కాంగ్రెస్‌కు 8 సీట్లు ద‌క్కాయి. బీజేపీకి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు స‌రిప‌డా సీట్లు లేక‌పోవ‌డంతో కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో మొద‌టిసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్య‌క్షుడు అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు.

కేవ‌లం 49 రోజులే పాలించిన ఆయ‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. కానీ, ఆ 49 రోజుల పాల‌నే ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు బాగా న‌చ్చింది. ఏడాది త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌ల్లో కేజ్రీవాల్‌కు తిరుగులేని విజయాన్ని క‌ట్ట‌బెట్టారు. మొత్తం 70 సీట్ల‌లో 67 సీట్లను ఆప్ గెలుచుకోగా, బీజేపీ కేవ‌లం 3 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. కాంగ్రెస్‌కు ఒక్క సీటూ ద‌క్క‌లేదు.

నాలుగేళ్ల పాల‌న త‌ర్వాత కేజ్రీవాల్‌కు ఢిల్లీ ప్ర‌జ‌ల్లో మంచి ఇమేజ్ వ‌చ్చింది. కానీ, 2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అనూహ్యంగా ఢిల్లీలోని అన్ని ఎంపీ స్థానాల‌ను బీజేపీ గెలుచుకుంది. దీంతో ఈసారి ఢిల్లీ అసెంబ్లీలోనూ క‌చ్చితంగా కాషాయ జెండా ఎగురుతుంద‌ని బీజేపీ న‌మ్మ‌కంగా ఉంది. అయితే, స‌ర్వేలు మాత్రం బీజేపీ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లుతున్నాయి. మ‌ళ్లీ అర‌వింద్ కేజ్రీవాల్‌కే ఢిల్లీ ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట‌బోతున్నార‌ని చెబుతున్నాయి. ఇక ఈ స‌ర్వేల్లో కాంగ్రెస్ ఊసే క‌నిపించ‌డం లేదు.

టైమ్స్ నౌ నిర్వ‌హించిన స‌ర్వేలో ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 52 శాతం ఓట్ల‌తో ఆమ్ ఆద్మీ పార్టీ 54 నుంచి 60 సీట్లు గెలుచుకుంటుంద‌ని తేలింది. బీజేపీ 34 శాతం ఓట్ల‌తో కేవ‌లం 10 నుంచి 14 సీట్లు మాత్ర‌మే గెలుచుకుంటుందని, కాంగ్రెస్ కేవ‌లం నాలుగు శాతం ఓట్ల‌తో 2 సీట్ల లోపే గెలుచుకుంటుంద‌ని అంచ‌నా వేసింది.

మ‌రో సంస్థ న్యూస్ ఎక్స్ జ‌రిపిన స‌ర్వేలోనూ ఆప్‌దే విజ‌యం అని తేలింది. ఆప్ ఈసారి 53 - 56 సీట్లు గెలుస్తుంద‌ని, బీజేపీ 12 - 15 సీట్లు గెలుచుకోవ‌చ్చ‌ని చెప్పింది. మిగ‌తా సంస్థ‌ల స‌ర్వేల్లోనూ ఇవే ఫ‌లితాలు వ‌స్తున్నాయి.

ముఖ్యంగా అర‌వింద్ కేజ్రీవాల్ పాల‌న ప‌ట్ల 50 శాతానికి పైగా డిల్లీ ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నార‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఐదేళ్ల ప‌ద‌వీకాలంలో కేజ్రీవాల్ విద్యా, వైద్యానికి పెద్ద పీట వేశారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, ఆసుప‌త్రుల‌ను ఎంతో మెరుగుప‌రిచారు. మ‌హిళా ర‌క్ష‌ణ‌కు గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకున్నారు.

ప్ర‌జ‌ల‌కు క‌నీస అవ‌స‌రాలు మెరుగ్గా అందేలా చూసుకున్నారు. అవినీతి లేని పాల‌న అందించార‌ని భావ‌న ప్ర‌జ‌ల్లో నెల‌కొంది. దీంతో మెజారిటీ ప్ర‌జ‌లు ఆప్‌కే ప‌ట్టం క‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌ర్వేలు చెబుతున్నాయి.

అయితే, ఎనిమిది నెల‌ల క్రితం జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఏక‌ప‌క్షంగా బీజేపీ వైపు నిలిచిన ఢిల్లీవాసులు ఇప్పుడు ఆప్ వైపు చూడ‌టం ఆస‌క్తిక‌రంగా ఉంది. సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్య‌తిరేకంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేస్తున్నారు. అర‌వింద్ కేజ్రీవాల్ సీఏఏ, ఎన్ఆర్‌సీని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.

సీఏఏ త‌మ‌కు మేలు చేస్తుంద‌ని బీజేపీ భావిస్తోంది. అయితే, ఢిల్లీ వాసులు మాత్రం అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీఏఏను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఓట్లు వేసే అవ‌కాశాలు చాలా త‌క్కువే అని సర్వేలు చెబుతున్నాయి.

కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   9 hours ago


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   12 hours ago


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   16 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   18 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   20 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   20 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   21 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle