newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ఆదివారం దేశవ్యాప్తంగా జనతా కర్ప్యూ.. జాతికి మోదీ సూచన

20-03-202020-03-2020 07:03:46 IST
2020-03-20T01:33:46.931Z20-03-2020 2020-03-20T01:33:43.803Z - - 03-08-2020

ఆదివారం దేశవ్యాప్తంగా జనతా కర్ప్యూ.. జాతికి మోదీ సూచన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారత దేశవ్యాప్తంగా ఈ నెల 22న అంటే ఆదివారం జనతా కర్ప్యూను స్వచ్చందంగా పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ దేశప్రజలకు పిలుపునిచ్చారు. కరోనావైరస్‌ నిరోధానికి తన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి జాతిని ఉద్దేశించి గురువారం రాత్రి ప్రసంగించిన ప్రధాని మోదీ ఆదివారం ఉదయం 7 గంటలనుంచి రాత్రి 9 గంటలవరకు స్వచ్చందంగా కర్ప్యూ పాటించి ఇళ్లలోనే ఉండిపోవాలని కోరారు. కరోనాకు వ్యతిరేకంగా భారతీయలు స్వయం నియంత్రణకు ఇదొక మహా సంకేతంగా నిలబడుతుందని మోదీ పేర్కొన్నారు. ఈ జనతా కర్ప్యూని ఎందుకు పాటించాలో మోదీ మాటల్లోనే చెప్పాలంటే...

''నేను ప్రతిఒక్క భారతీయ పౌరుడి నుంచి ఒక మద్ధతును కోరుతున్నాను. అదే ‘జనతా కర్ఫ్యూ’ .. ప్రజల కర్ఫ్యూ.  ‘ప్రజల కర్ఫ్యూ’ అంటే ప్రజల ద్వారా ప్రజలే విధించుకున్న కర్ఫ్యూ.  ఈ ఆదివారం(మార్చి 22)వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పౌరులందరూ ‘జనతా కర్ఫ్యూ’ను పాటించాలి.  ఈ సమయంలో మనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లకూడదు.  రోడ్ల మీదకి రాకూడదు.  వీధుల్లో సంచరించరాదు.  అత్యవసరమైన పనులకు మాత్రమే మార్చి 22న ప్రజలు బయటకు వెళ్లాలి.  మార్చి 22వ తేదీన మనం పాటించే ఈ సంయమనం, చేసే ప్రయత్నం, దేశ సంక్షేమానికి చేపట్టిన సంకల్పానికి ప్రతీకగా నిలిచిపోతుంది. మార్చి 22న విధించుకునే ప్రజా కర్ఫ్యూ విజయం, దాని నుంచి నేర్చుకున్న అనుభవాలు మున్ముందు రాబోయే సవాళ్లకు మనల్ని సంసిద్ధుల్ని చేస్తాయి'' అని మోదీ చెప్పారు. 

''దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నింటికీ నా మనవి ఏమిటంటే,  ప్రజా కర్ఫ్యూ  అమలుకు సారథ్యం వహించాలి.  ఇందుకోసం  ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ల సేవలతో సంబంధాలున్న యువతీ యువకులు, పౌర సమాజం, ఇతర సంస్థలు అన్నింటికీ నేను చేసే మనవి ఏమిటంటే.. ఇప్పటి నుంచి రాబోయే రెండు రోజులు అంటే శుక్రవారం, శనివారం ప్రజా కర్ఫ్యూ ను గురించి ప్రజలలో చైతన్యాన్ని కలుగజేయాలి.  అందుకు వారిని సంసిద్ధులను చేయాలి.  అవసరమైతే.. ప్రతి ఒక్క వ్యక్తి కనీసం 10 మందికి ఫోన్ చేసి కరోనా వైరస్ నుంచి తప్పించుకునే ఉపాయాలను వివరించాలి.  అలాగే.. జనతా కర్ఫ్యూ గురించి కూడా వివరించాలి'' అని మోదీ తెలిపారు.

''ఈ జనతా కర్ఫ్యూ అనేది మనకు, మనదేశానికి ఒక పరీక్షా సమయం లాంటిది.  ఇదే సమయంలో ప్రపంచ స్థాయిలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారితో పోరాటం చేయడానికి భారత్ ఏ మాత్రం సంసిద్ధంగా ఉందనే  అంశాన్ని తెలుసుకోవాల్సిన తరుణమిది.  మీ ప్రయత్నాలు ఈ దిశలో సాగుతుండగా.. ప్రజా కర్ఫ్యూ రోజున మార్చి 22న మీ నుంచి మరొక సహకారం నేను పొందగోరుతున్నాను'' అని మోదీ జాతికి విజ్ఞప్తి చేశారు.

''గత రెండు నెలలుగా లక్షలాది మంది సిబ్బంది ఆస్పత్రులలో, విమానాశ్రయాలలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.  వారు డాక్టర్లు కావచ్చు,  నర్సులు కావచ్చు, ఆస్పత్రి సిబ్బంది కావచ్చు, సఫాయి కర్మచారి సోదర సోదరీమణులు, ఎయిర్ లైన్స్ సిబ్బంది, ప్రభుత్వోద్యోగులు, ప్రసార మాధ్యమాల సిబ్బంది, రైల్వే సిబ్బంది, బస్సు, ఆటోరిక్షా లాంటి సేవలకు సంబంధించిన వ్యక్తులు, హోం డెలివరీ చేసే వారు, వీరంతా తమ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా, ఇతరుల సేవలో నిమగ్నులై ఉన్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో వీరు చేసే సేవలు అసాధారణమైనవి.  వీళ్లకు కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉంది.  అయినప్పటికీ వీరు తమ కర్తవ్య నిర్వహణలో రేయింబవళ్ళు నిమగ్నమై ఉన్నారు.  పరోపకార పరాయణత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.  మనకు, కరోనా మహమ్మారి కి మధ్యలో నిలబడి ఉన్నారు.  వీరికి దేశమంతా కృతజ్ఞతలు చెబుతోంది. 

నా కోరిక ఒక్కటే.  మార్చి 22వ తేదీ ఆదివారం నాడు మనం ఇటువంటి వ్యక్తులందరికీ ధన్యవాదాలు సమర్పించాలి.  ఆదివారం సరిగ్గా 5 గంటలకు మనం అందరమూ ఇంటి వాకిటి వద్ద నిలబడి, బాల్కనీలో గాని, లేదా కిటికీల దగ్గర గాని నిల్చొని 5 నిమిషాల పాటు ఇటువంటి వ్యక్తులకు కృతజ్ఞతలు తెలపాలి.  చప్పట్లు కొట్టడం ద్వారా, ప్లేట్లను వాయించడం ద్వారా, లేదా గంట కొట్టడం ద్వారా వీరందరికీ వందనాలు సమర్పించాలి.  వీరి మనోబలాన్ని ద్విగుణీకృతం చేయాలి.  దేశంలోని స్థానిక ప్రభుత్వాలకు నా మనవి ఒక్కటే.  మార్చి 22వ తేదీన సరిగ్గా 5 గంటలకు సైరన్ మోత వినిపించడం తోనే ప్రజలకు ఈ సందేశాన్ని అందించాలి.  మన సంస్కారం సేవాహీ పరమో ధర్మః.  దీనిని ప్రజలందరికీ తెలియచేయాలి.  శ్రద్ధతో ఈ భావాన్ని అభివ్యక్తం చేయాలి'' అని మోదీ చెప్పారు.

''ప్రపంచం మొత్తంగా ప్రస్తుతం ఒక సంక్లిష్టమైన దశగుండా ప్రయాణిస్తోంది. సాధారణంగా ప్రకృతిపరమైన సంక్షోభం సంభవించినప్పుడు అది కొన్ని దేశాలకో, కొన్ని రాష్ట్రాలకో పరిమితమవుతుంది. కానీ కరోనా వైరస్ మానవ జాతి మొత్తాన్ని సంక్షోభంలోకి నెట్టివేసింది. ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి మనవంతు ప్రయత్నంగా జాతి మొత్తం ఐక్యంగా నిలబడి ఆదివారం స్వచ్చంద కర్వ్యూ ద్వారా మన మహాసంకల్పాన్ని చాటి చెబుదాం'' అంటూ జాతి నుద్దేశించి గురువారం రాత్రి టీవీ ప్రేక్షకులను ఉద్దేశించి చేసిన 30 నిమిషాల ప్రసంగంలో ప్రధాని తెలిపారు.

''తొలిసారిగా మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కానీ, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కానీ ఇన్ని దేశాలలో ప్రభావం కనిపించలేదు.  ఈ రోజు కరోనా దుష్ప్రభావం అనేక దేశాలలో కనిపిస్తోంది. గత రెండు నెలలుగా నిరంతరం ప్రపంచమంతా కరోనా వైరస్ కు సంబంధించి విషాదకర వార్తలు వస్తున్నాయి. మనం వింటూ ఉన్నాం. గత రెండు నెలలుగా భారతదేశం లోని 130 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలా విజృంభించిన కరోనా వైరస్ ను ప్రతిఘటిస్తున్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  కరోనా మహమ్మారి గురించి నిశ్చింతగా ఉండడమనేది అంత సులువైన అంశం కాదు.  అందువల్ల ప్రతి ఒక్క భారతీయుడు జాగ్రత్తలు పాటించి, అప్రమత్తులై ఉండాలి. ఇది చాలా అవసరం'' అని మోదీ పేర్కొన్నారు.

''ప్రపంచంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కడెక్కడైతే విజృంభించిందో, అక్కడ ఒక విషయం తేటతెల్లమైంది.  ఈ దేశాలలో ప్రారంభావస్థలో కొన్నిరోజుల తర్వాత అనుకోకుండా ఉన్నట్టుండి అకస్మాత్తుగా భయంకరమైన రీతిలో వ్యాధి ప్రబలింది.  ఈ దేశాలలో కరోనా వ్యాధి సంక్రమించిన వారి సంఖ్య వేగంగా పెరిగిపోతోంది.  భారత ప్రభుత్వం ఈ స్థితిపై నిఘా వేసింది. కరోనా వ్యాప్తి చెందే తీరుపై దృష్టి సారించింది.   కొన్ని దేశాలు వెంటనే నిర్ణయం తీసుకున్నాయి. వ్యాధి సోకినవారిని ఇతరులకు దూరంగా పెట్టి ఈ పరిస్థితులను అధిగమించాయి. 

130 కోట్ల మంది ప్రజలున్న భారతదేశంలో, నిరంతరం అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్న మన దేశం ముందుకు కరోనా విపత్తు రావడం సామాన్యమైన విషయం కాదు. ఈ రోజు అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపించడాన్ని మనం చూస్తున్నాం.  అయితే, దీని ప్రభావం భారత్ పై పడదని భావించడం తప్పు. ప్రపంచ స్థాయి లో విజృంభిస్తున్న ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రెండు అంశాలు అవసరం.. మొదటిది సంకల్పం, రెండవది సంయమనం'' అంటూ మోదీ సూచించారు.

చైనాలో మొదలై ప్రస్తుతం ప్రపంచమంతటా వ్యాపించిన కరోనా వైరస్ ప్రభావానికి గత రెండునెలల్లోపే 9 వేలమంది చనిపోగా, 2,50,000 మంది వైరస్ బారినపడ్డారు.

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle